Actress Tulasi On Ali : ఆలీ కంత్రి, ఆ సినిమా షూటింగ్‌లో నాకు సైటు కొట్టేవాడు - నటి తులసి
ఆలీ కంత్రి అని నటి తులసి కామెంట్ చేశారు. తనకు సైట్ కొట్టేవాడని చెప్పారు. ఈ ఇద్దరికీ ఎక్కడ పరిచయం? ఏంటి? అనే వివరాల్లోకి వెళితే...
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఆలీ (Actor Ali) ప్రయాణం బాల నటుడిగా మొదలైంది. ఆ తర్వాత కథానాయకుడిగా కొన్ని సినిమాలు చేశారు. హీరోగా, కమెడియన్‌గా పేరు తెచ్చుకున్న తర్వాత టీవీ కోసం హోస్ట్ అవతారం ఎత్తారు. 'ఆలీతో సరదాగా' కార్యక్రమంతో ప్రతి వారం సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేస్తూ వీక్షకులకు వినోదం పంచుతున్నారు. ఇప్పుడీ షో లేటెస్ట్ ఎపిసోడ్ కోసం నటి తలసి, నటుడు 'ప్రభాస్' శ్రీను వచ్చారు. తులసి కూడా బాలనటిగా ప్రయాణం స్టార్ట్ చేశారు.
'నాలుగు స్తంభాలాట' సినిమాలో ఆలీ, తులసి నటించారు. అప్పుడు 'మీ ఇద్దరికీ ఎలా పరిచయం?' అని 'ప్రభాస్' శ్రీను అడిగితే... తనకు సైట్ కొట్టాడని తులసి చెప్పారు.
ఆలీ తనకు సైట్ కొట్టాడన్న తులసి!
'నాలుగు స్తంభాలాట'లో ఆవిడ (తులసి - Actress Tulasi) హీరోయిన్ అని ఆలీ అన్నారు. వెంటనే అందుకున్న తులసి ''నాకు సైట్ కొట్టేవాడు. నేను చెబుతున్నా విను శ్రీను... ఇంత ఉండేవాడు, అంత కంత్రి'' అని చెప్పుకొచ్చారు.
'కార్తికేయ 2' ప్రెస్‌మీట్ స్పీచ్... ఛాన్సులు!
'కార్తికేయ 2' సినిమాలో తల్లి పాత్రలో తులసి నటించారు. అది పాన్ ఇండియా స్థాయిలో విజయం సాధించడంతో ఆమె పాన్ ఇండియా మదర్ అయిపోయారని ఆలీ వ్యాఖ్యానించారు. మధ్యలో అందుకున్న 'ప్రభాస్' శ్రీను... ''అన్నా! ఆ సినిమా ప్రెస్‌మీట్‌లో అద్భుతంగా మాట్లాడారు. పిచ్చెక్కిపోయింది'' అన్నారు. వెంటనే తులసి ''సినిమా ఒక ఎత్తు అయితే... ఆ స్పీచ్ వల్ల నాకు ఎన్ని సినిమాలు వచ్చాయంటే, ఏమని చెప్పాలి'' అన్నారు. ఒక్క స్పీచ్ చాలా ఛాన్సులు తెచ్చిందని ఆవిడ చెప్పారు.
మూడో నెల నుంచి నటించా!
వందేళ్ళ తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తనది 56 ఏళ్ళ ప్రయాణం అని తులసి చెప్పారు. ''నేను 1967లో నేను జన్మించాను. మూడో నెలలో నేను నటించాను. నాకు మూడేళ్ళ వయసు ఉన్నప్పుడు ఓ సినిమాలో డైలాగ్ చెప్పాను. వందేళ్ళ తెలుగు సినిమా ప్రయాణంలో నాది 56 ఏళ్ళ ప్రయాణం'' అని తులసి చెప్పారు. ''ఇంకో నాలుగు సంవత్సరాలు అయితే షష్ఠిపూర్తి'' అని 'ప్రభాస్' శ్రీను వ్యాఖ్యానించారు. ''షష్ఠిపూర్తి ఆ? చచ్చిపూర్తినా?'' అని తులసి సరదాగా సైగలు చేశారు.
బయటకు వచ్చినప్పుడు బొట్టు పెడతా!
'ఆలీతో సరదాగా' కార్యక్రమానికి 'ప్రభాస్' శ్రీను బొట్టు పెట్టుకుని, కళ్ళజోడు వేసుకుని వచ్చారు. రాముడు మంచి బాలుడు అన్నట్టు వచ్చాడని, ఆయనపై ఆలీ సెటైర్స్ వేశారు. 'రోజూ బొట్టు పెడతావా?' అని ఆలీ అడిగితే... ''బయటకు వచ్చినప్పుడు బొట్టు పెడతా'' అని 'ప్రభాస్' శ్రీను సమాధానం ఇచ్చారు. ఇంకా మాట్లాడుతూ ''ఇది వరకు అయితే తొమ్మిది తర్వాత బొట్టు వేరేగా వెళ్ళిపోయేది. ఐరోపా మ్యాప్ అయిపోతది'' అని నవ్వించారు.
Also Read : సమంత గ్లిజరిన్ వాడలేదు - జ్వరంలోనూ స్టంట్స్!
'ప్రభాస్' శ్రీను జంతువులతో మాట్లాడతాడని ఆలీ చెప్పారు. మందు కొట్టినప్పుడు ఇంట్లో అక్వేరియంలో చేపలతో మాట్లాడతానని చెప్పి 'ప్రభాస్' శ్రీను నవ్వించారు. అదీ సంగతి. ఈ ఎపిసోడ్ నవంబర్ 14న టెలికాస్ట్ కానుంది. ప్రోమో చివర్లో 'ప్రభాస్' శ్రీను వేసిన డ్యాన్స్ హైలైట్ అని చెప్పాలి.