Ammayi garu Serial Today December 21st: అమ్మాయి గారు సీరియల్: ఒక్క అపార్థంతో తల్లీబిడ్డలను శాశ్వతంగా దూరం చేసేసిన రాజు.. బాబుకి నలుగురు అమ్మలు!
Ammayi garu Today Episode రాజు బాబుని తీసుకొచ్చి రూప వద్దని వదిలేసిందని చెప్పడంతో ఇంట్లో అందరూ షాక్ అయిపోతారు దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Ammayi garu Serial Today Episode రాజు తన బిడ్డని తీసుకొని ఇంటికి వస్తాడు. అందరూ బిడ్డని చూసి ఎవరి బిడ్డ అని రాజుని అడుగుతారు. బిడ్డలో చలనం లేదు అని అనుకుంటారు. ఇక రూప ఏడుస్తుంటే సూర్య ఓదార్చుతాడు. రాజు ఏమనుకుంటాడో అని రూప ఇంకా ఏడుస్తుంది. ఇక ఇంతలో రాజు చేతిలో బిడ్డ లేచి కదులుతుంది. అందరూ రాజుని బిడ్డ ఎవరు నువ్వు ఎందుకు తీసుకొచ్చావని అడుగుతారు.
రాజు ముత్యాలుతో ఈ బిడ్డ మీ మనవడు అమ్మా అని చెప్తాడు. అందరూ సంతోషిస్తూనే అలా బిడ్డ ఒక్కడే ఉండటం చూసి షాక్ అయిపోతారు. ఏం అర్థం కాక బిడ్డని తీసుకొని ఎమోషనల్ అవుతారు. అందరూ బిడ్డని తీసుకొని ముద్దాడుతారు.
రాజు: అమ్మగారు ఈ బిడ్డ మీ మనవడు అమ్మగారు. ఈ ఇంటి వారసుడు అమ్మ. ఏంటి అమ్మా నా కొడుకు అనగానే మీరంతా సంతోష పడతారు అనుకుంటే అందరూ అంత కంగారు పడుతున్నారు.
విరూపాక్షి: అంటే రూప డెలివరీ అయిందా రాజు. అంటే రూప మీద కోపంతో నీ రక్తం పంచుకు పుట్టిన బిడ్డని నువ్వు తెచ్చేసుకున్నావా రాజు.
అప్పలనాయుడు: ఎంత పని చేశావురా అయ్యా. నీకు కోపం ఉందని తెలుసుకానీ ఇలా కాసాయి వాడిలా తల్లీబిడ్డని వేరు చేస్తావా.
ముత్యాలు: తల్లి పొత్తిళ్లలో ఉండాల్సిన బిడ్డని అలా తీసుకురావడానికి నీకు మనసెలా వచ్చిందిరా ఆ తల్లి ఎంత బాధ పడుతుందో నీకు తెలీదు. పేగు తెంచుకొని ఒక బిడ్డకి ప్రాణం పోసిన మాకు తెలుసు.
రూప: నా బిడ్డ నాకు కావాలనిపిస్తుంది నాన్న. నా మీద కోపంతో వెళ్లిపోయిన రాజు నా బిడ్డ కోసం అయినా నన్ను దగ్గరకు తీసుకుంటాడని అనుకున్నాను. రాజు కోసం కాకపోయినా నా కోసం అయినా నా బిడ్డ బతికుండాల్సింది నాన్న.
విరూపాక్షి: రాజు పుట్టిన బిడ్డకు తండ్రి ఎంత అవసరమో తెలీదు కానీ తల్లి చాలా అవసరం వాడు ఏడిస్తే ఏం చేయాలో నీకు తెలీదు. వాడి ఆకలి ఆ తల్లికి తెలిసినట్లు నీకు తెలీదు. ఆ తల్లి ఓడినే వాడికి బడి గుడీ అన్నీ.
విజయాంబిక: అమ్మా రూప నీ బాధ మాకు తెలుసు కానీ చనిపోయిన బిడ్డని చూస్తే నీ గుండె ఎక్కడ ఆగిపోతుందో అని పాతి పెట్టమని చెప్పాం పోనీ వాళ్లని అడిగి బిడ్డ శవాన్ని తీసుకొస్తా ఉండు.
సూర్య: వద్దు అక్క రూప తట్టుకోలేదు.
అప్పలనాయుడు: బిడ్డను అప్పగిద్దాం పద.
తల్లి పాలు కూడా తాగలేదు మన మూలంగా ఆ తల్లీబిడ్డలు వేరు కావొద్దు అని అందరూ రాజుతో చెప్తారు. రాజు మాత్రం రూప ఆ బిడ్డ ముఖం చూడను అన్న మాటలు గుర్తు చేసుకొని రూప బతికున్న బిడ్డనే ముట్టను అన్నది అని అనుకుంటాడు. నువ్వు బిడ్డని తీసుకొచ్చినా రూప ఏం అనలేదు అంటే రూపకి నీ మీద ప్రేమ అని అంటుంది. ఇక రూప కనీసం బిడ్డని కళ్లారా చూసుకోలేకపోయానని ఏడుస్తుంది. రాజు రూపని పూర్తిగా అపార్థం చేసుకొని అమ్మాయి గారికి నా మీద ప్రేమ లేదు నా బిడ్డ మీద ప్రేమ లేదని అంటాడు. అందరూ షాక్ అయిపోతారు. అందరూ రూపకి ధైర్యం చెప్తారు. ఇక రాజు ఇంట్లో వాళ్లతో రూపతో పాటు ఫ్యామిలీ మొత్తం బిడ్డని వద్దు అనుకున్నారని బిడ్డని చంపేయమని వేరే వాళ్లకి అప్పగించారని చెప్తాడు. అందరూ నోరెళ్లబెడతారు. రూప నిజంగా అలా అనిందా అని షాక్ అయిపోతారు. రూప అలా అనదని ముత్యాలు అంటుంది. రూప అలా బిడ్డను చంపుకోవాలి అనుకోదని అలా అనుకుంటే బిడ్డను 9 నెలలు మోయదు అని చెప్తుంది.
రూపే కాదు ఏ తల్లీ అలా చేయదు అని విరూపాక్షి చెప్తుంది. రాజు కనీసం హాస్పిటల్‌కి రాలేదా కనీసం బిడ్డ కోసం అయినా వెళ్లలేదా అని అడుగుతుంది. ఇక రాజు రూప ఆ బిడ్డ ముఖం కూడా చూడను అని అందని అంటాడు. బిడ్డను అమ్మాయి గారికి దూరంగా పెంచుదామని రౌడీల దగ్గర నుంచి తీసుకున్నానని చెప్తాడు. విరూపాక్షి కూడా రూపని తప్పుగా అర్థం చేసుకుంటుంది. కన్నబిడ్డను చంపుకోవాలి అనుకున్న తన కూతురు తన దృష్టిలో కూడా చనిపోయిందని అంటుంది. ఇక ముత్యాలు వీడికి కన్నతల్లి లేకపోయినా ఇక్కడ నలుగురు అమ్మలం ఉన్నాం వీడిని కంటికి రెప్పలా చూసుకుంటామని బిడ్డని తీసుకుంటారు. బాబుని తల్లి లేని లోటు లేకుండా చూసుకుందామని అంటాడు. ఇక రాజు బిడ్డ బతికే ఉన్నాడని విషయం వాళ్లకి ఎప్పటికీ తెలీకూడదు అని మీరు ఎవరికీ చెప్పొద్దని అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: అమ్మాయి గారు సీరియల్: భార్య, మామల్ని దారుణంగా అపార్థం చేసుకున్న రాజు.. తండ్రిని చేరిన పసికందు!