News
News
X

SSMB28: మహేష్ సినిమాలో ఐటెం సాంగ్ - త్రివిక్రమ్ ఒప్పుకుంటారా?

SSMB28 సినిమాకి సంబంధించిన ఓ షెడ్యూల్ పూర్తయింది. త్వరలోనే కొత్త షెడ్యూల్ ని మొదలుపెట్టబోతున్నారు. 

FOLLOW US: 
సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో పూజాహెగ్డే హీరోయిన్ గా తీసుకున్నారు. రీసెంట్ గా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను మొదలుపెట్టారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ సినిమా నిర్మిస్తోంది. మహేష్ బాబు కెరీర్ లో 28వ సినిమా (SSMB 28 Movie) ఇది. ఈ సినిమాలో సరికొత్త లుక్ తో కనిపించబోతున్నారు మహేష్ బాబు. చాలా ఏళ్ల తరువాత త్రివిక్రమ్-మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తోన్న సినిమా కావడంతో మంచి బజ్ క్రియేట్ అవుతోంది. 
 
రీసెంట్ గానే ఈ సినిమాకి సంబంధించిన ఓ షెడ్యూల్ పూర్తయింది. త్వరలోనే కొత్త షెడ్యూల్ ని మొదలుపెట్టబోతున్నారు. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. తొలిసారి మహేష్ బాబు కోసం త్రివిక్రమ్ ఐటెం సాంగ్ పెట్టబోతున్నారట. ఈ విషయంపై నిర్మాత నాగవంశీ కూడా స్పందించారు. సినిమాలో ఐటెం సాంగ్ పెట్టాలని అనుకున్న మాట నిజమేనని.. కానీ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. 
 
మహేష్ బాబు గారి ఫ్యాన్స్, మాస్ ప్రేక్షకుల కోసం ఐటెం సాంగ్ పెడితే బాగుంటుందని.. త్రివిక్రమ్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నట్లు చెప్పారు నాగవంశీ. ఆయన ఇంకా ఈ విషయంపై డెసిషన్ తీసుకోలేదని చెప్పారు. మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన 'అతడు', 'ఖలేజా' రెండూ థియేటర్లో అనుకున్నంత స్థాయిలో ఆడలేకపోయాయని.. కానీ టీవీలో బిగ్గెస్ట్ వ్యూస్ అందుకున్నాయని చెప్పారు. 
 
ఈసారి ఈ కాంబో మీద ఎన్ని అంచనాలు పెట్టుకున్నా.. వాటిని మించి సినిమా ఉంటుందని నమ్మకం వ్యక్తం చేశారు నాగవంశీ. సాధారణంగా త్రివిక్రమ్ సినిమాల్లో ఐటెం సాంగ్ ఉండదు కానీ స్పెషల్ పబ్ సాంగ్స్ లాంటివి ఉంటాయి. ఇప్పుడు మహేష్ బాబు కోసం తన పంథా మార్చుకొని ఐటెం సాంగ్ పెడతారో లేదో చూడాలి!
 
#SSMB28Aarambham:
ఇదిలా ఉండగా.. ఈ సినిమా షూటింగ్ మొదలవ్వక ముందు, షూటింగ్ మొదలైన తరువాత.. సినిమాకి టైటిల్ ఇదేనంటూ చాలా రూమర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. షూటింగ్ మొదలుపెట్టిన రోజు #SSMB28Aarambham అంటూ మేకర్స్ ఒక హ్యాష్ ట్యాగ్ వదలడంతో.. ఈ సినిమాకి టైటిల్ హింట్ ఇచ్చేశారని అందరూ భావించారు. 'ఆరంభం'(Aarambham) అనేది  సినిమా టైటిల్ అని.. అందుకే అలా ట్యాగ్ చేశారంటూ ఆ టైటిల్ ను ట్రెండ్ చేశారు.
 
'అయోధ్యలో అర్జునుడు':
మేకర్స్ మాత్రం ఈ టైటిల్ పై క్లారిటీ ఇవ్వలేదు. ఇప్పుడు మరో టైటిల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అటు త్రివిక్రమ్, ఇటు మహేష్ బాబు ఇద్దరి సెంటిమెంట్ కలగలిసేలా 'అయోధ్యలో అర్జునుడు' అనే టైటిల్ పెట్టబోతున్నారని టాక్. ఇదే టైటిల్ కన్ఫర్మ్ అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఇదివరకు త్రివిక్రమ్ సినిమాల టైటిల్ విషయంలో ఏం జరిగేదో అందరికీ తెలిసిందే. ఒక టైటిల్ ను వారే క్రియేట్ చేసి జనాల్లోకి వదిలేవారు. ఆ టైటిల్ కి వచ్చిన రెస్పాన్స్ చూసి టైటిల్ మార్చడమా..? ఫైనల్ చేయడమా..? అనే విషయంలో నిర్ణయం తీసుకునేవారు. మరిప్పుడు 'అయోధ్యలో అర్జునుడు' టైటిల్ ను ఫైనల్ చేస్తారో లేదో చూడాలి!
Published at : 01 Oct 2022 05:11 PM (IST) Tags: Mahesh Babu Trivikram ssmb28 movie SSMB28 Item song

సంబంధిత కథనాలు

Gruhalakshmi November 28th: లాస్య నిజస్వరూపం తెలుసుకున్న నందు- పరంధామయ్యని ఇంటికి తీసుకొచ్చిన సామ్రాట్

Gruhalakshmi November 28th: లాస్య నిజస్వరూపం తెలుసుకున్న నందు- పరంధామయ్యని ఇంటికి తీసుకొచ్చిన సామ్రాట్

Guppedanta Manasu November 28th: నిజం తెలిసి గౌతమ్ ని ఛీ కొట్టిన రిషి- దేవయానికి వార్నింగ్ ఇచ్చిన మహేంద్ర

Guppedanta Manasu November 28th: నిజం తెలిసి గౌతమ్ ని ఛీ కొట్టిన రిషి- దేవయానికి వార్నింగ్ ఇచ్చిన మహేంద్ర

Karthika Deepam November 28th: విషమంగా దీప ఆరోగ్యం- నిజం తెలిసి మోనితని బురిడీ కొట్టించిన శివ

Karthika Deepam November 28th: విషమంగా దీప ఆరోగ్యం- నిజం తెలిసి మోనితని బురిడీ కొట్టించిన శివ

Ennenno Janmalabandham November 28th: కోర్టులో నేరం చేశానని ఒప్పుకున్న మాళవిక, షాకైన వేద - ఖుషి మీద అరిచిన ఆదిత్య

Ennenno Janmalabandham November 28th: కోర్టులో నేరం చేశానని ఒప్పుకున్న మాళవిక, షాకైన వేద - ఖుషి మీద అరిచిన ఆదిత్య

Building For Pigeons: పావురాల కోసం రెండంతస్తుల భవనం - మ్యూజిక్ సిస్టమ్, మరెన్నో ప్రత్యేకతలు

Building For Pigeons: పావురాల కోసం రెండంతస్తుల భవనం - మ్యూజిక్ సిస్టమ్, మరెన్నో ప్రత్యేకతలు

టాప్ స్టోరీస్

KCR Review Meeting: రొటీన్‌గా కాదు, గొప్పగా పనిచేయండి - విప్లవాత్మక మార్పులు తీసుకొద్దాం: సీఎం కేసీఆర్

KCR Review Meeting: రొటీన్‌గా కాదు, గొప్పగా పనిచేయండి - విప్లవాత్మక మార్పులు తీసుకొద్దాం:  సీఎం కేసీఆర్

మంత్రి అప్పలరాజుకు అసమ్మతి సెగ, అతడిని ఓడించాలంటూ వైసీపీ నేతల ప్రచారాలు!

మంత్రి అప్పలరాజుకు అసమ్మతి సెగ, అతడిని ఓడించాలంటూ వైసీపీ నేతల ప్రచారాలు!

Bandi Sanjay : పాలన చేతగాక పోతే ఇంట్లో కూర్చోండి, భైంసా ఏమైనా నిషేధిత ప్రాంతమా? - బండి సంజయ్

Bandi Sanjay :  పాలన చేతగాక పోతే ఇంట్లో కూర్చోండి, భైంసా ఏమైనా నిషేధిత ప్రాంతమా? - బండి సంజయ్

Weather Latest Update: ‘ఆ ఫేక్ తుపానును నమ్మొద్దు’ -ఏపీకి స్వల్ప వర్ష సూచన! తెలంగాణలో 4 జిల్లాలకి చలి అలర్ట్

Weather Latest Update: ‘ఆ ఫేక్ తుపానును నమ్మొద్దు’ -ఏపీకి స్వల్ప వర్ష సూచన! తెలంగాణలో 4 జిల్లాలకి చలి అలర్ట్