అన్వేషించండి

Kushi First Single : విజయ్ దేవరకొండ బర్త్‌డే గిఫ్ట్ - 'ఖుషి'లో తొలి పాట వచ్చేసిందోచ్!

Vijay Devarakonda's Kushi First Song : విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటిస్తున్న 'ఖుషి'లో తొలి పాట 'నా రోజా నువ్వే...'ను ఈ రోజు విడుదల చేశారు.

రౌడీ బాయ్, పాన్ ఇండియా స్టార్ విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) హీరోగా నటిస్తున్న తాజా సినిమా 'ఖుషి' (Kushi Movie). ఇందులో సమంత రూత్ ప్రభు (Samantha Ruth Prabhu) హీరోయిన్. ఈ చిత్రానికి శివ నిర్వాణ (Shiva Nirvana) దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యేర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మిస్తున్నారు.

దేవరకొండ పుట్టినరోజు బహుమతిగా...
ఈ రోజు విజయ్ దేవరకొండ పుట్టినరోజు (Vijay Devarakonda Birthday). ఆయన అభిమానులకు కానుకగా ఈ రోజు 'ఖుషి'లో తొలి పాట 'నా రోజా నువ్వే...'ను విడుదల చేశారు. ప్రేమకథగా 'ఖుషి' సినిమా రూపొందుతోంది. మొత్తం ఐదు భాషల్లో ఈ  పాటను విడుదల చేశారు. ఈ సందర్భంగా విడుదల చేసిన స్టిల్ చూస్తే... కశ్మీరీ ముస్లిం యువతిగా సమంత నటిస్తున్నట్లు అర్థం అవుతోంది. 

'నా రోజా నువ్వే...'కు తెలుగు సాహిత్యాన్ని దర్శకుడు శివ నిర్వాణ అందించడం విశేషం. ఈ పాటను సంగీత దర్శకుడు హేషామ్ అబ్దుల్ వాహాబ్ పాడారు.

పాన్ ఇండియా సినిమాగా 'ఖుషి'ని తెరకెక్కిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సినిమా విడుదల కానుంది. పాటను కూడా ఈ ఐదు భాషల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. సెప్టెంబర్ 1న ప్రపంచ వ్యాప్తంగా 'ఖుషి' సినిమాను విడుదల చేయనున్నట్లు ఆల్రెడీ అనౌన్స్ చేశారు.  

Also Read : 'బ్రో' అంటున్న మామా అల్లుళ్లు - పవన్ కళ్యాణ్ కొత్త సినిమా టైటిల్ ఇదే!

సరిగమ చేతికి 'ఖుషి' ఆడియో రైట్స్!
'ఖుషి'కి హేషామ్ అబ్దుల్ వాహాబ్ (Hesham Abdul Wahab) సంగీత దర్శకుడు. మలయాళంలో ఆయనకు మంచి పేరు ఉంది. సూపర్ హిట్ 'హృదయం' పాటలకు తెలుగులో కూడా అభిమానులు ఉన్నారు. 'ఖుషి'కి ఆయన సంగీతం అందిస్తున్నారని తెలిసినప్పటి నుంచి... క్రేజ్ నెలకొంది. దానికి తోడు 'ఖుషి' టైటిల్, విజయ్ దేవరకొండ స్టార్ డమ్ తోడు కావడంతో ఫ్యాన్సీ రేటుకు సినిమా ఆడియో రైట్స్ సరిగమ కంపెనీ సొంతం చేసుకుంది.

'ఖుషి'లో ఐటీ ఉద్యోగిగా సమంత!
సమంత పుట్టినరోజు కానుకగా 'ఖుషి' నుంచి చిత్ర బృందం ఓ స్టిల్ విడుదల చేసింది. అందులో ఆమెను చూస్తే... ఐటీ ఉద్యోగి పాత్ర చేస్తున్నారని ఈజీగా చెప్పవచ్చు. కశ్మీరీ యువతి ఐటీ ఉద్యోగి కావడం వెనుక ఏమైనా ట్విస్ట్ ఉందా? లేదా? అనేది సినిమా వస్తే గానీ తెలియదు. విశేషం ఏమిటంటే... ఆ స్టిల్ చూశాక, చాలా మందికి తెలుగులో సమంత తొలి సినిమా 'ఏ మాయ చేసావె' గుర్తుకు వస్తోంది.

Also Read పడ్డవాడు చెడ్డవాడు కాదు - కుర్రాళ్ల క్రేజీ హార్ట్ బీట్ విజయ్ దేవరకొండ, రౌడీ బాయ్ కెరీర్‌ను మార్చిన మూవీస్ ఇవే!

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Saregama Telugu (@saregamatelugu)

'ఏ మాయ చేసావె'లో సమంత ఐటీ ఉద్యోగి పాత్రలో కనిపించారు. ఆ తర్వాత 'ఎటో వెళ్ళిపోయింది మనసు', 'జనతా గ్యారేజ్' చిత్రాల్లో ఉద్యోగిగా కనిపించారు. అయితే, 'ఏ మాయ చేసావె' తర్వాత మళ్ళీ పూర్తిస్థాయి ఐటీ ఉద్యోగి పాత్ర చేయడం 'ఖుషి'లోనే అనుకుంట! అందులోనూ సినిమాలోని కొత్త స్టిల్ చూస్తే... 'ఏ మాయ చేసావె'లో నడిచినట్టే ఉంది. అందులో చీర అయితే, 'ఖుషి'లో చుడిదార్! అదీ సంగతి! ఆ మధ్య హైదరాబాద్, దుర్గం చెరువు సమీపంలోని ఐటీ కంపెనీలలో విజయ్ దేవరకొండ, సమంత మీద కొన్ని సన్నివేశాలు తెరకెక్కించారు.

'ఖుషి' చిత్రంలో మలయాళ నటుడు జయరామ్, మరాఠీ నటుడు సచిన్ ఖేడేకర్, ఇంకా మురళీ శర్మ, లక్ష్మీ, అలీ, రోహిణి, 'వెన్నెల' కిశోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, శరణ్య ప్రదీప్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఫైట్స్: పీటర్ హెయిన్, సంగీత దర్శకుడు : హేషామ్ అబ్దుల్ వాహాబ్, సీఈవో : చెర్రీ, ఛాయాగ్రహణం: జి. మురళి.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Black Monday: బ్లాక్ మండే భయం నిజమైంది - సెన్సెక్స్ 3300 పాయింట్లు, నిఫ్టీ 1000 పాయింట్లు పతనం
బ్లాక్ మండే భయం నిజమైంది - సెన్సెక్స్ 3300 పాయింట్లు, నిఫ్టీ 1000 పాయింట్లు పతనం
Pawan Kalyan: ‘అడవితల్లి బాట’ కార్యక్రమం, విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకున్న పవన్ కళ్యాణ్
‘అడవితల్లి బాట’ కార్యక్రమం, విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకున్న పవన్ కళ్యాణ్
Waqf Amendment Act:  కొత్త వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టులో వరుస పిటిషన్లు, విచారణకు వచ్చేది ఎప్పుడంటే..
కొత్త వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టులో వరుస పిటిషన్లు, విచారణకు వచ్చేది ఎప్పుడంటే..
Avanthika Sundar: ఖుష్బూ కూతురి కష్టాలు... పేరెంట్స్‌ ముందుకు రావట్లేదు... సినిమా ఎంట్రీ కష్టాలు విన్నారా?
ఖుష్బూ కూతురి కష్టాలు... పేరెంట్స్‌ ముందుకు రావట్లేదు... సినిమా ఎంట్రీ కష్టాలు విన్నారా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Tilakvarma removed Mumbai Indians Name | ముంబై ఇండియన్స్ పేరును తొలగించిన తిలక్ వర్మ | ABP DesamJasprit Bumrah Re Entry | బుమ్రాను గాల్లోకి ఎత్తి మరీ ప్రకటించిన పొలార్డ్ | ABP DesamMI vs RCB Match preview IPL 2025 | పదేళ్ల గడిచిపోయాయి..ఇప్పటికైనా దక్కేనా.? | ABP DesamSiraj Bowling in IPL 2025 | ఐపీఎల్ లో వంద వికెట్ల క్లబ్ లోకి దూసుకొచ్చిన హైదరాబాదీ సిరాజ్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Black Monday: బ్లాక్ మండే భయం నిజమైంది - సెన్సెక్స్ 3300 పాయింట్లు, నిఫ్టీ 1000 పాయింట్లు పతనం
బ్లాక్ మండే భయం నిజమైంది - సెన్సెక్స్ 3300 పాయింట్లు, నిఫ్టీ 1000 పాయింట్లు పతనం
Pawan Kalyan: ‘అడవితల్లి బాట’ కార్యక్రమం, విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకున్న పవన్ కళ్యాణ్
‘అడవితల్లి బాట’ కార్యక్రమం, విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకున్న పవన్ కళ్యాణ్
Waqf Amendment Act:  కొత్త వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టులో వరుస పిటిషన్లు, విచారణకు వచ్చేది ఎప్పుడంటే..
కొత్త వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టులో వరుస పిటిషన్లు, విచారణకు వచ్చేది ఎప్పుడంటే..
Avanthika Sundar: ఖుష్బూ కూతురి కష్టాలు... పేరెంట్స్‌ ముందుకు రావట్లేదు... సినిమా ఎంట్రీ కష్టాలు విన్నారా?
ఖుష్బూ కూతురి కష్టాలు... పేరెంట్స్‌ ముందుకు రావట్లేదు... సినిమా ఎంట్రీ కష్టాలు విన్నారా?
YS Sharmila: ఏపీలో నిలిచిన ఎన్టీఆర్ వైద్య సేవలు, కూటమి ప్రభుత్వంపై షర్మిల మండిపాటు
ఏపీలో నిలిచిన ఎన్టీఆర్ వైద్య సేవలు, కూటమి ప్రభుత్వంపై షర్మిల మండిపాటు
AP Economic Growth: ‘ఆంధ్రప్రదేశ్ ఈజ్ రైజింగ్’, వృద్ధి రేటులో ఏపీ రికార్డు - తమిళనాడు తర్వాత స్థానం ఏపీదే
‘ఆంధ్రప్రదేశ్ ఈజ్ రైజింగ్’, వృద్ధి రేటులో ఏపీ రికార్డు - తమిళనాడు తర్వాత స్థానం ఏపీదే
Peddi First Shot Reactions: ప్రభాస్ బౌలింగ్‌లో చరణ్ సిక్సర్... క్యాచ్ పట్టిన బాలయ్య, పవన్, ఎన్టీఆర్... 'పెద్ది' మీమ్స్ అదుర్స్ అంతే
ప్రభాస్ బౌలింగ్‌లో చరణ్ సిక్సర్... క్యాచ్ పట్టిన బాలయ్య, పవన్, ఎన్టీఆర్... 'పెద్ది' మీమ్స్ అదుర్స్ అంతే
Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు గుడ్‌న్యూస్, తొలి విడత సాయంపై ప్రభుత్వం కీలక నిర్ణయం
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు గుడ్‌న్యూస్, తొలి విడత సాయంపై ప్రభుత్వం కీలక నిర్ణయం
Embed widget