News
News
వీడియోలు ఆటలు
X

Pawan Kalyan Sai Tej Movie Title : 'బ్రో' అంటున్న మామా అల్లుళ్లు - పవన్ కళ్యాణ్ కొత్త సినిమా టైటిల్ ఇదే!

PK SDT movie titled BRO : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న సినిమాకు టైటిల్ ఫిక్స్ చేశారని సమాచారం. త్వరలో టైటిల్ అనౌన్స్ చేయనున్నారు.

FOLLOW US: 
Share:

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) కలిసి ఓ సినిమా చేశారు. అంటే... షూటింగ్ కంప్లీట్ చేశారు. ఈ సినిమా జూలై నెలాఖరున విడుదలకు రెడీ అవుతోంది. లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే... మూవీ టైటిల్ కన్ఫర్మ్ చేశారట. 

పవన్... సాయి తేజ్... బ్రో!
Pawan Kalyan movie titled BRO : పవన్ కళ్యాణ్, సాయి తేజ్ సినిమాకు 'బ్రో' టైటిల్ ఖరారు చేసినట్లు సమాచారం. త్వరలో, అంటే ఈ వారంలోనే టైటిల్ అనౌన్స్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని తెలిసింది. 'బ్రో' టైటిల్ మాత్రమే అనౌన్స్ చేస్తారా? లేదంటే ఫస్ట్ లుక్ కూడా విడుదల చేస్తారా? అనేది చూడాలి.   

జూలై 28న సినిమా విడుదల!
ప్రముఖ నటుడు, ఇంతకు ముందు తెలుగులో మాస్ మహారాజా రవితేజ 'శంభో శివ శంభో'కు దర్శకత్వం వహించిన సముద్రఖని 'బ్రో' మూవీకి దర్శకుడు. ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. టీజీ విశ్వప్రసాద్ నిర్మాత. జూలై 28న ఈ  చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నట్లు కొన్ని రోజుల క్రితం అనౌన్స్ చేశారు.

ఇందులో సాయి ధరమ్ తేజ్ సరసన 'రొమాంటిక్' కథానాయిక కేతికా శర్మ (Ketika Sharma) కనిపించనున్నారు. ఆయన కంటే ముందు తమ్ముడు వైష్ణవ్ తేజ్ సరసన 'రంగ రంగ వైభవంగా' సినిమాలో ఆమె నటించారు. ఈ సినిమాలో ప్రియా ప్రకాశ్ వారియర్ కీలక పాత్ర చేస్తున్నారు.

Also Read : పడ్డవాడు చెడ్డవాడు కాదు - కుర్రాళ్ల క్రేజీ హార్ట్ బీట్ విజయ్ దేవరకొండ, రౌడీ బాయ్ కెరీర్‌ను మార్చిన మూవీస్ ఇవే!

View this post on Instagram
 
A post shared by Sai Dharam Tej (@jetpanja)

ఫిబ్రవరి 22న హైదరాబాదులో చిత్రీకరణ ప్రారంభించారు. ఈ సినిమాకు రోజుకు రెండు కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటున్నట్లు జనసేన పదవ వార్షికోత్సవ సభలో పవన్ తెలిపారు. ఈ సినిమాకు ఆయన 20 నుంచి 25 రోజులు షూటింగ్ చేశారని తెలిసింది. ఆయన పాత్రకు సంబంధించిన చిత్రీకరణ పూర్తి అయ్యింది.

Vinodhaya Sitham Telugu remake title : కారు యాక్సిడెంట్‌లో మరణించిన యువకుడికి దేవుడు రెండో అవకాశం ఇవ్వడం అనేది 'వినోదయ సీతమ్' సినిమాలో మెయిన్ కాన్సెప్ట్. తెలుగులో భగవంతుని పాత్రను పవన్ కళ్యాణ్ చేస్తున్నారు. రోడ్డు ప్రమాదానికి గురైన యువకుడిగా సాయి ధరమ్ తేజ్ నటించనున్నారు. పవన్ మోడ్రన్ దేవుడి పాత్ర చేయడం రెండోసారి. ఇంతకు ముందు 'గోపాల గోపాల'లో మోడ్రన్ శ్రీ కృష్ణుని పాత్ర చేశారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ కొంత సేపే ఉంటుంది. 

'వినోదయ సీతం' రీమేక్ కాకుండా... 'హరి హర వీర మల్లు', హరీష్ శంకర్ దర్శకత్వంలో 'ఉస్తాద్ భగత్ సింగ్', సుజీత్ దర్శకత్వంలో 'ఓజీ - ఒరిజినల్ గ్యాంగ్ స్టర్' సినిమాలు పవన్ కళ్యాణ్ చేతిలో ఉన్నాయి. ప్రస్తుతం 'ఓజీ' సాంగ్ షూటింగ్ కోసం మహాబలేశ్వరం వెళ్లారు పవన్. మార్షల్ ఆర్ట్స్ దుస్తుల్లో పవన్ గెటప్ చూసిన ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న 'హరి హర వీర మల్లు' చిత్రీకరణ చాలా వరకు పూర్తి అయ్యింది. 

Also Read : ఇమేజ్‌ను పక్కన పెట్టి హర్రర్ సినిమాల వైపు - వీరి ధైర్యానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే!

Published at : 09 May 2023 11:04 AM (IST) Tags: Sai Dharam Tej Pawan Kalyan Vinodhaya Sitham Telugu Remake PK SDT Movie Title BRO Telugu Movie

సంబంధిత కథనాలు

LGM Teaser: ‘కచ్చితంగా నీ కథ ముగించేస్తారు’ - ధోని నిర్మిస్తున్న ‘ఎల్జీయం’ టీజర్ చూశారా!

LGM Teaser: ‘కచ్చితంగా నీ కథ ముగించేస్తారు’ - ధోని నిర్మిస్తున్న ‘ఎల్జీయం’ టీజర్ చూశారా!

Intinti Ramayanam Trailer: ‘ఇంటింటి రామాయణం’ ట్రైలర్ - ఇంతకీ, ఆ పని చేసింది ఇంటి దొంగేనా?

Intinti Ramayanam Trailer: ‘ఇంటింటి రామాయణం’ ట్రైలర్ - ఇంతకీ, ఆ పని చేసింది ఇంటి దొంగేనా?

10,000 టికెట్లు ఫ్రీ, ‘ఆదిపురుష్’ నిర్మాత కీలక నిర్ణయం - కేవలం వాళ్లకు మాత్రమే!

10,000 టికెట్లు ఫ్రీ, ‘ఆదిపురుష్’ నిర్మాత కీలక నిర్ణయం - కేవలం వాళ్లకు మాత్రమే!

'గృహం' సీక్వెల్ రెడీ, అందుకే ‘బొమ్మరిల్లు-2’ తీయడం కష్టం: సిద్ధార్థ్

'గృహం' సీక్వెల్ రెడీ, అందుకే ‘బొమ్మరిల్లు-2’ తీయడం కష్టం: సిద్ధార్థ్

కోలీవుడ్‌ కాలింగ్ - శ్రీలీల డేట్స్ కోసం తమిళ నిర్మాతలు వెయిటింగ్

కోలీవుడ్‌ కాలింగ్ - శ్రీలీల డేట్స్ కోసం తమిళ నిర్మాతలు వెయిటింగ్

టాప్ స్టోరీస్

Odisha Train Accident: ఒడిశాలో మరో రైలు విషాదం, బోగీల కింద నలిగి ఆరుగురు మృతి!

Odisha Train Accident: ఒడిశాలో మరో రైలు విషాదం, బోగీల కింద నలిగి ఆరుగురు మృతి!

Dimple Hayathi Case: అరెస్ట్ చేయవద్దని నటి డింపుల్‌ హయతి పిటిషన్, హైకోర్టు ఏం చెప్పిందంటే!

Dimple Hayathi Case: అరెస్ట్ చేయవద్దని నటి డింపుల్‌ హయతి పిటిషన్, హైకోర్టు ఏం చెప్పిందంటే!

IND VS AUS: టీమిండియాకు ‘హెడ్’ షాట్ - ఫైనల్ తొలి రోజు ఆస్ట్రేలియాదే!

IND VS AUS: టీమిండియాకు ‘హెడ్’ షాట్ - ఫైనల్ తొలి రోజు ఆస్ట్రేలియాదే!

Weather Latest Update: 48 గంటల్లో కేరళలోకి రుతుపవనాలు, తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉందంటే?

Weather Latest Update: 48 గంటల్లో కేరళలోకి రుతుపవనాలు, తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉందంటే?