దుమ్మురేపిన రామ్, ‘ఆది కేశవ’గా వైష్ణవ్ తేజ్ - ఈ రోజు టాప్ 5 సినీ విశేషాలివే!
ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యంగా ఈ టాప్-5 విశేషాలు చూసేయండి.
‘ఆది కేశవ’గా వస్తున్న వైష్ణవ్ తేజ్ - పూర్తిస్థాయి మాస్ హీరో అవతారంలో!
‘ఉప్పెన’తో మొదటి సినిమాతోనే రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్. అయితే ఆ తర్వాత వచ్చిన ‘కొండ పొలం’, ‘రంగ రంగ వైభవంగా’ సినిమాలు నిరాశ పరిచాయి. దీంతో పూర్తి స్థాయి మాస్, యాక్షన్ హీరో అవతారం ఎత్తారు వైష్ణవ్ తేజ్. కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఎన్. రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాకి ‘ఆది కేశవ’ అనే టైటిల్‌ను నిర్ణయించారు. ఈ సినిమా టైటిల్, ఫస్ట్ గ్లింప్స్‌ను సోమవారం విడుదల చేశారు. జులైలో ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
తమిళ దర్శకుల దెబ్బ, తెలుగు హీరోలు అబ్బ - పవన్, చరణ్ పరిస్థితి ఎలా ఉంటుందో?
పాన్ ఇండియా చిత్రాల ట్రెండ్ మొదలయిన తర్వాత దర్శక హీరోలంతా ఇతర భాషల్లో క్రేజ్ తెచ్చుకొని, మార్కెట్ విస్తరించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా కొందరు టాలీవుడ్ డైరెక్టర్స్ తమిళ హీరోలతో సినిమాలు చేస్తే, కోలీవుడ్ ఫిలిం మేకర్స్ తెలుగు హీరోలతో వర్క్ చేస్తున్నారు. అయితే అందులో తెలుగు హీరోస్ & తమిళ్ డైరెక్టర్స్ కాంబినేషన్స్ కు సక్సెస్ పర్సెంటేజ్ చాలా తక్కువగా వుంది. వారికి హిట్లు కంటే ఫ్లాప్ చిత్రాలే ఎక్కువగా వున్నాయి. కోలీవుడ్ దర్శకులతో ఫ్లాప్స్ చవిచూసిన ఇప్పటి హీరోలెవరో చూద్దాం! (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
నీ స్టేటు దాటా, నీ గేటు దాటా, నీ పవర్ దాటా - ఫస్ట్ థండర్ తో దుమ్మురేపిన రామ్!
మాస్ సినిమాలను రూపొందించడంలో బోయపాటి శ్రీను స్టైలే వేరు. ఆయన తెరకెక్కించిన సినిమాలన్నీ మాస్ ప్రేక్షకులను ఓ రేంజిలో ఆకట్టుకుంటాయి. ప్రస్తుతం యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేనితో ఓ సినిమా చేస్తున్నారు. సినిమాలో కథానాయికగా నటిస్తున్న శ్రీలీల, సీనియర్ హీరో శ్రీకాంత్ కీలక పాత్రలో నటిస్తున్నారు. రామ్ ను ఇప్పటి వరకూ చూడని మాసీగా చూపించబోతున్నారు బోయపాటి. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
ఎన్టీఆర్, కొరటాల శివ చిత్రానికి పవర్ ఫుల్ టైటిల్ ఫిక్స్! జూనియర్ బర్త్ రోజున రివీల్?
‘RRR’ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్, ప్రస్తుతం దర్శకుడు కొరటాల శివతో కలిసి ఓ ప్రతిష్టాత్మక సినిమా చేస్తున్నారు. సుధాకర్ మిక్కిలినేని, కల్యాణ్ రామ్ సంయుక్తంగా ‘NTR30’ అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ నెగెటివ్ రోల్ పోషిస్తున్నారు. ఈ సినిమాకు అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నారు. వీఎఫ్ఎక్స్, స్టంట్స్ కోసం హాలీవుడ్ టెక్నీషియన్లు వర్క్ చేస్తున్నారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
‘ది కేరళ స్టోరీ’ స్టార్ అదా శర్మకు యాక్సిడెంట్, ప్రస్తుతం ఆమె కండీషన్ ఎలా ఉందంటే?
‘ది కేరళ స్టోరీ’ సినిమాలో ప్రధాన పాత్ర పోషించిన నటి అదా శర్మ నిన్న(ఆదివారం) రోడ్డు ప్రమాదానికి గురయ్యింది. ‘ది కేరళ స్టోరీ’ టీమ్ ముంబైలో ఓ ప్రైవేట్ కార్యక్రమానికి వెళ్తున్న సమయంలో వారి వాహనం యాక్సిడెంట్ కు గురయ్యింది. వెంటనే స్థానికులు అదా శర్మతో పాటు వాహనంలో ప్రయాణిస్తున్న వారిని హాస్పిటల్ కు తరలించారు. అయితే, ఈ ప్రమాదంలో వారికి స్వల్ప గాయాలు మాత్రమే కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)