Siddhu Jonnalagadda: సిద్ధు నెక్స్ట్ మూవీ టైటిల్ ఫిక్స్.. కూల్ పోస్టర్ రిలీజ్ చేసిన చిత్రబృందం
యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ.. ప్రముఖ స్టైలిస్ట్ నీరజ కోన డెబ్యూ డైరెక్షన్‌లో నటిస్తున్నాడనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ మూవీ టైటిల్ పోస్టర్ తాజాగా విడుదలయ్యింది.
సినీ పరిశ్రమలో ఉండే 24 క్రాఫ్ట్స్‌లోని ఏ క్రాఫ్ట్‌లో పనిచేస్తున్నా.. కూడా చాలామందికి కామన్‌గా ఒక కల ఉంటుంది. తమ కెరీర్‌లో ఒక్కసారైనా మైక్రోఫోన్ పట్టుకొని డైరెక్షన్ చేయాలని. అలాగే ఎన్నో ఏళ్లుగా టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ డిజైనర్‌గా, స్టైలిస్ట్‌గా పేరు తెచ్చుకుంది నీరజ కోన. ఇప్పుడు తొలిసారిగా దర్శకురాలిగా మారుతూ సినిమాను తెరకెక్కించనుంది. తను డైరెక్ట్ చేసే మొదటి సినిమా కోసం యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డను హీరోగా సెలక్ట్ చేసుకుంది. ఈ మూవీ గురించి అలా వార్తలు బయటికి వచ్చాయో లేదో.. ఇలా ఆ మూవీ టీమ్ టైటిల్‌ను పోస్టర్‌ను రిలీజ్ చేసి అందరినీ సర్‌ప్రైజ్ చేసింది. తాజాగా ఈ టైటిల్ లాంచ్ జరిగింది.
సీక్వెల్ పూర్తి..
‘డీజె టిల్లు’ సినిమాతో సిద్ధు జొన్నల్లగడ్డ ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్‌ను, క్రేజ్‌ను సంపాదించుకున్నాడో అందరికీ తెలుసు. అయితే ఈ క్రేజ్‌ను కంటిన్యూ చేయడం కోసమే గత సంవత్సరం నుంచి ‘డిజే టిల్లు’ సీక్వెల్‌పై వర్క్ చేస్తున్నాడు సిద్ధు. ఇది పూర్తయ్యే వరకు ఇతర కమిట్మెంట్స్ పెట్టుకోకూడదు అని బలంగా ఫిక్స్ అయ్యాడు. ఇక ‘డీజె టిల్లు’ సీక్వెల్ అయిన ‘టిల్లు స్క్వేర్’ షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమవుతుండగా.. తన అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్‌పై ఫోకస్ పెట్టాడు సిద్దు. టాలీవుడ్‌లోని ఎందరో హీరోహీరోయిన్లతో పాటు తనకు కూడా పలుమార్లు స్టైలింగ్ చేసిన నీరజ కోన డైరెక్టర్‌గా మారుతున్న డెబ్యూ మూవీలో హీరోగా నటించడానికి ఒప్పుకున్నాడు. తాజాగా ఈ సినిమా టైటిల్ పోస్టర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
నిర్మాతలకు ల్యాండ్‌మార్క్ సినిమా..
నీరజ కోన డైరెక్టర్‌గా డెబ్యూ చేస్తున్న మూవీకి ‘తెలుసు కదా’ అని టైటిల్ ఖరారు అయ్యింది. ఈ టైటిల్ పోస్టర్‌ను తాజాగా విడుదల చేసింది మూవీ టీమ్. ఇందులో సిద్ధు చాలా కూల్‌గా, స్టైలిష్‌గా కనిపిస్తున్నాడు. తెలుగులో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను నిర్మించిన పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీకి ఇది 30వ చిత్రం. టీజీ విశ్వప్రసాద్.. ‘తెలుసు కదా’ చిత్రాన్ని బడ్జెట్ విషయంలో ఏ మాత్రం కాంప్రమైజ్ కాకుండా నిర్మించాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. వివేక్ కూచిబోట్ల ఈ సినిమాకు సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ‘తెలుసు కదా’ అనౌన్స్‌మెంట్ వీడియోలోనే ప్రేక్షకులకు ఇది ఒక పక్కా ఫుల్ మీల్ సినిమా అని తెలిసేలా చేసింది మూవీ టీమ్.
ఇద్దరు హీరోయిన్స్‌తో రొమాన్స్..
‘తెలుసు కదా’ ఒక ప్రేమకథా చిత్రమే అయినా ఇందులో పలు సామాజిక అంశాలు కూడా జతచేర్చామని మూవీ టీమ్ చెప్తోంది. ఫ్రెండ్‌షిప్ గురించి, ఫ్యామిలీ గురించి, త్యాగం, ప్రేమలాంటి ఎన్నో అంశాల గురించి ఈ సినిమాలో ఉంటాయని అన్నారు. ‘తెలుసు కదా’ కోసం ఇద్దరు హీరోయిన్లతో రొమాన్స్ చేయడానికి సిద్ధు సిద్ధమవుతున్నాడు. రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి. ఇప్పటికే వెంకటేశ్ హీరోగా నటిస్తున్న ‘సైంధవ్’తో కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి.. టాలీవుడ్‌లోకి అడుగుపెడుతుండగా.. ‘తెలుసు కదా’ తనకు తెలుగులో రెండో సినిమా కానుంది. ఇక చాలాకాలంగా తెలుగుతెరపై కనిపించని రాశి కూడా ఈ మూవీతో కమ్ బ్యాక్ ప్లాన్ చేస్తోంది. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నాడు.
#TelusuKada, To love and to be loved is the only way to live. 🫶 A new journey to discover unconditional love . 💝 https://t.co/wwNqwfrQD8 @NeerajaKona #SiddhuJonnalagadda #RaashiiKhanna @SrinidhiShetty7 @MusicThaman @vishwaprasadtg @vivekkuchibotla @sreekar_prasad @dopyuvraj…
— People Media Factory (@peoplemediafcy) October 16, 2023
Also Read: క్రికెట్ మ్యాచ్‌కు వెళ్లి గోల్డ్ ఐఫోన్ పోగొట్టుకున్న ఐటెం భామ!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial