(Source: ECI/ABP News/ABP Majha)
Aadi's Top Gear Movie : ఆది 'టాప్ గేర్' సినిమా సెన్సార్ పూర్తి - ఇయర్ ఎండ్‌లో గ్రాండ్ రిలీజ్
Aadi Saikumar's Top Gear Movie : ఆది సాయి కుమార్ హీరోగా నటించిన 'టాప్ గేర్' సినిమా సెన్సార్ కార్యక్రమాలు కంప్లీట్ అయ్యాయి.
ఆది సాయి కుమార్ (Aadi Sai Kumar) కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం 'టాప్ గేర్' (Top Gear Telugu Movie). ఇందులో రియా సుమన్ కథానాయిక. ఆల్రెడీ విడుదలైన ట్రైలర్, పాటలకు మంచి స్పందన లభించింది. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే... సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి.
'టాప్ గేర్'కు యు/ఎ
'టాప్ గేర్'కు సెన్సార్ బోర్డు యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చింది. సినిమా చాలా గ్రిప్పింగ్‌గా ఉందని, మంచి థ్రిల్లర్ తెరకెక్కించారని చిత్ర బృందాన్ని సెన్సార్ సభ్యులు అభినందించారు. ఇయర్ ఎండ్‌లో సినిమాను గ్రాండ్‌గా రిలీజ్ చేయడానికి యూనిట్ సభ్యులు రెడీ అయ్యారు.
ప్రముఖ మ్యూజిక్ లేబుల్ ఆదిత్య మ్యూజిక్ అనుబంధ సంస్థ ఆదిత్య మూవీస్ & ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో శ్రీ ధనలక్ష్మి ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందింది. కేవీ శ్రీధర్ రెడ్డి నిర్మాత. ఈ చిత్రానికి శశికాంత్ దర్శకత్వం వహించారు. డిసెంబర్ 30న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నెల 23న ఆది సాయికుమార్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు.
పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'టాప్ గేర్'లో ఆది సాయికుమార్ టాక్సీ డ్రైవర్‌గా కనిపించనున్నారని దర్శక నిర్మాతలు ముందే వెల్లడించారు. టీజర్, ట్రైలర్‌లో ఆయన టాక్సీ డ్రైవ్ చేస్తున్నట్లు చూపించారు. అసలు ఓ టాక్సీ డ్రైవర్‌ను కొంత మంది ఎందుకు టార్గెట్ చేశారు? అనేది ఆసక్తికరమైన అంశం.
Also Read : ఏపీలో రామ్ చరణ్ సుడిగాలి పర్యటన - ఎందుకంటే?
'టాప్ గేర్' టీజర్, ట్రైలర్లు సినిమాపై క్యూరియాసిటీ పెంచాయని, మంచి థ్రిల్లర్ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నామని చిత్ర బృందం పేర్కొంది. ''అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే కథాంశంతో ఓ డిఫరెంట్ పాయింట్ టచ్ చేస్తూ రూపొందించాం'' అని దర్శకుడు శశికాంత్ తెలిపారు.
వెన్నెల... వెన్నెల... పెళ్లి తర్వాత పాట!
'టాప్ గేర్' చిత్రంలో ఆది సాయి కుమార్‌కు జంటగా రియా సుమన్ (Riya Suman) నటించారు. కథలో భాగంగా వీళ్లిద్దరికీ పెళ్లి అవుతుంది. ఆ సమయంలో వచ్చే 'వెన్నెల వెన్నెల...' పాటను ప్రముఖ గాయకుడు సిద్ శ్రీరామ్ ఆలపించారు. ఈ మధ్య ఆ పాటను విడుదల చేశారు. దానికి మంచి స్పందన లభిస్తోందని చిత్ర బృందం సంతోషం వ్యక్తం చేసింది.
ఈ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించారు. ఆయన బాణీకి సిద్ శ్రీరామ్ గాత్రం తోడు కావడంతో సాంగ్ సూపర్ ఉందని నెటిజన్లు చెబుతున్నారు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం సైతం బావుందని చెబుతున్నారు.
Also Read : ఆస్కార్ బరిలో తెలుగమ్మాయి నిర్మించిన పాకిస్తాన్ సినిమా
బ్రహ్మాజీ, 'సత్యం' రాజేష్, మైమ్ గోపి, నర్రా శ్రీనివాస్, శత్రు, బెనర్జీ, 'చమ్మక్' చంద్ర, 'రేడియో మిర్చి' హేమంత్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కళ : రామాంజనేయులు, ఛాయాగ్రహణం : సాయి శ్రీరామ్, కూర్పు : ప్రవీణ్ పూడి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత : గిరిధర్ మామిడిపల్లి, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: శశికాంత్, నిర్మాత : కేవీ శ్రీధర్ రెడ్డి.