Ammayi garu Serial Today December 24th: అమ్మాయి గారు సీరియల్: రాజు కథలో రోహిణి.. కొత్త లవ్ స్టోరీ షురూ.. రూపతో ఉన్న బాబు ఎవరు!
Ammayi garu Today Episode రాజు కొడుకు బంటిని ఇంట్లో అందరూ గారాబం చేయడం రూప మరోబిడ్డతో ఇండియా రావడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
![Ammayi garu Serial Today December 24th: అమ్మాయి గారు సీరియల్: రాజు కథలో రోహిణి.. కొత్త లవ్ స్టోరీ షురూ.. రూపతో ఉన్న బాబు ఎవరు! ammayi garu serial today december 24th episode written update in telugu Ammayi garu Serial Today December 24th: అమ్మాయి గారు సీరియల్: రాజు కథలో రోహిణి.. కొత్త లవ్ స్టోరీ షురూ.. రూపతో ఉన్న బాబు ఎవరు!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/12/24/f0534dfa9cce6e9a68d66b8c8705a3b91735013872280882_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Ammayi garu Serial Today Episode రూప, రాజులు విడిపోవడం వల్లే సూర్యప్రతాప్, రూపలు తమని కావాలనే పేదవారిగా మార్చేశారని ముత్యాలు ఫ్యామిలీ మొత్తం అనుకుంటుంది. ఇక ముత్యాలు అంట్లు తోముతూ భర్త అప్పలనాయుడుతో మిడిల్ క్లాస్ బతుకు బతకలేకపోతున్నా అని అంటుంది. అప్పలనాయుడు భార్యకి సర్దిచెప్తాడు. రాజు, అమ్మాయి గారు విడిపోవడంతో అందరి కంటే ఎక్కువ నేనే బాధ పడుతున్నా అని కావాలనే పైకి ధైర్యంగా నటిస్తున్నాను అని మనసులో అనుకుంటుంది.
ముత్యాలు ధనాలుకి పని చెప్పడంతో అన్నీ తనకే చెప్తున్నావు అని వరాలుకి చెప్పడం లేదని విసుగ్గుంటుంది. ఇక వరాలు తన భర్త మల్లేశ్‌తో కలిసి పేపర్‌లో వచ్చిన జాబ్ ఆఫర్లు చూస్తుంది. ఏదో ఒక జాబ్ ఉండాలని విజయాంబిక వాళ్లు తన అన్నయ్య రాజుకి ఎక్కడా జాబ్ దొరక్కుండా చేస్తున్నారని అందుకే పాపం ఇలాంటి పని చేసుకుంటున్నాడని రాజు దుస్థితికి బాధపడతాడు. ఇక రాజు కూరగాయలు తీసుకొని ఓ బైకు మీద అప్పుడే ఇంటికి వస్తాడు. అప్పలనాయుడు బ్యాగ్ తీసుకుంటాడు. ఇక విరూపాక్షి రాజు, అప్పలనాయుడు వాళ్ల కోసం టీ తీసుకొని వస్తుంది. అమ్మగారికి ఇలాంటి పనులు చెప్తున్నారు ఏంటి అని అప్పలనాయుడు అంటాడు. ఇక రాజు తన కొడుకు బంటి గురించి అడుగుతాడు. పడుకున్నాడని ముత్యాలు చెప్తే మీ గారాభం వల్లే వాడు చెడిపోతున్నాడని చెప్పి బంటిని నిద్రలేపడానికి గదికి వెళ్తాడు.
బంటి నిద్ర లేచి తన కళ్లద్దాలు పెట్టుకొని పక్కనే ఉన్న ఓ ఫొటోలో తండ్రి ముఖం చూసి మరోవైపు అమ్మ అని రాసున్న పేరు చూసి అమ్మ అని తర్వాత సాయిబాబాని చూసి నిద్ర లేస్తాడు. రాజు రావడంతో లేచి చేతులు అందిస్తాడు. రాజు బాబుని ఎత్తుకొని స్కూల్‌కి టైం అయిపోయిందని బంటీకి బ్రష్ చేయించి రాజు, ముత్యాలు, అప్పలనాయుడు కలిసి స్నానం చేయిస్తారు. నానమ్మ, తాతయ్య బాబుతో సరదాగా మాట్లాడుకొని బంటి ముద్దు మాటలకు మురిసిపోతారు. ఇక విరూపాక్షి మనవడి స్కూల్ యూనిఫాం ఇస్త్రీ చేస్తుంది. అప్పలనాయుడు షూ పాలిష్ చేస్తే వరాలు, మల్లేశ్ బ్యాగ్ సర్దుతారు. ధనాలు మాత్రం ఏం పట్టనట్లు మూతి ముడుచుకొని టిఫెన్ చేస్తుంటుంది. ముత్యాలు బంటికి ఇడ్లీ తినిపిస్తుంది. ఇక బంటి రాజుతో నాన్న నా ఫ్రెండ్ రాలేదా అని అడుగుతాడు.
అప్పుడే ఓ అమ్మాయి ఎంట్రీ ఇచ్చి ఆరు బయట ఉన్న రాజు షర్ట్ తీసుకొని వేసుకుంటుంది. రాజు తనని ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడా అని అనుకుంటూ రోహిణి బంటి కోసం అన్నట్లు లోపలికి వస్తుంది. బంటి నీ కోసం దోసెలు తీసుకొచ్చానని అంటుంది. ఎన్ని సార్లు చెప్పినా వినవా రోహిణి అని అడుగుతాడు రాజు. ఇంతలో రోహిణి తండ్రి రామనాయుడు వస్తాడు. ఇక నాయుడు ముత్యాలు, అప్పలనాయుడిని బావ, చెల్లి అని రాజుకి గ్యారేజీ చూసుకోమని అంటాడు. ఇక రామనాయుడుని చూసి రోహిణి దాక్కుంటుంది. అయినా రామనాయుడు చూసేస్తాడు. రోహిణి తండ్రిని పేరు పెట్టి పిలిచి మాట్లాడుతుంది. తల్లిలేదని గారాంభం చేయడం వల్ల ఇలా అయిపోయావని స్వీట్‌గా చురకలు ఇస్తాడు. ఇక ముత్యాలుతో చెల్లమ్మా దీనికి త్వరగా పెళ్లి చేసేయాలి అని అంటాడు. రోహిణి, రామనాయుడు పేర్లు కలిసేలా రోహిణి వాళ్లు ఆర్ ఆర్ అని గ్యారేజ్ పెట్టుంటారు.
అందులో రాజు పని చేస్తుంటాడు. రాజు బంటుని స్కూల్‌కి తీసుకెళ్తుంటే అందరూ బయట వరకు డ్రాపింగ్‌కి వస్తారు. బంటి ఒక్క నిమిషం నాన్న అని చెప్పి గదిలో ఉన్న సాయిబాబాని దండం పెట్టుకుంటాడు. నాన్న పక్కన అమ్మని చూడాలని ఉందని ఫొటోలో ఖాళీగా ఉన్న ప్లేస్‌లో అమ్మ ఫొటో వచ్చేలా చేయాలని కోరుకుంటాడు. ఇక రాజు బంటీని తీసుకొని స్కూల్‌కి వెళ్తాడు. రూప ఇండియా వచ్చి కారులో ఇంటికి బయల్దేరుతుంది. జరిగిన దంతా గుర్తు చేసుకుంటుంది. ఇక రూపతో దీపు అనే ఒకబ్బాయి ఉంటాడు. దీపు రూపతో కథ చెప్పమ్మా హాయిగా పడుకుంటాను అని తల్లి ఒడిలో వాలిపోతాడు. ఇక రూప కొడుకుకి తాను రాజు కలిసిన కథ మొత్తం కథలా చెప్తుంది. ఇక రాజు కూడా బంటికి అదే స్టోరీ చెప్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: కార్తీకదీపం 2 సీరియల్: ఏమైందమ్మా ఈనాడు.. చినబోయాడే కార్తీక్ సూరీడు.. శ్రీధర్, కావేరిల ఆఫర్‌కు కాంచన ఒప్పుకుంటుందా!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)