News
News
వీడియోలు ఆటలు
X

Aadi Keshava: ‘ఆది కేశవ’గా వస్తున్న వైష్ణవ్ తేజ్ - పూర్తిస్థాయి మాస్ హీరో అవతారంలో!

మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్ ‘ఆది కేశవ’ ఫస్ట్ గ్లింప్స్‌ను నిర్మాతలు విడుదల చేశారు. ఈ సినిమా జులై నెలలో విడుదల కానుంది.

FOLLOW US: 
Share:

Aadi Keshava: ‘ఉప్పెన’తో మొదటి సినిమాతోనే రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్. అయితే ఆ తర్వాత వచ్చిన ‘కొండ పొలం’, ‘రంగ రంగ వైభవంగా’ సినిమాలు నిరాశ పరిచాయి. దీంతో పూర్తి స్థాయి మాస్, యాక్షన్ హీరో అవతారం ఎత్తారు వైష్ణవ్ తేజ్. కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఎన్. రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాకి ‘ఆది కేశవ’ అనే టైటిల్‌ను నిర్ణయించారు. ఈ సినిమా టైటిల్, ఫస్ట్ గ్లింప్స్‌ను సోమవారం విడుదల చేశారు. జులైలో ఈ సినిమా థియేటర్లలోకి రానుంది.

ఇక టీజర్ విషయానికి వస్తే... ఒక గుడి నేపథ్యంలో జరిగే కథలా అనిపిస్తుంది. రౌడీలు ఒక గుడి జోలికి వచ్చినప్పుడు జరిగే యాక్షన్ ఎపిసోడ్‌ను గ్లింప్స్‌గా విడుదల చేశారు. హీరో పేరును రుద్ర కాళేశ్వర రెడ్డి అని రివీల్ చేశారు. మరి ‘ఆది కేశవ’ టైటిల్‌కు సినిమాకు సంబంధం ఏంటో రానున్న రోజుల్లో రివీల్ చేసే అవకాశం ఉంది.

Read Also: ఎన్టీఆర్, కొరటాల శివ చిత్రానికి పవర్ ఫుల్ టైటిల్ ఫిక్స్! జూనియర్ బర్త్ రోజున రివీల్?

సినిమాలో చాలా వరకు మాస్ యాక్షన్ అంశాలు ఉండటంతో హీరో వైష్ణవ్ తేజ్ కూడా సరికొత్త మేకోవర్ చేయించుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన అనౌన్స్ మెంట్ టీజర్ అదిరిపోయేలా ఉంది. ఈ సినిమాలో శ్రీలీల డ్యాన్స్, నటన మరో లెవల్ లో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. తాజాగా శ్రీలీల  ‘ధమాకా’ సినిమాతో సాలిడ్ హిట్ అందుకుంది. తన నటన, డ్యాన్స్ తో ప్రేక్షకులను మెప్పించింది. ఇప్పటికే వైష్ణవ్ వెండి తెరపై కనిపించినా, అనుకున్న స్థాయిలో హిట్ అందుకోలేదు. ఈ నేపథ్యంలో తాజా సినిమా పై భారీగా అంచనాలు పెట్టుకున్నాడు.

Read Also: వీకెండ్‌లోనూ అదే పరిస్థితి? ‘కస్టడీ’కి కలెక్షన్స్ కష్టాలు

మమ్ముట్టి, మోహన్ లాల్, ఫహద్ ఫాజిల్ లాంటి మలయాళ యాక్టర్స్ ఇప్పటికే టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి తెలుగు ప్రేక్షకుల హృదయాలను దోచుకున్నారు. ఇప్పుడు వీరి సరసన మరో మలయాళ నటి కూడా జత కూడబోతోంది. ఆమే అపర్ణా దాస్. దక్షిణాదిలో మంచి సినిమాలు చేసి భారీ విజయాలను తన ఖాతాలో వేసుకున్న ఈ నటి... మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్ కొత్త చిత్రం 'ఆది కేశవ'లో నటించనున్నట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

'న్జన్ ప్రకాశన్', 'మనోహరం', 'బీస్ట్' వంటి సినిమాలతో మలయాళ, తమిళ సినీ పరిశ్రమల్లో మంచి నటిగా పేరు తెచ్చుకున్న అపర్ణా దాస్. ఆమె ఇటీవల నటించిన 'దాదా' చిత్రం సినీ విమర్శకులను సైతం మెప్పించింది. తాజాగా ఆమె.. మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ నాలుగో చిత్రంగా రూపొందుతున్న  'ఆది కేశవ'లో నటించనున్నట్టు మూవీ మేకర్స్ అఫిషియల్ గా వెల్లడించారు. ఈ సినిమాలో ఆమె "వజ్ర కాళేశ్వరి దేవి' పాత్రను పోషిస్తున్నట్టు ప్రకటించారు. ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా చిత్రబృందం ఈ మూవీని పక్కా ప్రణాళికతో రూపొందిస్తోందిస్తుండడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొంటున్నాయి.

ఈ మూవీకి ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం సమకూర్చనున్నారు. వెట్రిమారన్ - ధనుష్ 'అసురన్' (2019) , సుధా కొంగర - సూర్య 'సూరరై పొట్రు' (2020) సినిమాలకు స్వరాలు సమకూర్చిన జీవీ ప్రకాష్ కుమార్.. 'ఉల్లాసంగా ఉత్సాహంగా', 'కథానాయకుడు', 'ఎందుకంటే... ప్రేమంట!' సినిమాలకు చక్కటి సంగీతం ఇచ్చి తెలుగులో ప్రేక్షకుల మన్ననలూ పొందారు.

సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ పై చిత్రీకరిస్తోన్న 'ఆది కేశవ' సినిమాను తెలుగు సినీ ప్రేమికులు తప్పక థియేటర్లలో చూసి ఆనందిస్తారని మేకర్స్ విశ్వసిస్తున్నారు. అంతే కాకుండా ఈ సినిమాతోనే టాలీవుడ్ లోకి అడుగుపెడుతోన్న అపర్ణా దాస్ మరింత ఆకర్షణగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో వస్తోన్న ఈ చిత్రానికి ఎస్ నాగ వంశీ, ఎస్ సాయి సౌజన్య నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో వేచి చూడాలి. భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి నవీన్ నూలి ఎడిటర్ గా కొనసాగుతున్నారు. ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. 

Published at : 15 May 2023 04:41 PM (IST) Tags: Panja Vaisshnav Tej PVT04 Sreeleela Aadi Keshava

సంబంధిత కథనాలు

'యూత్‌ ను ఎంకరేజ్‌ చేయాలే, ధమ్‌ ధమ్‌ చేయొద్దు'  - జక్కన్న ట్వీట్ వైరల్!

'యూత్‌ ను ఎంకరేజ్‌ చేయాలే, ధమ్‌ ధమ్‌ చేయొద్దు' - జక్కన్న ట్వీట్ వైరల్!

OTT Releases in June: ఈ వారం ఓటీటీ, థియేటర్‌లలో రిలీజయ్యే మూవీస్ ఇవే

OTT Releases in June: ఈ వారం ఓటీటీ, థియేటర్‌లలో రిలీజయ్యే మూవీస్ ఇవే

SSMB28 Mass Strike: 20 ఏళ్ల తర్వాత మళ్లీ కబడ్డీ ఆడుతున్న మహేష్!

SSMB28 Mass Strike: 20 ఏళ్ల తర్వాత మళ్లీ కబడ్డీ ఆడుతున్న మహేష్!

Allu Sirish: సందీప్ కిషన్ కాదన్న కథతో అల్లు శిరీష్? - అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రేపే!

Allu Sirish: సందీప్ కిషన్ కాదన్న కథతో అల్లు శిరీష్? - అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రేపే!

PKSDT: దేవుడి షూ కాస్ట్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు 'బ్రో'..!

PKSDT: దేవుడి షూ కాస్ట్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు 'బ్రో'..!

టాప్ స్టోరీస్

4 Years Of YSRCP: వైఎస్ జగన్ పాలనకు నాలుగేళ్లు పూర్తి- భారీగా బైక్ ర్యాలీలు, కార్యక్రమాలకు నేతలు శ్రీకారం

4 Years Of YSRCP: వైఎస్ జగన్ పాలనకు నాలుగేళ్లు పూర్తి- భారీగా బైక్ ర్యాలీలు, కార్యక్రమాలకు నేతలు శ్రీకారం

Telangana CM KCR: తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలపై అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు

Telangana CM KCR: తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలపై అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు

Bonda Uma: టీడీపీ సంక్షేమ మేనిఫెస్టోతో తాడేపల్లి పునాదులు కదులుతున్నాయి- బొండా ఉమా

Bonda Uma: టీడీపీ సంక్షేమ మేనిఫెస్టోతో తాడేపల్లి పునాదులు కదులుతున్నాయి- బొండా ఉమా

లవ్ బూత్‌లో మెహ్రీన్ - హలో హనీ హార్ట్ మిస్సాయే అంటున్న ఫ్యాన్స్!

లవ్ బూత్‌లో మెహ్రీన్ - హలో హనీ హార్ట్ మిస్సాయే అంటున్న ఫ్యాన్స్!