By: ABP Desam | Updated at : 09 Jun 2023 05:06 PM (IST)
Representational Image/Pixabay
ప్రచార చిత్రాలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన సినిమా 'విమానం' (Vimanam 2023 movie). ఇందులో సముద్రఖని వికలాంగునిగా, ఆయన కుమారుడిగా మాస్టర్ ధ్రువన్ నటించారు. అనసూయ వేశ్య పాత్ర పోషించారు. కొంత విరామం తర్వాత మీరా జాస్మిన్ ఈ సినిమాతో తెలుగు, తమిళ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. రాహుల్ రామకృష్ణ, మొట్ట రాజేంద్రన్ ఇతర పాత్రల్లో నటించారు. ఈ సినిమా ఎలా ఉంది? (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
ఈ ఏడాది సమ్మర్ లో వివాహ ముహూర్తాలు ఎక్కువగా ఉండటంతో చాలా మంది పెళ్లిపీటలెక్కేస్తున్నారు. సినిమా, టీవీ కు సంబంధించిన సెలబ్రెటీలు కూడా మూడుముళ్ల బంధంతో కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్నారు. ఇటీవలే సినిమా హీరో శర్వానంత్-రక్షిత రెడ్డి పెళ్లి జైపూర్ లో ఘనంగా జరిగింది. తాజాగా బుల్లితెర కమెడీయన్ కెవ్వు కార్తీక్ కూడా ఓ ఇంటివాడయ్యాడు. శ్రీలేఖ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు కార్తీక్. కార్తీక్-శ్రీలేఖ ల పెళ్లి హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ పెళ్లి వేడుకకు టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి పలువురు సెలబ్రెటీలు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అలాగే బుల్లితెర నుంచి కూడా పులువురు ఆర్టిస్ట్ హాజరై సందడి చేశారు. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలు చూసి నెటిజన్స్ కొత్త జంట కు శుభాకాంక్షలు చెబుతూ కామెంట్లు చేస్తున్నారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
గత కొంత కాలంగా టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ, అనసూయ మధ్య కోల్డ్ వార్ జరుగుతుందనే ప్రచారం ఉంది. అందుకు తగ్గట్టుగానే అనసూయ సోషల్ మీడియాలో విజయ్ కు వ్యతిరేకంగా పోస్ట్ లు చేసుకుంటూ వస్తుంది. ఈ పోస్ట్ లపై విజయ్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. దీంతో అనసూయపై సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్ స్టార్ట్ చేశారు విజయ్ ఫ్యాన్స్. ఇది ఇలా కొన్ని రోజులుగా కొనసాగుతూనే ఉంది. విజయ్ ఫ్యాన్స్ ను ఉద్దేశించి కూడా అనసూయ ఒకటి రెండు సార్లు పోస్ట్ లు చేసింది. ఇటీవల విజయ్ నటించిన ‘ఖుషి’ సినిమా పోస్టర్ లో ది విజయ్ అని ఉండటంపై కూడా అనసూయ ఫైర్ అవుతూ ఓ పోస్ట్ చేసింది. దీని తర్వాత ఈ వివాదం మరింత ముందిరింది. అయితే తాజాగా అనసూయ ఈ కోల్డ్ వార్ పై స్పందించింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె విజయ్ తో తనకున్న విభేదాల గురించి చెప్పుకొచ్చింది. అంతే కాదు, ఇకపై తాను ఇవన్నీ ఆపేద్దామనుకుంటున్నానని మనసులో మాట బయటకు చెప్పింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
బాలీవుడ్ దర్శకుడు ఓమ్ రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘ఆదిపురుష్’. రామాయణం ఇతిహాసాల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో రాముడి పాత్రలో స్టార్ హీరో ప్రభాస్ నటిస్తుండగా.. సీత పాత్రలో బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ నటిస్తోంది. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ తిరుపతిలో జరిగింది. కార్యక్రమం తర్వాత మూవీ టీమ్ శ్రీవారిని దర్శించుకుంది. దర్శన అనంతరం ఆలయం వెలుపల దర్శకుడు ఓమ్ రౌత్ బయలుదేరడానికి ముందు హీరోయిన్ కృతి సనన్ ను ఆలింగనం చేసుకొని ఆమె చెంప పై ముద్దు పెట్టాడు. దీంతో ఈ సినిమా దర్శకుడుపై మరోసారి విమర్శలు వెల్లువెత్తాయి. పవిత్రమైన శ్రీవారి ఆలయ ప్రాంగణంలో ఓమ్ రౌత్ అలా చేయడం క్షమించరాని నేరం అని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో కూడా దీనిపై విపరీతంగా చర్చలు సాగుతున్నాయి కూడా. ఈ నేపథ్యంలో ఈ ఘటన పై గతంలో హిందీ టీవీ చానల్ లో ‘రామాయణం’ సీరియల్ లో సీతగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న దీపికా చిఖ్లియా స్పందించారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
'జబర్దస్త్' కామెడీ షో గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. తెలుగు బుల్లితెరపై అద్భుత ప్రేక్షక ఆదరణ పొందింది. సూపర్ డూపర్ హిట్ తెలుగు టీవీ షోలలో ఒకటిగా నిలిచింది. గత పదేళ్ళుగా విజయవంతంగా ఈ షో ప్రసారం అవుతోంది. 'జబర్దస్త్' షో ద్వారా ఎంతో మంది కమెడియన్లు వెలుగులోకి వచ్చారు. వారిలో ఒకడు 'పంచ్' ప్రసాద్. ఆయన గత కొంత కాలంగా ఆరోగ్య సమస్యలతో సతమతం అవుతున్నారు. కిడ్నీ సమస్యతో తీవ్ర ఇబ్బంది పడుతున్నాడు. ఇప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత విషమించింది. అతి త్వరలో ఆపరేషన్ చేయాలని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ప్రసాద్‌కు సాయం చేయడానికి ముందుకొచ్చింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
Rathika: బిగ్ బాస్ సీజన్ 7 నుండి రతిక ఔట్, తన ఎలిమినేషన్‌కు కారణాలు ఇవే!
Bigg Boss Season 7 Telugu: శివాజీ అనర్హుడు అని ప్రకటించిన కంటెస్టెంట్స్ - దీంతో నాగార్జున అలాంటి నిర్ణయం!
Bigg Boss Season 7 Telugu: తేజకు జైలు శిక్ష - కంటెస్టెంట్స్ అంతా కలిసి నిర్ణయం, నామినేషన్స్ విషయంలో కూడా ఎదురుదెబ్బ
Hari Teja: నటి హరితేజకు విడాకులు- కూల్ గా ఆన్సర్ ఇచ్చిన బిగ్ బాస్ బ్యూటీ
Bigg Boss Season 7 Latest Promo: డైరెక్ట్ ఇంటికి పంపించేయడం బెటర్ - నాగార్జున ముందే తేజపై సందీప్ వ్యాఖ్యలు
TDP Protest: న్యాయం కోసం ఎంతవరకైనా వెళ్తాం, త్వరలోనే టీడీపీ జైలు భరో చేస్తుంది: చినరాజప్ప
HCA Election Notification: హెచ్‌సీఏ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసింది, ముఖ్యమైన తేదీలివే
కూతురితో కనిపించిన మాజీ ప్రపంచ సుందరి - తల్లికి తీసిపోని అందం!
Aditya L1: ఇస్రో కీలక అప్‌డేట్, సూర్యుడి వైపు దూసుకెళ్తున్న ఆదిత్య L1
/body>