అన్వేషించండి

Priyanka Mohan: నేచురల్ స్టార్ మూవీలో ప్రియాంక ఫిక్స్! ‘గ్యాంగ్ లీడర్’ తర్వాత మళ్లీ జోడీ!

నేచురల్ స్టార్ నాని తర్వాతి చిత్రంలో చెన్నై బ్యూటీ ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. వివేక్ ఆత్రేయ తెరకెక్కిస్తున్నఈ చిత్రాన్ని, డివివి దానయ్య నిర్మిస్తున్నారు.

‘దసరా’తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన నేచురల్ స్టార్ నాని.. ‘హాయ్ నాన్న’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. ‘దసరా’లో ఊరమాస్ లుక్ లో అలరించిన నాని, ఈ సినిమాలో ఓ పాపకు తండ్రిగా కనిపించబోతున్నాడు. శౌర్యువ్ దర్శకత్వంలో ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ, ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. డిసెంబర్ 7న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, నాని కూతురిగా బేబి కైరా ఖన్నా కనిపించనుంది. శృతి హాసన్ ఓ ముఖ్యమైన పాత్రలో కనిపించబోతోంది. 

వివేక్ ఆత్రేయతో నాని మూవీ

‘హాయ్ నాన్న’  తర్వాత దర్శకుడు వివేక్ ఆత్రేయతో కలిసి నాని ఓ సినిమా చేయబోతున్నారు. ఇప్పటికే వీరిద్దరకు కలిసి ‘అంటే సుందరానికీ’ సినిమా చేశారు. ఈ సినిమా ప్రేక్షకులను అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. అయినప్పటికే, వివేక్ తో మరో సినిమా చేయాలని నాని అప్పట్లోనే అనుకున్నారు. తాజాగా ఆయనతో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీప్రొడక్షన్ పనులు కూడా మొదలైనట్లు తెలుస్తోంది. ‘RRR’ నిర్మాత డివివి దానయ్య ఈ సినిమాను నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది.

నాని మూవీలో హీరోయిన్ గా ప్రియాంక!

ఇక ఈ సినిమాలో హీరోయిన్ ను కూడా ఫిక్స్ చేసినట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. చెన్నై బ్యూటీ ప్రియాంక అరుల్ మోహన్ ని హీరోయిన్ గా ఎంపిక చేశారట. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘ఓజీ’ సినిమాలో నటిస్తోంది. సుజీత్ ఈ సినిమాను పాన్ ఇండియా చిత్రంగా  తెరకెక్కిస్తున్నారు.  ఇప్పటికే ప్రియాంక నానితో ఓ సినిమా చేసింది. ‘గ్యాంగ్ లీడర్’ చిత్రంలో నేచురల్ స్టార్ తో కలిసి నటించింది. తాజాగా మరోసారి నానితో రొమాన్స్ చేయబోతోంది. వాస్తవానికి వివేక్ చిత్రాల్లో హీరోయిన్ కు మంచి ప్రాధాన్యత ఉంటుంది. ఈ మూవీతో ప్రియాంకకు మరింత క్రేజ్ వచ్చే అవకాశం ఉందంటున్నారు సినీ జనాలు.

ప్రియాంకకు ఈ సినిమాలు కలిసి వచ్చేనా?

ప్రస్తుతం ప్రియాంక తమిళ సినిమా పరిశ్రమలో బాగా రాణిస్తోంది. అక్కడ వరుస సినిమాలతో ఫుల్ బిజీ అయ్యింది. తెలుగులోనూ వచ్చిన అవకాశాలను చక్కగా వినియోగించుకుంటుంది. వివేక్ తన తాజా చిత్రంలో హీరోయిన్ పాత్రకు ప్రియాంక బాగా సూట్ అవుతుందని భావించారట. అందుకే ఆమెను ఎంపిక చేశారట. ఈ సినిమాతో మంచి సక్సెస్ అందుకోవాలని దర్శకుడు, హీరో భావిస్తున్నారట. అటు ప్రియాంక కూడా ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకునే అవకాశం ఉందని అందరూ భావిస్తున్నారు. ఇక పవన్ కల్యాణ్ ‘ఓజీ’, నాని మూవీ 2024లోనే విడుదల కానున్నాయి. ఈ రెండు చిత్రాలు తన కెరీర్ కు టర్నింగ్ పాయింట్స్ గా మారే అవకాశం ఉందని ప్రియాంక భావిస్తుందట.  

Read Also: డబ్బుల్లేక ఎన్నో కష్టాలు పడ్డా, చివరికి టాయిలెట్లు కడిగా- నటి మ‌హీరా

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

NTR Trivikram Movie Story : షణ్ముఖుడిగా ఎన్టీఆర్ - త్రిశూలంలో DNA... త్రివిక్రమ్ విజనరీ పోస్టర్ స్టోరీ ఏంటంటే?
షణ్ముఖుడిగా ఎన్టీఆర్ - త్రిశూలంలో DNA... త్రివిక్రమ్ విజనరీ పోస్టర్ స్టోరీ ఏంటంటే?
NTR God Of War : ఎన్టీఆర్ గాడ్ ఆఫ్ వార్ - కుమార స్వామిగా మ్యాన్ ఆఫ్ మాసెస్... మాటల మాంత్రికుడి విజన్ వేరే లెవల్
ఎన్టీఆర్ గాడ్ ఆఫ్ వార్ - కుమార స్వామిగా మ్యాన్ ఆఫ్ మాసెస్... మాటల మాంత్రికుడి విజన్ వేరే లెవల్
NBK111 Update : బాలయ్య NBK111 న్యూ షెడ్యూల్ - హైదరాబాద్ To కాకినాడ... రిలీజ్ ఎప్పుడంటే?
బాలయ్య NBK111 న్యూ షెడ్యూల్ - హైదరాబాద్ To కాకినాడ... రిలీజ్ ఎప్పుడంటే?
ENE Sequel Release Date : ఓవైపు కుర్రాళ్లు రెడీ... మరోవైపు నవ్వుల తుపాన్ - ఈ నగరానికి ఏమైంది? సీక్వెల్ రిలీజ్ డేట్ ఫిక్స్
ఓవైపు కుర్రాళ్లు రెడీ... మరోవైపు నవ్వుల తుపాన్ - ఈ నగరానికి ఏమైంది? సీక్వెల్ రిలీజ్ డేట్ ఫిక్స్

వీడియోలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Breaking News: గాదె సాయికృష్ణ కేసులో బిగ్ అప్‌డేట్! లొంగిపోయిన కానిస్టేబుల్స్ అశోక్‌,నాని
గాదె సాయికృష్ణ కేసులో బిగ్ అప్‌డేట్! లొంగిపోయిన కానిస్టేబుల్స్ అశోక్‌,నాని
Ayodhya Ram Mandir Donation Theft Case: అయోధ్య రాముడి విరాళాల చోరీ కేసు నిందితులకు లాయర్స్ షాక్ - వారి తరపున వాదించకూడదని నిర్ణయం
అయోధ్య రాముడి విరాళాల చోరీ కేసు నిందితులకు లాయర్స్ షాక్ - వారి తరపున వాదించకూడదని నిర్ణయం
Kakinada KIET College Invitation To CM Vijay: కాకినాడకు తమిళనాడు సీఎం విజయ్ - హోర్డింగులు పెట్టిన కాలేజీ - పబ్లిసిటీ గేమేనా?
కాకినాడకు తమిళనాడు సీఎం విజయ్ - హోర్డింగులు పెట్టిన కాలేజీ - పబ్లిసిటీ గేమేనా?
Patancheru Real Estate: ఇంద్రేశంపై కన్నేసిన ఐటీ ఉద్యోగులు.. పటాన్ చెరు రియల్ ఎస్టేట్ ధరల్లో ఊహించని మార్పులు
ఇంద్రేశంపై కన్నేసిన ఐటీ ఉద్యోగులు.. పటాన్ చెరు రియల్ ఎస్టేట్ ధరల్లో ఊహించని మార్పులు
NBK111 Update : బాలయ్య NBK111 న్యూ షెడ్యూల్ - హైదరాబాద్ To కాకినాడ... రిలీజ్ ఎప్పుడంటే?
బాలయ్య NBK111 న్యూ షెడ్యూల్ - హైదరాబాద్ To కాకినాడ... రిలీజ్ ఎప్పుడంటే?
AIADMK MLA MR Vijayabhaskar Resigns: టీవీకే విజయ్ ప్లాన్‌కు అల్లాడిపోతున్న అన్నాడీఎంకే - మరో ఎమ్మెల్యే రాజీనామా - లైన్‌లో ఇంకా ఉన్నారా?
టీవీకే విజయ్ ప్లాన్‌కు అల్లాడిపోతున్న అన్నాడీఎంకే - మరో ఎమ్మెల్యే రాజీనామా - లైన్‌లో ఇంకా ఉన్నారా?
Kodangal Duplicate Votes: కొడంగల్‌లో 11 వేల కర్ణాటక వాసుల ఓట్లు - కవిత సంచలన ఆరోపణలు
కొడంగల్‌లో 11 వేల కర్ణాటక వాసుల ఓట్లు - కవిత సంచలన ఆరోపణలు
ENE Sequel Release Date : ఓవైపు కుర్రాళ్లు రెడీ... మరోవైపు నవ్వుల తుపాన్ - ఈ నగరానికి ఏమైంది? సీక్వెల్ రిలీజ్ డేట్ ఫిక్స్
ఓవైపు కుర్రాళ్లు రెడీ... మరోవైపు నవ్వుల తుపాన్ - ఈ నగరానికి ఏమైంది? సీక్వెల్ రిలీజ్ డేట్ ఫిక్స్
Embed widget