అన్వేషించండి

‘టైగర్ 3’ ట్రైలర్, ‘సైంధవ్’ టీజర్, ‘తెలుసు కదా’ అనౌన్స్‌మెంట్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి.

‘టైగర్ 3’ ట్రైలర్ విడుదల - ఈసారి పర్సనల్ మిషన్‌తో వస్తున్న సల్మాన్
మామూలుగా సినిమాటిక్ యూనివర్స్ అనేవి హాలీవుడ్‌లో తప్పా ఇండియన్ సినిమాల్లో అంత ఫేమస్ కాదు. అయితే హాలీవుడ్ రేంజ్‌లో ఒక సినిమాటిక్ యూనివర్స్‌ను క్రియేట్ చేయాలని బలంగా డిసైడ్ అయ్యింది ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిల్మ్స్. వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ పేరుతో ఇప్పటికే ఈ ఫ్రాంచైజ్‌లో మూడు సినిమాలు వచ్చాయి. ఇప్పుడు నాలుగో చిత్రం కూడా విడుదలకు సిద్ధమయ్యింది. అదే ‘టైగర్ 3’. తాజాగా ‘టైగర్ 3’ ట్రైలర్ గ్రాండ్‌గా లాంచ్ అయ్యింది. అలా ట్రైలర్ లాంచ్ అయ్యిందో లేదో.. ఇలా సల్మాన్ ఫ్యాన్స్ అంతా యూట్యూబ్ రికార్డులు బ్రేక్ చేయడానికి రెడీ అయిపోయారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

ఫుల్ యాక్షన్ ప్యాక్​తో 'సైంధవ్' టీజర్ - లెక్కలు మారిపోతాయంటున్న వెంకీ మామ
విభిన్న కథలను ఎంచుకోవడంలో వెంకీ మామ ఎప్పుడూ ముందు ఉంటాడు. టాలీవుడ్ సీనియర్ నటుడిగా తన ప్రత్యేకతను చాటుకుంటున్న విక్టరీ వెంకటేష్​ కెరీయర్​లో 75 వ చిత్రం విడుదలకు సిద్ధమవుతుంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న పాన్ ఇండియా సినిమా ‘సైంధవ్’. ఈ సినిమాకు సంబంధించిన టీజర్​ని చిత్ర బృందం విడుదల చేసింది. వైల్డ్ లుక్​లో కనిపిస్తూ పాత విక్టరీ వెంకటేష్​ని గుర్తు చేశారు. సినిమా మొత్తం గన్స్, బుల్లెట్లు, రక్తపాతంతో నిండిపోయింది. “వెళ్ళే ముందే చెప్పి వెళ్ళాను వినలేదు. అంటే భయం లేదు లెక్క మారిద్ది” అంటూ విలన్స్ కి వెంకీ ఇచ్చే వార్నింగ్ అదిరిపోయింది. కీలకమైన ఆపరేషన్ కోసం మళ్ళీ వెంకటేష్ ని రంగంలోకి దింపినట్టుగా టీజర్ చూస్తే అర్థం అవుతోంది. ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ టీజర్ సినిమా మీద అంచనాలు మరింత పెంచేస్తుంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

పృథ్వీరాజ్ బర్త్ డే సందర్భంగా సలార్ నుంచి న్యూ పోస్టర్
భారీ అంచనాలతో డిసెంబర్ 22వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది సలార్. తెలుగు రెబల్ స్టార్.. పాన్ ఇండియా స్టార్​ ప్రభాస్​ హీరోగా కేజీఎఫ్​ డైరక్టర్​ ప్రశాంత్​ నీల్ కాంబినేషన్​లో రూపొందిన ఈ భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించారు. మలయాళ సూపర్​స్టార్​ పృథ్వీరాజ్​ సుకుమారన్ ఇందులో విలన్​గా నటిస్తున్న విషయం మనకి తెలిసిందే. పృథ్వీరాజ్ పుట్టిన సందర్భంగా సలార్ మూవీలో ఆయనకు సంబంధించిన పోస్టర్​ను అన్ని భాషల్లో విడుదల చేసింది చిత్రబృందం. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

సిద్ధు నెక్స్ట్​ మూవీ టైటిల్ ఫిక్స్.. కూల్ పోస్టర్ రిలీజ్ చేసిన చిత్రబృందం
సినీ పరిశ్రమలో ఉండే 24 క్రాఫ్ట్స్‌లోని ఏ క్రాఫ్ట్‌లో పనిచేస్తున్నా.. కూడా చాలామందికి కామన్‌గా ఒక కల ఉంటుంది. తమ కెరీర్‌లో ఒక్కసారైనా మైక్రోఫోన్ పట్టుకొని డైరెక్షన్ చేయాలని. అలాగే ఎన్నో ఏళ్లుగా టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ డిజైనర్‌గా, స్టైలిస్ట్‌గా పేరు తెచ్చుకుంది నీరజ కోన. ఇప్పుడు తొలిసారిగా దర్శకురాలిగా మారుతూ సినిమాను తెరకెక్కించనుంది. తను డైరెక్ట్ చేసే మొదటి సినిమా కోసం యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డను హీరోగా సెలక్ట్ చేసుకుంది. ఈ మూవీ గురించి అలా వార్తలు బయటికి వచ్చాయో లేదో.. ఇలా ఆ మూవీ టీమ్ టైటిల్‌ను పోస్టర్‌ను రిలీజ్ చేసి అందరినీ సర్‌ప్రైజ్ చేసింది. తాజాగా ఈ టైటిల్ లాంచ్ జరిగింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

థియేటర్లలో విడుదలైన 9 నెలల తర్వాత టీవీల్లో రాబోతున్న మెగా మాస్ బ్లాక్ బస్టర్!
మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ హీరోలుగా కొల్లు రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ 'వాల్తేరు వీరయ్య'. 2023 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. వరల్డ్ వైడ్ గా రూ. 225 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టి, ఈ ఏడాది మెగా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. థియేటర్లలో ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించిన ఈ మూవీ.. ఓటీటీలోనూ సత్తా చాటింది. సినిమా వచ్చి 9 నెలలు గడుస్తున్నా ఇంతవరకూ టీవీలో టెలికాస్ట్ అవ్వకంపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు ఈ మూవీ వరల్డ్‌ టెలివిజన్ ప్రీమియర్ డేట్‌ను ఫిక్స్ చేసుకుంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu Distributes Pension: యల్లమందలో పింఛన్ల పంపిణీ ప్రారంభించిన చంద్రబాబు - ఓ లబ్ధిదారుడికి రూ.5 లక్షలు ఇవ్వాలని ఆదేశం
యల్లమందలో పింఛన్ల పంపిణీ ప్రారంభించిన చంద్రబాబు - ఓ లబ్ధిదారుడికి రూ.5 లక్షలు ఇవ్వాలని ఆదేశం
Perni Nani In Ration Rice Case: రేషన్ బియ్యం మాయం కేసులో నిందితుడిగా పేర్ని నాని - హైకోర్టును ఆశ్రయించిన మాజీ మంత్రి
రేషన్ బియ్యం మాయం కేసులో నిందితుడిగా పేర్ని నాని - హైకోర్టును ఆశ్రయించిన మాజీ మంత్రి
Game Changer Censor Review: 'గేమ్ చేంజర్' సెన్సార్ రిపోర్ట్... రామ్ చరణ్ సినిమా ఇంటర్వెల్, సెకండాఫ్ గురించి చెప్పేది వింటుంటే?
'గేమ్ చేంజర్' సెన్సార్ రిపోర్ట్... రామ్ చరణ్ సినిమా ఇంటర్వెల్, సెకండాఫ్ గురించి చెప్పేది వింటుంటే?
Manchu Vishnu: మరో వివాదంలో మంచు విష్ణు - అడవి పందులను వేటాడిన నటుడి సిబ్బంది
మరో వివాదంలో మంచు విష్ణు - అడవి పందులను వేటాడిన నటుడి సిబ్బంది
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

KA Paul Interview on Allu Arjun | అంబేడ్కర్ ని తిట్టినోళ్లు యూజ్ లెస్ ఫెలోస్ | ABP DesamDeputy CM Pawan kalyan on Allu Arjun | సంధ్యా థియేటర్ వ్యవహారంపై పవన్ కళ్యాణ్ | ABP DesamISRO SpaDEX Docking Experiment | తొలిసారిగా డాకింగ్ ప్రయోగం చేస్తున్న ఇస్రో | ABP Desamఅమిత్ షాకి అదో ఫ్యాషన్, మాలల సత్తా చూపిస్తాం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu Distributes Pension: యల్లమందలో పింఛన్ల పంపిణీ ప్రారంభించిన చంద్రబాబు - ఓ లబ్ధిదారుడికి రూ.5 లక్షలు ఇవ్వాలని ఆదేశం
యల్లమందలో పింఛన్ల పంపిణీ ప్రారంభించిన చంద్రబాబు - ఓ లబ్ధిదారుడికి రూ.5 లక్షలు ఇవ్వాలని ఆదేశం
Perni Nani In Ration Rice Case: రేషన్ బియ్యం మాయం కేసులో నిందితుడిగా పేర్ని నాని - హైకోర్టును ఆశ్రయించిన మాజీ మంత్రి
రేషన్ బియ్యం మాయం కేసులో నిందితుడిగా పేర్ని నాని - హైకోర్టును ఆశ్రయించిన మాజీ మంత్రి
Game Changer Censor Review: 'గేమ్ చేంజర్' సెన్సార్ రిపోర్ట్... రామ్ చరణ్ సినిమా ఇంటర్వెల్, సెకండాఫ్ గురించి చెప్పేది వింటుంటే?
'గేమ్ చేంజర్' సెన్సార్ రిపోర్ట్... రామ్ చరణ్ సినిమా ఇంటర్వెల్, సెకండాఫ్ గురించి చెప్పేది వింటుంటే?
Manchu Vishnu: మరో వివాదంలో మంచు విష్ణు - అడవి పందులను వేటాడిన నటుడి సిబ్బంది
మరో వివాదంలో మంచు విష్ణు - అడవి పందులను వేటాడిన నటుడి సిబ్బంది
Holidays List in 2025 : న్యూ ఇయర్ 2025లో 12 రోజులు లీవ్ పెడితే 50 రోజులు పండగే.. పబ్లిక్ హాలీడేలు, వీక్లీ ఆఫ్​లతో రచ్చ చేసేయండిలా
న్యూ ఇయర్ 2025లో 12 రోజులు లీవ్ పెడితే 50 రోజులు పండగే.. పబ్లిక్ హాలీడేలు, వీక్లీ ఆఫ్​లతో రచ్చ చేసేయండిలా
Naga Vamsi: ఏంటి బ్రో అంత మాట అనేశావ్... బోనీ కపూర్‌ ముందు బాలీవుడ్‌ను ఏకిపారేసిన నాగ వంశీ
ఏంటి బ్రో అంత మాట అనేశావ్... బోనీ కపూర్‌ ముందు బాలీవుడ్‌ను ఏకిపారేసిన నాగ వంశీ
Gudivada Amarnath: సొంత నియోజకవర్గం లేని నేతగా గుడివాడ అమర్నాథ్! మాజీ మంత్రి వింత పరిస్థితి- భీమిలి పై కన్ను
సొంత నియోజకవర్గం లేని నేతగా గుడివాడ అమర్నాథ్! మాజీ మంత్రి వింత పరిస్థితి- భీమిలి పై కన్ను
Richest CM In India: దేశంలో ధనిక సీఎంగా చంద్రబాబు, చివరి స్థానంలో మమతా బెనర్జీ - ఆస్తులు, అప్పుల వివరాలిలా
దేశంలో ధనిక సీఎంగా చంద్రబాబు, చివరి స్థానంలో మమతా బెనర్జీ - ఆస్తులు, అప్పుల వివరాలిలా
Embed widget