News
News
X

Kanishka Soni: తనని తానే పెళ్లి చేసుకున్న సీరియల్ నటి - పురుషుడితో పనేంటి? అంటూ షాకింగ్ కామెంట్స్!

ప్రముఖ టీవీ నటి కనిష్క సోనీ పెళ్లి చేసుకుంది. అందులో వింతేముంది అంటారా? అసలు విషయం తెలిస్తే మీరు షాక్ అవుతారు.

FOLLOW US: 

టీవీ నటి, ‘దియా ఔర్ బతి హమ్’ ఫేమ్ కనిష్కా సోనీ పెళ్లి చేసుకుని అందరికీ షాక్ ఇచ్చింది. అదేంటి పెళ్లి చేసుకుంటే మంచి విషయమే కదా అని అనుకుంటున్నారా? అయితే తను ఎవరిని పెళ్లి చేసుకుందో తెలిస్తే మీరు షాక్ అవుతారు. ఎందుకంటే సోనీ తనని తానే పెళ్లి చేసుకుంది. ఇటీవల సోనీ తన ఇన్ స్టాగ్రామ్ లో మెడలో మంగళ సూత్రం, నుదుటిన కుంకుమపెట్టుకుని ఉన్న ఫోటో ఒకటి పోస్ట్ చేస్తూ తన పెళ్లి విషయం బయట పెట్టేసింది.

‘‘నన్ను నేను పెళ్లి చేసుకుని నా కలలన్నీ నెరవేర్చుకున్నాను. నా ప్రేమలో ఉన్న ఏకైక వ్యక్తిని నేనే. అన్ని ప్రశ్నలకు నేనే సమాధానం. నాకు ఏ పురుషుడితో అవసరం లేదు. నా గిటార్ తో ఒంటరిగా నేను ఎప్పుడు సంతోషంగా ఉంటాను. నేనే దేవతని. స్ట్రాంగ్ అండ్ పవర్ ఫుల్, శివుడు, శక్తి  అంతా నాలోనే ఉంది. ధన్యవాదాలు'’ అంటూ మంగళసూత్రంతో ఉన్న ఫోటో పెట్టి అందరికీ షాక్ ఇచ్చింది. దీనిపై నెటిజన్లు విపరీతమైన ట్రోల్స్ చేశారు దాంతో సోనీ వాళ్ళందరికీ ఘాటుగా బదులిచ్చింది.

కనిష్క సోనీ దీని గురించి మాట్లాడుతూ ఇన్ స్టా స్టోరీలో 6 నిమిషాల నిడివిగల ఒక వీడియోని పోస్ట్ చేసింది. ఈ పెళ్లి గురించి తను అందులో మాట్లాడింది. ‘‘నాకు తెలుసు మీరందరూ నన్ను నేను పెళ్లిచేసుకోవడం గురించి ఎన్ని ప్రశ్నలు సంధిస్తారని. నాకు భారతీయ సాంప్రదాయంపై యెనో గౌరవం ఉంది. పెళ్లి అనేది కేవలం శృంగారానికి సంబంధించినదే కాదు.. ప్రేమ, నిజాయితీ ఒకరి నుంచి మరొకరు కోరుకునేది. నేను ఆ విశ్వాసాన్ని కోల్పోయానని నమ్ముతున్నాను. అందుకే నన్ను నేను పెళ్లి చేసుకున్నాను. గూగుల్ లో నా పోస్ట్ నా న్యూస్ ట్రెండింగ్ చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు’' అని తెలిపింది.

‘‘ఈ పోస్ట్ పెట్టినప్పుడు కొందరు నేను తాగి ఉన్నానని డ్రగ్స్ తీసుకున్న మైకంలో ఉన్నానని అనుకున్నారు. కానీ నేను చాలా కాలం పాటు సినిమా ఇండస్ట్రీలో ఉన్నా కానీ అటువంటి పనులు ఎప్పుడు చెయ్యలేదు. నేను హృదయపూర్వకంగా చెప్తున్నాను నేను భారతీయురాలిని. మరి కొన్ని సంవత్సరాల పాటు నేను సినిమా ఇండస్ట్రీలో ఉన్నా కూడా అటువంటి అలవాట్లు జోలికి వెళ్ళను అని కచ్చితంగా చెప్తాను. ఇది నేను హృదయపూర్వకంగా తెలివిలో ఉండే తీసుకున్న నిర్ణయం. ప్రస్తుతం నేను యూఎస్ఏ లో ఉన్నందుకు సంతోషిస్తున్నా. హాలీవుడ్ లో నా కెరీర్ పై దృషి పెడుతున్నా’’ అని వీడియాలో చెప్పుకొచ్చారు.

సోనీ 'పవిత్ర రిష్ట', 'దియా ఔర్ బతి హమ్' సీరియల్ తో మంచి పాపులారిటీ సంపాదించుకుంది. సోలోగమి పెళ్లి చేసుకుని అందరికీ షాక్ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. గతంలో గుజరాత్ కి చెందిన క్షమా బిందు అనే 24 ఏళ్ల యువతి కూడా ఇదే విధంగా సోలోగమి వివాహం చేసుకుంది. అప్పట్లో ఇది సంచలనంగా మారింది. పలువురు దీన్ని వ్యతిరేకించారు. అయినా కూడా చెప్పిన తేదీ కంటే ముందే ఆమె వివాహం చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది.

Also Read : తీస్ మార్ ఖాన్ రివ్యూ : రేసుగుర్రంలా దూసుకు వెళ్ళాలనుకున్న ఆది సాయి కుమార్, సినిమా ఎలా ఉందంటే?

Also Read : హైవే రివ్యూ : విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ విజయం అందుకున్నారా? లేదా?

 

 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Kanishka Soni (@itskanishkasoni)

Published at : 20 Aug 2022 04:28 PM (IST) Tags: Kanishka Soni TV Actress Kanishka Soni Got Married Diya Aur Bati Hum Actress Got Sologami Marriage

సంబంధిత కథనాలు

Allu Arjun: నేనెందుకూ పనికి రానని ఆయన ఫీలింగ్ - బన్నీ కామెంట్స్ వైరల్!

Allu Arjun: నేనెందుకూ పనికి రానని ఆయన ఫీలింగ్ - బన్నీ కామెంట్స్ వైరల్!

Dooralaina Theeralaina: 'ది ఘోస్ట్' - రోల్ రైడా పాడిన ర్యాప్ సాంగ్ అదిరిందిగా!

Dooralaina Theeralaina: 'ది ఘోస్ట్' - రోల్ రైడా పాడిన ర్యాప్ సాంగ్ అదిరిందిగా!

Prabhas-Maruthi: ప్రభాస్‌తో హారర్ కామెడీ కాదు - కథ మారిందట!

Prabhas-Maruthi: ప్రభాస్‌తో హారర్ కామెడీ కాదు - కథ మారిందట!

God Father: చిరంజీవి 'గాడ్ ఫాదర్' టైటిల్ సాంగ్ వచ్చేసిందోచ్!

God Father: చిరంజీవి 'గాడ్ ఫాదర్' టైటిల్ సాంగ్ వచ్చేసిందోచ్!

Dasara: 'దసరా' మాసీ లోకల్ స్ట్రీట్ సాంగ్ - నాని ఊరమాస్ స్టెప్స్!

Dasara: 'దసరా' మాసీ లోకల్ స్ట్రీట్ సాంగ్ - నాని ఊరమాస్ స్టెప్స్!

టాప్ స్టోరీస్

Dharmana : రాజధాని లేక పోవడానికి చంద్రబాబే కారణం - మేధావులు స్పందించాలని పిలుపునిచ్చిన మంత్రి ధర్మాన !

Dharmana :  రాజధాని లేక పోవడానికి చంద్రబాబే కారణం  - మేధావులు స్పందించాలని పిలుపునిచ్చిన మంత్రి ధర్మాన !

Jasprit Bumrah Ruled Out: భయాలే నిజం అయ్యాయ్ - టీ20 వరల్డ్‌కప్ నుంచి బుమ్రా అవుట్!

Jasprit Bumrah Ruled Out: భయాలే నిజం అయ్యాయ్ - టీ20 వరల్డ్‌కప్ నుంచి బుమ్రా అవుట్!

రూ.12 వేలలోపే నోకియా ట్యాబ్ - భారీ డిస్‌ప్లేతో!

రూ.12 వేలలోపే నోకియా ట్యాబ్ - భారీ డిస్‌ప్లేతో!

In Pics : చంద్రప్రభ వాహనంపై శ్రీవారు, నర్తనకృష్ణుడి అలంకారంలో భక్తులకు దర్శనం

In Pics : చంద్రప్రభ వాహనంపై శ్రీవారు, నర్తనకృష్ణుడి అలంకారంలో భక్తులకు దర్శనం