‘ఆదిపురుష్’ మెప్పించాడు, దేవరకొండ పాటతో వచ్చేశాడు, చైతూ ఇచ్చి పడేశాడు: ఈ రోజు సినీ విశేషాలివే!
ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యంగా ఈ టాప్-5 విశేషాలు చూసేయండి.
ప్రభాస్ గురి తప్పలేదు, బాక్సాఫీస్ కుంభస్థలమే టార్గెట్ - 'ఆదిపురుష్' ట్రైలర్ వచ్చిందోచ్!
బహుశా 'ఆదిపురుష్' టీజర్ విడుదలైన తర్వాత వచ్చిన ట్రోల్స్ ఇతర సినిమాల టీజర్లు విడుదలైనప్పుడు రాలేదని చెప్పవచ్చు. ముఖ్యంగా పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) అభిమానులకు కూడా ఆ టీజర్ నచ్చలేదు. 'ఆదిపురుష్' ట్రైలర్ (Adipurush Trailer) విషయంలో అటువంటి విమర్శలు వచ్చే అవకాశం లేదని చెప్పాలి. ఈసారి ప్రభాస్ గురి తప్పలేదని అనుకోవాలి. రాఘవ రామునిగా బాక్సాఫీస్ కుంభస్థలానికి ఆయన గురి పెట్టారని ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది. హైదరాబాద్ ఏఎంబీ మాల్ లో సోమవారం ప్రభాస్ అభిమానులకు ట్రైలర్ ప్రత్యేకంగా చూపించారు. ఈ రోజు మీడియాకు ప్రసాద్ ఐమ్యాక్స్ మల్టీప్లెక్స్‌లో మధ్యాహ్నం 01.53 గంటలకు ట్రైలర్ ప్రదర్శించారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
ఆ విషయంలో నా ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేయడం బాధగా ఉంది: నాగచైతన్య
‘‘నేను సమంతతో విడాకులు తీసుకుని దాదాపు ఏడాదిన్నర అవుతున్నా.. ఇంకా అదే న్యూస్ ను పలు న్యూస్ ఛానెళ్లు పలు రకాలుగా చూపిస్తున్నారు. నా గురించి ఎలాంటి రూమర్స్ క్రియేట్ చేసినా అంత పట్టించుకోను గానీ.. నా ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేస్తే చాలా హర్ట్ అవుతా’’ అని అక్కినేని నాగచైతన్య పేర్కొన్నారు. చైతూ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన విడాకులు గురించి మీడియా చేస్తున్న రాద్దాంతంపై స్పందించారు. సమంతతో విడాకుల విషయంలో తన ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేయడం తనకు చాలా బాధ కలిగించిందని చైతూ తెలిపారు. అందులో వాళ్ల తప్పేమీ లేదని, ఇంకా ఆ ఇష్యూను సాగదీయడం తప్పని నాగచైతన్య చెప్పారు. తన ఫ్యామిలీ గురించి తప్పుడు వార్తలు రాస్తున్న మీడియాకు ఇచ్చి పడేశాడు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
విజయ్ దేవరకొండ బర్త్‌డే గిఫ్ట్ - 'ఖుషి'లో తొలి పాట వచ్చేసిందోచ్!
రౌడీ బాయ్, పాన్ ఇండియా స్టార్ విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) హీరోగా నటిస్తున్న తాజా సినిమా 'ఖుషి' (Kushi Movie). ఇందులో సమంత రూత్ ప్రభు (Samantha Ruth Prabhu) హీరోయిన్. ఈ చిత్రానికి శివ నిర్వాణ (Shiva Nirvana) దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యేర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మిస్తున్నారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
'బ్రో' అంటున్న మామా అల్లుళ్లు - పవన్ కళ్యాణ్ కొత్త సినిమా టైటిల్ ఇదే!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) కలిసి ఓ సినిమా చేశారు. అంటే... షూటింగ్ కంప్లీట్ చేశారు. ఈ సినిమా జూలై నెలాఖరున విడుదలకు రెడీ అవుతోంది. లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే... మూవీ టైటిల్ కన్ఫర్మ్ చేశారట. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
'బాహుబలి' క్లైమాక్స్ గుర్తు చేసిన 'ఆదిపురుష్' ట్రైలర్ - ఆ ఒక్క డైలాగ్ లేకపోతే?
'బాహుబలి' (Baahubali) విడుదలై దాదాపు ఎనిమిదేళ్లు! అయినా సరే ఆ సినిమా క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. అందుకు లేటెస్ట్ ఎగ్జాంపుల్... 'ఆదిపురుష్' ట్రైలర్ (Adipurush Trailer). ఇప్పుడీ ట్రైలర్ చాలా మంది తెలుగు ప్రేక్షకులకు 'బాహుబలి'ని గుర్తు చేసింది. అందులో యుద్ధానికి ముందు సైనికులను సిద్ధం చేయడానికి ప్రభాస్ చెప్పిన డైలాగులను మరోసారి గుర్తు చేసింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)