Amardeep Chowdary: అమర్ దీప్... ఏమంటున్నావ్ రా, బాతు పేరుతో ప్రేమ లేఖలో ఆ బూతులేంటి?
Kiraak Boys Khiladi Girls Show Highlights: అమర్ దీప్ చౌదరి రాసిన ఓ లవ్ లెటర్ విని 'బూతు' అని రీతూ చౌదరి ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఇంతకీ, ఆ ప్రేమ లేఖలో ఏం ఉందో ఒక్కసారి చూడండి.
Amardeep Chowdary writes love letter to Rithu Chowdary: రీతూ చౌదరికి అమర్ దీప్ చౌదరి లవ్ లెటర్ రాశాడు. 'అదేంటి? ఆరిస్ట్ తేజస్విని గౌడతో అతను ఏడు అడుగులు వేశాడు కదా, పెళ్లి అయ్యిందిగా! మళ్లీ రీతూకి ప్రేమ లేఖ ఏంటి?' అని అనుకోవద్దు. 'కిరాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్' షోలో టాస్క్ రావడంతో లెటర్ రాశాడు. ఆ ప్రేమ లేఖలో ప్రాస కోసం అమర్ దీప్ చౌదరి పడిన పాట్లు రీతూ చౌదరితో పాటు ఆ షోలో మిగతా కంటెస్టెంట్లకు ఒక్కసారి షాక్ ఇచ్చింది. ఎందుకో కింద ఉన్న లెటర్ చదివితే మీకే అర్థం అవుతుంది.
అమర్ దీప్ చౌదరి రాసిన ఆ లెవ్ లెటర్: (షోలో శ్రీముఖి చదివిన దాని ప్రకారం)
'రీతూ... యు ఆర్ ఇండోనేషియన్ బాతు
రీతూ... యువర్ హార్ట్ ఈజ్ యాజ్ వైట్ యాజ్ ఫెదర్ బాతు
రీతూ... నువ్వు ఎప్పుడు పిలిస్తే నేను అప్పుడు ఆతు' (హిందీ పదం... వస్తా అని మీనింగ్ అంట!)
పైన ప్రేమ లేఖలో శ్రీముఖి మూడో లైన్ చదివిన తర్వాత రీతూ చౌదరి ఒక్కసారిగా కంగు తిన్నది. 'ఆ... ఏమన్నావ్ రా?' అంటూ గుండెల మీద చెయ్యి వేసుకుని మరీ భయపడింది. భయంతో కూడిన నవ్వులతో, అతడు రాసిన లైన్లు అర్థం కాక 'అరే ఏం అన్నావ్ రా' అని అడిగింది. అప్పుడు అనసూయ లైనులోకి వచ్చింది.
'దటీజ్ హైదరాబాద్ లాంగ్వేజ్' అని అనసూయ వివరణ ఇచ్చింది. దాంతో షోలో ఉన్న జనాలు సైతం 'ఓహో' అనుకుని ఆగారు. ఎంత హైదరాబాదీ హిందీ అయినా సరే తెలుగులో బూతుగా ధ్వనించే పదం రాయడం ఎందుకో మరి? అక్కడితో లెటర్ అవ్వలేదు.
'రీతూ... యు ఆర్ యాజ్ స్పైసీ యాజ్ మసాలా ఫ్రైడ్ బాతు
రీతూ... యువర్ మౌత్ యాజ్ సేమ్ యాజ్ బాతు
రీతూ... ఎప్పుడు పడితే అప్పుడు బ్యాంకాక్ కి జాతు
ఐ విష్ నేను నీ వెనుక ఆతు
రీతూ... మై దేతా మేరా హాతు
రీతూ... నువ్ కాదు అంటే తింటా పాయిజన్ కలిపిన బాతు
రీతూ... ఇది నేను రాసిన చివరి రాతు'
- ఇదండీ ప్రాస కోసం అమర్ దీప్ చౌదరి పడిన ప్రయాస, భాషను కూని చేసిన యాస. లెటర్ మధ్యలో ఉండగా 'నువ్వు లవ్ లెటర్ రీతూకి రాశావా లేదంటే బాతుకు రాశావా?' అని విష్ణు ప్రియా భీమనేని అడిగింది. లెటర్ అంతా చదివిన తర్వాత 'తూ' అని శ్రీముఖి ఉమ్మేసింది.
Also Read: రీతూ చౌదరి లవర్ గురించి సీక్రెట్ బయటపెట్టిన విష్ణుప్రియ - ఇదెక్కడి ట్విస్ట్ రా మావ!
'మాస్టర్... మీ వాడు లెటర్ ఎలా రాశాడు?' అని శ్రీముఖి అడిగితే 'బొక్కలా ఉంది' అని శేఖర్ మాస్టర్ చెప్పాడు. అయినా సరే అమర్ దీప్ చౌదరి తన లెటర్ గురించి అర్థం చేసుకోలేదు. 'మాస్టర్ తిట్టినా సరే పొగిడినట్టు ఉంటుంది' అని కవర్ చేసే ప్రయత్నం చేశాడు.
Also Read: హైపర్ ఆది... నన్ను టచ్ చేయకు - శ్రీ సత్య కామెంట్స్, అతడి పరువు తీసి పారేసిన హన్సిక!