News
News
వీడియోలు ఆటలు
X

ఇమేజ్‌ను పక్కన పెట్టి హర్రర్ సినిమాల వైపు - వీరి ధైర్యానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే!

ఎప్పుడూ యాక్షన్, ఎంటర్టైనర్స్ తో అలరించే మన హీరోలు అప్పుడప్పుడూ హారర్ కథలతో భయపెట్టే ప్రయత్నం చేస్తుంటారు. తమ ఇమేజ్ ను పక్కనపెట్టి హారర్ చిత్రాల్లో నటించిన హీరోలెవరో చూద్దాం.

FOLLOW US: 
Share:
హార్రర్ కామెడీ చిత్రాలను ఆదరించే ఓ వర్గం ప్రేక్షకులు ఎప్పుడూ ఉంటారు. ఈ జోనర్ లో తెలుగులో ఇప్పటిదాకా లెక్కలేనన్ని సినిమాలు వచ్చాయి. దెయ్యాలు, భూతాల నేపథ్యంలో తెరకెక్కిన అనేక చిత్రాలు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించాయి. హారర్ కు కామెడీ కలబోసిన సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. కానీ పెద్ద పెద్ద హీరోలు ఎవరూ ఈ జోనర్ సినిమాలు చేయడానికి సాహసించరు. అయినప్పటికీ తమ ఇమేజ్ పక్కన పెట్టి హార్రర్ మూవీస్ చేసిన హీరోలు ఉన్నారు. వారెవరో, ఆ సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం!

రజినీకాంత్:

సూపర్ స్టార్ రజినీకాంత్, జ్యోతిక ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘చంద్రముఖి’. ఇది సీనియర్ యాక్టర్ విష్ణు వర్ధన్ నటించిన ఆప్తమిత్ర అనే కన్నడ చిత్రానికి అధికారిక రీమేక్. 2005 లో పి. వాసు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ.. బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. రజినీ ఏంటి, హారర్ కామెడీలో నటించడం ఏంటి అని కామెంట్ చేసిన వారందరి నోళ్ళు మూయించింది. దాదాపు 17 ఏళ్ల తర్వాత ఇప్పుడు 'చంద్రముఖి 2' సినిమా రాబోతోంది. కాకపొతే ఇందులో రజినీ నటించడం లేదు. దర్శక నటుడు రాఘవ లారెన్స్, బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

వెంకటేష్:

'నాగవల్లి' అనే హారర్ మూవీలో విక్టరీ వెంకటేశ్ నటించారు. పి. వాసు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వెంకీ రెండు పాత్రల్లో కనిపించారు. ఒకరు సైక్రియాటిస్ట్ గా, విలన్ నాగభైరవగా ఆకట్టుకున్నాడు. ఇందులో అనుష్క, కమలినీ ముఖర్జీ, శ్రద్ధా దాస్, రిచా గంగపాధ్యాయ్ ఇతర పాత్రలు పోషించారు. ఇది 'చంద్రముఖి' చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కింది. అయితే 2010 చివర్లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. 

అక్కినేని నాగార్జున:

కింగ్ నాగార్జున 'రాజు గారి గది 2' అనే హారర్ కామెడీ చిత్రంలో నటించారు. ఓంకార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సమంత రూత్ ప్రభు, సీరత్ కపూర్ కీలక పాత్రలు పోషించారు. ఇది 'రాజు గారి గది' సినిమాకు సీక్వెల్. ప్రేతమ్ అనే మలయాళ చిత్రం ఆధారంగా రూపొందింది. ఇందులో ఆత్మల ఉనికిని కనుగొనే మెంటలిస్ట్ రుద్రగా నాగ్ కనిపించారు. 

సూర్య:

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, విలక్షణ దర్శకుడు కాంబినేషన్ లో తెరకెక్కిన హార్రర్ కామెడీ మూవీ 'మాస్'. ఇది తెలుగులో 'రాక్షసుడు' పేరుతో రిలీజ్ అయింది. ఇందులో సూర్య ఫాదర్ అండ్ సన్ గా రెండు పాత్రల్లో నటించాడు. నయనతార, ప్రణీత హీరోయిన్స్ గా నటించారు. 2015లో వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ ను అంతగా ఆకట్టుకోలేకపోయింది. 

సుధీర్ బాబు:

ఘట్టమనేని అల్లుడు సుధీర్ బాబు నటించిన హర్రర్ కామెడి చిత్రం 'ప్రేమకథా చిత్రమ్'. మారుతి దర్శకత్వ పర్యవేక్షణలో జె. ప్రభాకర్ రెడ్డి ఈ సినిమాని తెరకెక్కించారు. ఇందులో నందిత హీరోయిన్ గా నటించగా.. ప్రవీణ్, సప్తగిరి నవ్వించే పాత్రలు పోషించారు. 2013లో రిలీజైన ఈ మూవీ మంచి విజయం సాధించింది.

సాయి ధరమ్ తేజ్:

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ 'విరూపాక్ష'. ఇందులో సంయుక్త మీనన్ హీరోయిన్. కార్తీక్ దండు డైరెక్ట్ చేసిన ఈ మిస్టిక్ థ్రిల్లర్ కు అగ్ర దర్శకుడు సుకుమార్ స్క్రీన్ ప్లే సమకూర్చారు. క్షుద్రపూజల నేపథ్యంలో ఉత్కంఠతకు గురిచేసే అంశాలు నిండిన థ్రిల్లర్ చిత్రమిది. ఇటీవలే థియేటర్స్ లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ అయింది. ఓవర్ సీస్ లో 1 మిలియన్ డాలర్స్ తో కలిపి 50 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.

సందీప్ కిషన్:

యువ హీరో సందీప్ కిషన్ 2019లో హారర్ ను టచ్ చేస్తూ, 'నిను వీడని నీడను నేనే' అనే సినిమా చేశాడు. ఇప్పుడు 'ఊరు పేరు భైరవకోన' అనే చిత్రంతో మరోసారి భయపెట్టేందుకు రెడీ అవుతున్నాడు. వి.ఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ సూపర్ నేచురల్ ఫాంటసీ థ్రిల్లర్ లో కావ్య థాపర్, వర్ష బొల్లమ్మ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ మూవీ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ప్రభాస్:

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో ఈ సినిమా రూపొందుతోంది. ఇది హారర్ అంశాలతో నిండిన వినూత్నమైన కథాంశంతో తెరక్కుతున్న సినిమా అని టాక్ నడుస్తోంది. దీనికి 'రాజా డీలక్స్' అనే పేరు ప్రచారంలో ఉంది. ఇందులో నిధి అగర్వాల్, మాళవికా మోహనన్, రిధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ ని అధికారికంగా ప్రకటించి, ఫస్ట్ లుక్ రిలీజ్ చేయనున్నారు.

నాగచైతన్య:

యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య 'దూత' అనే సూపర్ నేచురల్-హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ లో నటిస్తున్నాడు. విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సీరీస్ ను అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ నిర్మిస్తోంది. ఇది చైతూకి డిజిటల్ డెబ్యూ. ఇందులో ప్రియా భవానీ శంకర్ - పార్వతి తిరువోతు - ప్రాచీ దేశాయ్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. త్వరలోనే ఈ ఒరిజినల్ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ ను అనౌన్స్ చేయనున్నారు.
 
ఇకపోతే అక్షయ్ కుమార్, సైఫ్ అలీఖాన్, అర్జున్ కపూర్, కార్తీక్ ఆర్యన్, విక్కీ విశాల్ లాంటి బాలీవుడ్ స్టార్ హీరోలు కూడా హార్రర్ చిత్రాలతో హిందీ ఆడియెన్స్ ను అలరించారు. 
Published at : 28 Apr 2023 10:00 AM (IST) Tags: Akkineni Nagarjuna Venkatesh Sudheer Babu Naga Chaitanya Sai Dharam Tej Prabhas rajnikanth Tollywood Horror Movies

సంబంధిత కథనాలు

Mahesh Babu - Fidaa : మహేష్ బాబు - దీపికా పదుకోన్ - 'ఫిదా' చేసి ఉంటేనా? ఎందుకు 'నో' చెప్పారంటే?

Mahesh Babu - Fidaa : మహేష్ బాబు - దీపికా పదుకోన్ - 'ఫిదా' చేసి ఉంటేనా? ఎందుకు 'నో' చెప్పారంటే?

Anasuya Wedding Anniversary : మేం పర్ఫెక్ట్ జంట కాదు కానీ - మమ్మల్ని చికాకు పెట్టాలని చేశారు, బలంగా ఉన్నాం : అనసూయ 

Anasuya Wedding Anniversary : మేం పర్ఫెక్ట్ జంట కాదు కానీ - మమ్మల్ని చికాకు పెట్టాలని చేశారు, బలంగా ఉన్నాం : అనసూయ 

Sharwanand Marriage : శర్వానంద్ పెళ్ళైపోయిందోచ్ - రక్షితతో ఏడడుగులు వేసిన హీరో

Sharwanand Marriage : శర్వానంద్ పెళ్ళైపోయిందోచ్ - రక్షితతో ఏడడుగులు వేసిన హీరో

Shiva Balaji Madhumitha : మధుమితను ప్రేమలో పడేయాలని శివబాలాజీ అన్ని చేశారా - వెన్నెల కిశోర్ 'ఛీ ఛీ' అని ఎందుకున్నారు?

Shiva Balaji Madhumitha : మధుమితను ప్రేమలో పడేయాలని శివబాలాజీ అన్ని చేశారా - వెన్నెల కిశోర్ 'ఛీ ఛీ' అని ఎందుకున్నారు?

NTR Back To India : ఇండియా వచ్చేసిన ఎన్టీఆర్ - ఈ వారమే 'దేవర' సెట్స్‌కు...

NTR Back To India : ఇండియా వచ్చేసిన ఎన్టీఆర్ - ఈ వారమే 'దేవర' సెట్స్‌కు...

టాప్ స్టోరీస్

Odisha Train Accident: రైల్వే నెట్‌వర్క్‌లో కొన్ని లూప్‌హోల్స్‌ ఉన్నాయ్, అసలు సమస్య అదే - నిపుణులు

Odisha Train Accident: రైల్వే నెట్‌వర్క్‌లో కొన్ని లూప్‌హోల్స్‌ ఉన్నాయ్, అసలు సమస్య అదే - నిపుణులు

Katakam Sudarshan: గుండెపోటుతో మావోయిస్టు అగ్రనేత కటకం సుదర్శన్ మృతి

Katakam Sudarshan: గుండెపోటుతో మావోయిస్టు అగ్రనేత కటకం సుదర్శన్ మృతి

Gudivada Amarnath: ఒడిశా ప్రమాదంలో సురక్షితంగా ఏపీ వాసులు, ఒకరు మృతి - మంత్రి గుడివాడ వెల్లడి

Gudivada Amarnath: ఒడిశా ప్రమాదంలో సురక్షితంగా ఏపీ వాసులు, ఒకరు మృతి - మంత్రి గుడివాడ వెల్లడి

Coromandel Express: ప్రమాదంలో గూడ్సు రైలు పైకెక్కేసిన కోరమాండల్ రైలింజన్, విస్మయం కలిగించేలా ఘటన!

Coromandel Express: ప్రమాదంలో గూడ్సు రైలు పైకెక్కేసిన కోరమాండల్ రైలింజన్, విస్మయం కలిగించేలా ఘటన!