‘సప్త సాగరాలు దాటి’ సీక్వెల్ రిలీజ్ డేట్, 'టైగర్ నాగేశ్వరరావు' రివ్యూ - నేటి టాప్ సినీ విశేషాలివే!
ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి.
‘సప్త సాగరాలు దాటి’ సీక్వెల్ రిలీజ్ డేట్ ఫిక్స్.. అన్ని భాషల్లో ఒకేసారి విడుదల
ఒకప్పుడు సినిమాలు ఒకటి లేదంటే రెండు భాషల్లో విడుదలయ్యేవి. కానీ, ఇప్పుడు దేశవ్యాప్తంగా అన్ని భాషల్లోనూ సినిమాలను విడుదల చేసేందుకు మేకర్స్ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ రోజుల్లో తెరకెక్కే ప్రతి సినిమా పాన్ ఇండియా రేంజ్లోనే రూపొందుతోంది. ఇక తాజాగా కన్నడ నాట బ్రహ్మాండమైన విజయాన్ని అందుకున్న చిత్రం ‘సప్త సాగరదాచే ఎల్లో - సైడ్ ఎ’. రక్షిత్ శెట్టి హీరోగా హేమంత్ ఎం రావు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా కనిపించింది. ఈ మూవీకి సీక్వెల్ గా ‘సప్త సాగరదాచే ఎల్లో - సైడ్ బి’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా కోసం కన్నడతో పాటు తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీకి సీక్వెల్ గా ‘సప్త సాగరదాచే ఎల్లో - సైడ్ బి’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా కోసం కన్నడతో పాటు తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
టైగర్ నాగేశ్వరరావు రివ్యూ : రవితేజ ప్రేక్షకుల మనసు దోచుకున్నాడా? లేదా?
మాస్ మహారాజా రవితేజ హీరోగా లక్ష్మీ మంచు 'దొంగాట', రాజ్ తరుణ్ 'కిట్టూ ఉన్నాడు జాగ్రత్త' ఫేమ్ వంశీ దర్శకత్వం వహించిన సినిమా 'టైగర్ నాగేశ్వరరావు'. ఆంధ్ర రాబిన్ హుడ్ స్టూవర్టుపురం నాగేశ్వరరావు బయోపిక్ ఇది. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉంది? (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
'టైగర్ నాగేశ్వరరావు' డిజిటల్ స్ట్రీమింగ్ ఆ ఓటీటీలోనే - స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్?
మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటించిన చిత్రం 'టైగర్ నాగేశ్వరరావు'. ఆంధ్రా రాబిన్ హుడ్ అని పేరు పొందిన స్టూవర్టుపురం నాగేశ్వర రావు బయోపిక్ ఇది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ రోజు విడుదల చేశారు. ఇది రవితేజకు ఫస్ట్ పాన్ ఇండియా రిలీజ్ అని చెప్పాలి. ఈ సినిమా ప్రచారం కోసం ఆయన ముంబై వెళ్లారు. ఇతర నగరాలకు వెళ్లి ప్రమోట్ చేశారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
'భగవంత్ కేసరి' ఫస్ట్ డే కలెక్షన్స్, భోళా శంకర్ కంటే తక్కువే - ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే?
నటసింహ నందమూరి బాలకృష్ణ నటించిన 'భగవంత్ కేసరి'(Bhagavanth Kesari) మూవీ ప్రస్తుతం థియేటర్స్ లో సందడి చేస్తున్న విషయం తెలిసిందే. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం అక్టోబర్ 19 గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి ఆట నుంచి పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా తొలి రోజు బాక్సాఫీస్ వద్ద డీసెంట్ ఓపెనింగ్స్ ని అందుకుంది. ఈ మూవీ డే వన్ కలెక్షన్స్ ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. 'భగవంత్ కేసరి' డే వన్ కలెక్షన్స్ తో సోషల్ మీడియాలో మెగా, నందమూరి ఫ్యాన్స్ మధ్య సరికొత్త వార్ మొదలైంది. అందుకు కారణం 'భోళా శంకర్' కంటే 'భగవంత్ కేసరి' డే వన్ తక్కువ వసూళ్లు రాబట్టడమే. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
నేచురల్ స్టార్ మూవీలో ప్రియాంక ఫిక్స్! ‘గ్యాంగ్ లీడర్’ తర్వాత మళ్లీ జోడీ!
‘దసరా’తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన నేచురల్ స్టార్ నాని.. ‘హాయ్ నాన్న’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. ‘దసరా’లో ఊరమాస్ లుక్ లో అలరించిన నాని, ఈ సినిమాలో ఓ పాపకు తండ్రిగా కనిపించబోతున్నాడు. శౌర్యువ్ దర్శకత్వంలో ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ, ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. డిసెంబర్ 7న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, నాని కూతురిగా బేబి కైరా ఖన్నా కనిపించనుంది. శృతి హాసన్ ఓ ముఖ్యమైన పాత్రలో కనిపించబోతోంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)