News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

‘ఏజెంట్’ ఓటీటీ రిలీజ్ డేట్, ‘సప్త సాగరాలు దాటి’ రివ్యూ - నేటి టాప్ సినీ విశేషాలివే!

ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి.

FOLLOW US: 
Share:

ఓటీటీలోకి ‘ఏజెంట్’ ఎంట్రీ - డేట్ ఫిక్స్ చేసిన సోనీ లివ్!
అఖిల్ అక్కినేని (Akhil Akkineni) హీరోగా, సురేందర్ రెడ్డి (Surender Reddy) దర్శకత్వంలో రూపొందిన ‘ఏజెంట్’ (Agent) ఈ సంవత్సరం ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అఖిల్ కెరీర్‌లో అతి పెద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ఈ కారణంగా థియేటర్లలో ఈ సినిమా చూడని ఆడియన్స్ ఓటీటీ రిలీజ్ (Agent OTT Release Date) కోసం వెయిట్ చేశారు. ఇప్పుడు ఐదు నెలల తర్వాత ఏజెంట్ ఓటీటీలో స్ట్రీమ్ కానుంది. సెప్టెంబర్ 29వ తేదీన ‘ఏజెంట్’ను స్ట్రీమ్ చేయనున్నట్లు సోనీ లివ్ అధికారికంగా ప్రకటించింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

నయనతార సినిమాకి 'A' సర్టిఫికెట్ - ఎటువంటి కట్స్ లేకుండానే రిలీజ్?
కోలీవుడ్ అగ్ర హీరోయిన్ లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో బిజీబిజీగా గడుపుతోంది. ఇటీవలే షారుఖ్ ఖాన్ సరసన 'జవాన్' సినిమాతో బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి భారీ సక్సెస్ అందుతుంది. కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహించిన 'జవాన్' బాక్స్ ఆఫీస్ వద్ద వెయ్యికోట్ల దిశగా పరుగులు పెడుతోంది. ఈ క్రమంలోనే జవాన్ సక్సెస్ తో నయనతార సినిమాలకు ఇప్పుడు మరింత డిమాండ్ పెరిగింది. ఇటీవల 'జవాన్' తో ప్రేక్షకులను అలరించిన నయనతార ఇప్పుడు త్వరలోనే 'ఇరైవన్'(Iraivan) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

'సప్త సాగరాలు దాటి' సినిమా రివ్యూ : కన్నడ బ్లాక్ బస్టర్ తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుందా?
కన్నడ హీరో రక్షిత్ శెట్టి (Rakshith Shetty) తెలుగు ప్రేక్షకులకూ తెలుసు. 'అతడే శ్రీమన్నారాయణ', 'చార్లీ' చిత్రాలు తెలుగులోనూ కొంత మందిని ఆకట్టుకున్నాయి. రక్షిత్ శెట్టి హీరోగా నటించడంతో పాటు నిర్మించిన కన్నడ సినిమా 'సప్త సాగర దాచే ఎల్లో'. సెప్టెంబర్ 1న విడుదలైంది. విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల మన్ననలు అందుకుంది. ఆ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్ 'సప్త సాగరాలు దాటి' పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. ఇవాళ థియేటర్లలో విడుదల చేశారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

రవితేజ 'ఈగల్' తర్వాత రామ్ 'డబుల్ ఇస్మార్ట్'లో గ్లామరస్ లేడీ!
ఉస్తాద్ రామ్ పోతినేని (Ram Pothineni) కథానాయకుడిగా పూరి జగన్నాథ్ (Puri Jagannath) దర్శకత్వం వహిస్తున్న లేటెస్ట్  ఫిల్మ్ 'డబుల్ ఇస్మార్ట్'. బాక్సాఫీస్ బరిలో భారీ వసూళ్లు సాధించిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ 'ఇస్మార్ట్ శంకర్'కు సీక్వెల్ ఇది. ఇందులో హీరోయిన్లు ఎవరనేది ఇంకా అనౌన్స్ చేయలేదు. అయితే, లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం... గ్లామరస్ లేడీకి ఛాన్స్ ఇచ్చారట. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

సైలెంట్‌గా ఓటీటీ లోకి వచ్చేసిన 'బెదురులంక 2012' - స్ట్రీమింగ్ ఎక్కడంటే?
'ఆర్ఎక్స్ 100' హీరో కార్తికేయ రీసెంట్ గా నటించిన 'బెదురులంక 2012' సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసింది. ఓటీటీ రిలీజ్ కు సంబంధించి మూవీ టీం ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా,  ప్రమోషన్స్ కూడా చేయకుండా సినిమాని ఓటీటీ లోకి వదిలారు. ఈ మేరకు శుక్రవారం రోజున ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ మీడియాలో 'బెదురులంక 2012' స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చేసింది. ఫన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమాతో క్లాక్స్ టాలీవుడ్ కి కరెక్ట్ గా ఎంట్రీ ఇచ్చాడు. ఆగస్టు 25న థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ మూవీ కమర్షియల్ గా మంచి సక్సెస్ అందుకుంది. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ సినిమాలో కార్తికేయ సరసన నేహా శెట్టి కథానాయికగా నటించగా.. అజయ్ ఘోష్, శ్రీకాంత్ అయ్యంగార్, సత్య ప్రధాన పాత్రలు పోషించారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

Published at : 22 Sep 2023 05:09 PM (IST) Tags: Tollywood News Movie News entertainment news TV News CINEMA NEWS

ఇవి కూడా చూడండి

Bigg Boss Telugu 7: 'బిగ్ బాస్' ఇంట్లో ప్రేమకథలు వినిపించిన కంటెస్టెంట్స్, ‘బేబీ’ స్టోరీని తలపించిన రైతుబిడ్డ స్టోరీ

Bigg Boss Telugu 7: 'బిగ్ బాస్' ఇంట్లో ప్రేమకథలు వినిపించిన కంటెస్టెంట్స్, ‘బేబీ’ స్టోరీని తలపించిన రైతుబిడ్డ స్టోరీ

Calling Sahasra Review - కాలింగ్ సహస్ర రివ్యూ: కంఫర్ట్ జోన్ బయటకు 'సుడిగాలి' సుధీర్ - సినిమా ఎలా ఉందంటే?

Calling Sahasra Review - కాలింగ్ సహస్ర రివ్యూ: కంఫర్ట్ జోన్ బయటకు 'సుడిగాలి' సుధీర్ - సినిమా ఎలా ఉందంటే?

Atharva Movie Review - అథర్వ సినిమా రివ్యూ: హీరోయిన్‌ను మర్డర్‌ చేసిందెవరు? క్లూస్‌ టీమ్‌లో హీరో ఏం చేశాడు?

Atharva Movie Review - అథర్వ సినిమా రివ్యూ: హీరోయిన్‌ను మర్డర్‌ చేసిందెవరు? క్లూస్‌ టీమ్‌లో హీరో ఏం చేశాడు?

Polimera 2 OTT release date: ఓటీటీలోకి ‘పొలిమేర 2’ - స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?

Polimera 2 OTT release date: ఓటీటీలోకి ‘పొలిమేర 2’ - స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?

Salaar Trailer: ‘సలార్’ ట్రైలర్ వచ్చేసింది - ‘కేజీఎఫ్’తో లింకేమిటీ? 3 నిమిషాల్లో కథ మొత్తం చెప్పేశారు - ప్రభాస్ ఎలివేషన్ అదుర్స్

Salaar Trailer: ‘సలార్’ ట్రైలర్ వచ్చేసింది - ‘కేజీఎఫ్’తో లింకేమిటీ? 3 నిమిషాల్లో కథ మొత్తం చెప్పేశారు - ప్రభాస్ ఎలివేషన్ అదుర్స్

టాప్ స్టోరీస్

Pawan Kalyan Comments: 'జనసేనకు యువతే పెద్ద బలం' - వైసీపీ కులాల ఉచ్చులో చిక్కుకోవద్దని శ్రేణులకు పవన్ దిశా నిర్దేశం

Pawan Kalyan Comments: 'జనసేనకు యువతే పెద్ద బలం' - వైసీపీ కులాల ఉచ్చులో చిక్కుకోవద్దని శ్రేణులకు పవన్ దిశా నిర్దేశం

Telangana Elections 2023: 'తెలంగాణలో రీపోలింగ్ కు నో ఛాన్స్' - రాష్ట్రంలో 70.74 శాతం పోలింగ్, గతంతో పోలిస్తే తక్కువేనన్న సీఈవో వికాస్ రాజ్

Telangana Elections 2023: 'తెలంగాణలో రీపోలింగ్ కు నో ఛాన్స్' - రాష్ట్రంలో 70.74 శాతం పోలింగ్, గతంతో పోలిస్తే తక్కువేనన్న సీఈవో వికాస్ రాజ్

India vs Australia 4th T20I: సత్తా చాటిన యువ భారత్, మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సీరీస్ కైవసం

India vs Australia 4th T20I: సత్తా చాటిన యువ భారత్, మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సీరీస్ కైవసం

Ambati Rambabu: 'మా వాటాకు మించి ఒక్క నీటి బొట్టునూ వాడుకోం' - సాగర్ నీటి విషయంలో ఏపీ చర్యలు సరైనవేనన్న మంత్రి అంబటి

Ambati Rambabu: 'మా వాటాకు మించి ఒక్క నీటి బొట్టునూ వాడుకోం' - సాగర్ నీటి విషయంలో ఏపీ చర్యలు సరైనవేనన్న మంత్రి అంబటి