అన్వేషించండి

Ammayi garu Serial Today December 4th: హత్య చేసిన అశోక్‌ను కోర్టులో ప్రవేశపెట్టిన రాజు...నిర్దోషిగా విడుదలైన ఎమ్మెల్యే విరూపాక్షి

Ammayi garu Serial Today Episode December 4th: అశోక్ జాడ కనుక్కుని వాడిని రాజు కోర్టు ముందు ప్రవేశపెడతాడు. అశోక్‌ హత్య చేసినట్లు ఆధారాలు చూపడంతో విరూపాక్షి నిర్దోషిగా విడుదలవుతుంది.

Ammayi garu Serial Today Episode: విరూపాక్షిని నిర్దోషిగా  నిరూపించడానికి  ఒక్క అవకాశం ఇవ్వాలని రూప కోరగా....జడ్జి 20నిమిషాలు సమయం ఇస్తాడు. ఈలోగా  సాక్ష్యాలు,ఆధారాలు కోర్టు ముందు ఉంచాలని చెబుతాడు. ఇంతలో రాజు  అశోక్‌ కోసం తీవ్రంగా గాలిస్తుంటాడు. శేఖర్ చెప్పినట్లు  సెల్‌ఫోన్ సిగ్నల్స్‌ ట్రేస్ చేసుకుంటూ రాజు...అశోక్ ఉన్న ప్రాంతానికే వస్తాడు. అతని కోసం వెతుకుతుంటాడు. ఈలోగా  కోర్టు ఆవరణలో అందరూ  ఆతృతగా ఎదురుచూస్తుంటారు. ఇంతలో కోమలి  కంగారుపడుతూ  విజయాంబిక వద్దకు వచ్చి అశోక్ దొరికిపోయాడంటారా అని అడుగుతుంది.అశోక్ ఎట్టిపరిస్థితుల్లోనూ  దొరికే ఛాన్స్ లేదని దీపక్ అంటాడు. నువ్వు కంగారుపడి భయపడితే  మా మామయ్య చూస్తాడని  హెచ్చరిస్తాడు. 

అండర్‌గ్రౌండ్‌లో దాక్కుని ఉన్న  అశోక్‌ను వెతుక్కుంటూ రాజు అక్కడికి వస్తాడు. రాజును చూసి అశోక్‌  ఒక్కసారిగా భయపడిపోతాడు. ఇక్కడ దాక్కుంటే ఎవరూ పట్టుకోలేరు అనుకున్నావా అంటాడు. నేను దాక్కోవడం ఎందుకు అని రెట్టించి అశోక్ సమాధానమిస్తాడు. అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంటాడు. చిట్‌ఫండ్ కంపెనీ మేనేజర్‌ను చంపినందుకు నిన్ను కోర్టుకు తీసుకెళ్లడానికే వచ్చానని...మర్యాదగా వస్తే మామూలుగా తీసుకెళ్తానని లేకుంటే తన్ని తీసుకెళ్తానని చెబుతాడు. ఇంతలో అశోక్‌....రాజును నెట్టేసి పారిపోతాడు. దీంతో రాజు అశోక్ వెంటపడి పట్టుకుంటాడు.

           ఇంతలో కోర్టులో ప్రొసెడింగ్స్ తిరిగి ప్రారంభమవుతాయి. జడ్జి సాక్షిని ప్రవేశపెట్టాలని ఆదేశించగా...మరో 10 నిమిషాల సమయం ఇవ్వాలని రూప కోరుతుంది. సమయం మించి పోయిందని న్యాయమూర్తి అంటాడు. మీకు మళ్లీ సమయం ఇవ్వడం కుదరదని చెబుతాడు. ఈ కేసులో ఆధారాలన్నీ పరిశీలించిన తర్వాత విరూపాక్షి ఈ  హత్య చేసినట్లు కోర్టు నమ్ముతుందని న్యాయమూర్తి అంటాడు. కాబట్టి ఆమెకు చట్టప్రకారం శిక్షిస్తామంటూ   తీర్పు వెలువరించే సమయానికి  రాజు...అశోక్‌ను తీసుకొచ్చికోర్టులో ఉంచుతాడు. అశోక్‌ను చూడగానే కోమలిలో భయం మొదలవ్వగా...విజయాంబిక, దీపక్‌ బిక్కముఖం వేస్తారు. చిట్‌ఫండ్‌ కంపెనీ మేనేజర్‌ను చంపింది వీడేనని చెప్పగా...నన్ను కొట్టి బెదిరించి ఈ నేరం ఒప్పుకోమన్నారంటూ అశోక్ జడ్జికి చెబుతాడు. ఆ చిట్‌ఫండ్‌ కంపెనీ ఏంటో...ఆ మేనేజర్ ఎవరో కూడా నాకు తెలియదంటాడు. అతనే ఆ మేనేజర్‌ను చంపాడనడానికి మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా అని లాయర్ రాజును నిలదీస్తాడు. సీసీ కెమెరా  ఆధారాలన్నీ ధ్వంసం చేశారని....వాటిని రికవరీ చేస్తే అసలు వీడియో దొరికిందని రాజు చెబుతాడు. ఆ వీడియోను జడ్జికి అందిస్తాడు. అందులో స్పష్టంగా అశోక్‌ మేనేజర్‌ను చంపుతున్న వీడియో ఉంటుంది. విరూపాక్షి  గన్‌లో నుంచి బుల్లెట్ దొంగలించి  దానితో మేనేజర్‌ను అశోక్ చంపాడని చెబుతాడు. ఆధారాలన్నీ పరిశీలించిన తర్వాత విరూపాక్షిని కోర్టు నిర్దోషిగా విడుదల చేస్తుంది. అలాగే హత్య చేసిన అశోక్‌ను పోలీసు కస్టడీలోక తీసుకోవాల్సిందిగా  ఆదేశిస్తారు. దీంతో కోమలి తీవ్ర ఆందోళన చెందుతుంది. అటు విజయాంబిక,దీపక్‌ కూడా తీవ్రంగా కంగారుపడతారు.అశోక్‌కు ఏమైనా జరిగితే మాదే బాధ్యత అన్న విజయాంబిక, దీపక్‌ వైపు కోమలి చూస్తుంది. వాళ్లు ఆమెను చూసి నీళ్లు నములుతుంటారు.ఇప్పుడు మన పేర్లు బయటకు రాకుండా ఉంటే చాలు అనుకుంటారు. 

టాప్ హెడ్ లైన్స్

Nuvvu leka Neanu Lenu Serial Today Aug 3rd:రాధను ప్రేమిస్తున్నానని తెలుసుకున్న విక్కీ....భర్తపై ఉన్నది అసూయకాదు ప్రేమ అని అర్థం చేసుకున్న రాధ
నువ్వులేక నేను లేను: రాధను ప్రేమిస్తున్నానని తెలుసుకున్న విక్కీ....భర్తపై ఉన్నది అసూయకాదు ప్రేమ అని అర్థం చేసుకున్న రాధ
Karthika Deepam 2 Serial Today August 3rd: కార్తీకదీపం 2 సీరియల్: సూరజ్ గురించి షాకింగ్ విషయాలు తెలుసుకున్న కార్తీక్! ఆ అనాథతో జ్యోత్స్న పెళ్లి!
కార్తీకదీపం 2 సీరియల్: సూరజ్ గురించి షాకింగ్ విషయాలు తెలుసుకున్న కార్తీక్! ఆ అనాథతో జ్యోత్స్న పెళ్లి!
Podarillu Serial Today August 3rd: తల్లితండ్రులనే పోలీసులకు శైలు ఫిర్యాదు...శివంగి ఇంట్లో అందరిపై ఎందుకు విరుచుకుపడింది...?
పొదరిల్లు: తల్లితండ్రులనే పోలీసులకు శైలు ఫిర్యాదు...శివంగి ఇంట్లో అందరిపై ఎందుకు విరుచుకుపడింది...?
Gundeninda Gudigantalu August 3rd Episode:మీనాపై ప్రభావతి ప్రేమ కురిపించడానికి కారణమేంటి..? బాలుకోసం వెతికి మీనాకు ఎవరు కనిపించారు..?
గుండెనిండా గుడిగంటలు: మీనాపై ప్రభావతి ప్రేమ కురిపించడానికి కారణమేంటి..? బాలుకోసం వెతికి మీనాకు ఎవరు కనిపించారు..?

వీడియోలు

Zaheer Abbas About Rohit Sharma & Virat | రో, కోపై పాక్ లెజెండ్ సంచలన వ్యాఖ్యలు
Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
Hardik Pandya Comments On Captaincy | కెప్టెన్సీపై హార్దిక్ పాండ్యా షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Brij Bhushan Sharan Singh: రెజ్లర్ లైంగిక వేధింపుల కేసులో నిర్దోషిగా బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ విడుదల! 
రెజ్లర్ లైంగిక వేధింపుల కేసులో నిర్దోషిగా బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ విడుదల! 
Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ కృష్ణారెడ్డి కేసులో మరో ట్విస్ట్‌! మరో మహిళతో ప్రేమాయణం! లవ్‌లెటర్స్‌, కత్తీ స్వాధీనం!
ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ కృష్ణారెడ్డి కేసులో మరో ట్విస్ట్‌! మరో మహిళతో ప్రేమాయణం! లవ్‌లెటర్స్‌, కత్తీ స్వాధీనం!
AP Voter List Deletions: ఏపీలో 44 లక్షల ఓట్లు గల్లంతు - నెల్లూరు, తిరుపతి, కడపలోనే ఎక్కువ.. ఏ పార్టీకి నష్టం?
ఏపీలో 44 లక్షల ఓట్లు గల్లంతు - నెల్లూరు, తిరుపతి, కడపలోనే ఎక్కువ.. ఏ పార్టీకి నష్టం?
HYDRA Commissioner Ranganath Removal Order: హైడ్రా చుట్టూ న్యాయపరమైన సంక్షోభం - రంగనాథ్ బదిలీకి హైకోర్టు ఆదేశం.. రేవంత్ ప్రభుత్వ వ్యూహం ఏమిటి?
హైడ్రా చుట్టూ న్యాయపరమైన సంక్షోభం - రంగనాథ్ బదిలీకి హైకోర్టు ఆదేశం.. రేవంత్ ప్రభుత్వ వ్యూహం ఏమిటి?
West Bengal Industrial Revival: పశ్చిమ బెంగాల్ పారిశ్రామిక రీ-ఎంట్రీ - సువేందు భవ్య రసాయన్ విజన్.. గుజరాత్, మహారాష్ట్రలకు పోటీగా నిలబడగలదా?
పశ్చిమ బెంగాల్ పారిశ్రామిక రీ-ఎంట్రీ - సువేందు భవ్య రసాయన్ విజన్.. గుజరాత్, మహారాష్ట్రలకు పోటీగా నిలబడగలదా?
Breaking News: కుత్బుల్లాపూర్‌లో భారీ బందోబస్తు మధ్య అక్రమ కట్టడాలు కూల్చివేత!
కుత్బుల్లాపూర్‌లో భారీ బందోబస్తు మధ్య అక్రమ కట్టడాలు కూల్చివేత!
Andhra Pradesh And Telangana Weather Report: ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తేలికపాటి వర్షాలు- వాతావరణ శాఖ లేటెస్ట్ అప్‌డ్టే ఇదే 
ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తేలికపాటి వర్షాలు- వాతావరణ శాఖ లేటెస్ట్ అప్‌డ్టే ఇదే 
Monsoon Humidity : వాతావరణం వల్ల ఇంట్లో బాగా ఉక్కబోస్తుందా? ఏసీ లేకున్నా తేమను తగ్గించే సింపుల్ టిప్స్ ఇవే
వాతావరణం వల్ల ఇంట్లో బాగా ఉక్కబోస్తుందా? ఏసీ లేకున్నా తేమను తగ్గించే సింపుల్ టిప్స్ ఇవే
Embed widget