మధుమేహమున్నవారు మటన్ తినొచ్చా? తింటే ఏమవుతుందో చూసేద్దాం.

మధుమేహమున్నవారికి మటన్ అంత మంచిది కాదు. దానిని తింటే సమస్య తీవ్రమవుతుంది.

మటన్​లో సంతృప్త కొవ్వు ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో కొలెస్ట్రాల్​ను పెంచుతుంది.

అధిక కొలెస్ట్రాల్​ వల్ల ఇన్సులిన్ స్థాయిలు పెరుగుతాయి. ఇన్సులిన్ నిరోధకతను ఇది దిగజార్చుతుంది.

మటన్​లోని అధిక ప్రోటీన్, కొవ్వు కలిసి రక్తంలోని షుగర్​ నియంత్రణను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది.

ఒకవేళ మీరు మటన్ తినాలి అనుకుంటే.. లీన్ కట్స్ తీసుకోండి. దీనివల్ల కొవ్వు తీసుకోవడం తగ్గుతుంది.

మటన్​ను మసాలా వేసి వండుకోవడం మాని.. గ్రిల్ లేదా కాల్చడం లేదా సూప్స్​గా చేసుకుని తాగడం చేస్తే బెటర్.

మటన్​ని హెల్తీగానే తీసుకున్నా లిమిట్​గా తీసుకోవాలి. 85 గ్రాములు తీసుకోవచ్చు. అంతకుమించి వద్దు.

తీసుకున్న మటన్​ని బ్యాలెన్స్ చేయడానికి మిల్లెట్స్, పండ్లు, కూరగాయలతో కలిపి డైట్ ఉండేలా చూసుకోవాలి.

మటన్​ తిన్న తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలను ట్రాక్ చేసుకోండి. ఇది సమస్య పెరగకుండా చేయడంలో హెల్ప్ చేస్తుంది.

ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహా ఫాలో అయితే మంచిది.