News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Kevvu Karthik Marriage: కమెడియన్ కెవ్వు కార్తీక్ పెళ్లి - హాజరైన పలువురు సెలబ్రెటీలు

బుల్లితెర కమెడీయన్ కెవ్వు కార్తీక్ కూడా ఓ ఇంటివాడయ్యాడు. శ్రీలేఖ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు కార్తీక్. కార్తీక్-శ్రీలేఖ ల పెళ్లి హైదరాబాద్ లో ఘనంగా జరిగింది.

FOLLOW US: 
Share:

Kevvu Karthik Marriage: ఈ ఏడాది సమ్మర్ లో వివాహ ముహూర్తాలు ఎక్కువగా ఉండటంతో చాలా మంది  పెళ్లిపీటలెక్కేస్తున్నారు. సినిమా, టీవీ కు సంబంధించిన సెలబ్రెటీలు కూడా మూడుముళ్ల బంధంతో కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్నారు. ఇటీవలే సినిమా హీరో శర్వానంత్-రక్షిత రెడ్డి పెళ్లి జైపూర్ లో ఘనంగా జరిగింది. తాజాగా బుల్లితెర కమెడీయన్ కెవ్వు కార్తీక్ కూడా ఓ ఇంటివాడయ్యాడు. శ్రీలేఖ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు కార్తీక్. కార్తీక్-శ్రీలేఖ ల పెళ్లి హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ పెళ్లి వేడుకకు టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి పలువురు సెలబ్రెటీలు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అలాగే బుల్లితెర నుంచి కూడా పులువురు ఆర్టిస్ట్ హాజరై సందడి చేశారు. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలు చూసి నెటిజన్స్ కొత్త జంట కు శుభాకాంక్షలు చెబుతూ కామెంట్లు చేస్తున్నారు. 

కామెడీ షో ద్వారా పాపులర్..

కార్తీక్ సినిమాల మీద ఇంట్రస్ట్ తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. మొదట్లో సినీ, రాజకీయ ప్రముఖుల వాయిస్ లను ఇమిటేట్ చేస్తూ మిమిక్రీ ప్రోగ్రాంలు చేసేవాడు. అదే టాలెంట్ తో ఓ ప్రముఖ చానల్ లో టెలికాస్ట్ అవుతున్న ‘జబర్దస్త్’ కార్యక్రమంలో చేరాడు. తన టాలెంట్ తో ఆ ప్రోగ్రాంలో కెవ్వు కార్తీక్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. తర్వాత వరుస ప్రోగ్రాంలు చేస్తూ కమెడియన్, రైటర్ గా పేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత సినిమా అవకాశాలు కూడా రావడంతో పలు సినిమాల్లో కూడా నటించాడు. ప్రస్తుతం వరుస టీవీ ప్రోగ్రాంలలో కనిపిస్తూ ఫుల్ బిజీ అయిపోయాడు. తాజాగా శ్రీలేఖను పెళ్లి చేసుకొని ఓ ఇంటివాడయ్యాడు. 

పెళ్లికి ముందే శ్రీలేఖను పరిచయం చేసిన కార్తీక్..

తాను చేసుకోబోయే అమ్మాయి గురించి పెళ్లికి ముందే పరిచయం చేశాడు కార్తీక్. కొన్ని రోజుల క్రితం తన సోషల్ మీడియా ఖాతా ద్వారా తను చేసుకోబోయే అమ్మాయి శ్రీలేఖను పరిచయం చేశాడు. ఇద్దరూ కలిసి దిగిన కొన్ని ఫోటోలను షేర్ చేశాడు. కానీ ఆమెను ముఖం కనిపించకుండా ఫోటోలు పెట్టాడు. ఆ తర్వాత ఇద్దరూ కలసి దిగిన ఫోటోలను షేర్ చేస్తూ ఆమెను పరిచయం చేశాడు కార్తీక్. దాని కింద ఓ నోట్ ను రాసుకొచ్చాడు కూడా. దీంతో ఈ జంట ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. 

గెటప్ శ్రీను పోస్ట్..

కార్తీక్-శ్రీలేఖ వివాహ వేడుక సదర్భంగా కొత్త జంటకు అందరూ శుభాకాంక్షలు చెబుతూ పోస్ట్ పెడుతున్నారు. ఈ నేపథ్యంలో ‘జబర్దస్త్’ పాపులర్ కమెడియన్ నటుడు గెటప్ శ్రీను కెవ్వు కార్తీక్ కు విసెష్ చెప్తూ తన సోషల్ మీడియా ఖాతాలో ఓ పోస్ట్ చేశారు. కెవ్వు కార్తీక్ జంట తో దిగిన ఫోటోను షేర్ చేశారు. దానితో పాటు ఇలా నోట్ రాసుకొచ్చారు.. ‘కొత్త జీవితంలోకి అడుగెట్టిన మా కెవ్వు కార్తీక్, శ్రీలేఖలకు.. మీరు జీవితాంతం సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆశిస్తూ మీ ఇద్దరికీ వివాహ మహోత్సవ శుభాకాంక్షలు’ అంటూ విష్ చేశాడు. శ్రీనుతో పాటు పలువురు బుల్లితెర సెలబ్రెటీలు హాజరై కార్తీక్ పెళ్లిలో సందడి చేశారు. ప్రస్తుతం కెవ్వు కార్తీక్ పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

Also Read: అభిమానుల చేతుల మీదుగా 'భగవంత్ కేసరి' టీజర్ - ఎన్ని థియేటర్లలో తెలుసా?

View this post on Instagram
 
A post shared by Srinu Boddupalli (@iamgetupsrinu)

Published at : 09 Jun 2023 09:52 AM (IST) Tags: TOLLYWOOD Comedian Kevvu Karthik Kevvu Karthik Marriage Karthik-Sreelekha

ఇవి కూడా చూడండి

Prema Entha Madhuram September 22nd: అనుకి వార్నింగ్ ఇచ్చిన ఛాయాదేవి, మాన్సీ - ఆర్యని ఇంటికి తీసుకొచ్చిన అక్కి!

Prema Entha Madhuram September 22nd: అనుకి వార్నింగ్ ఇచ్చిన ఛాయాదేవి, మాన్సీ - ఆర్యని ఇంటికి తీసుకొచ్చిన అక్కి!

Trinayani September 22nd Episode: కొత్త ప్లాన్‌తో తిలోత్తమా- పుట్టినరోజు సంబరాలలో విష ప్రయోగం!

Trinayani September 22nd Episode: కొత్త ప్లాన్‌తో తిలోత్తమా- పుట్టినరోజు సంబరాలలో విష ప్రయోగం!

Naveen Polishetty: ‘జవాన్’తో పోటీనా? తప్పు చేస్తున్నారని భయపెట్టారు- కానీ, అద్భుతం జరిగింది- నవీన్ పొలిశెట్టి

Naveen Polishetty: ‘జవాన్’తో పోటీనా? తప్పు చేస్తున్నారని భయపెట్టారు- కానీ, అద్భుతం జరిగింది- నవీన్ పొలిశెట్టి

Jagapathi Babu: కుర్రాడిగా మారేందుకు జగ్గూ భాయ్ పాట్లు.. ఆయనలో ఈ యాంగిల్ కూడా ఉందా?

Jagapathi Babu: కుర్రాడిగా మారేందుకు జగ్గూ భాయ్ పాట్లు.. ఆయనలో ఈ యాంగిల్ కూడా ఉందా?

VVS Laxman - 800 Pre Release : ముత్తయ్య కోసం ముంబైలో సచిన్ - ఇప్పుడు హైదరాబాద్‌లో వీవీఎస్ లక్ష్మణ్

VVS Laxman - 800 Pre Release : ముత్తయ్య కోసం ముంబైలో సచిన్ - ఇప్పుడు హైదరాబాద్‌లో వీవీఎస్ లక్ష్మణ్

టాప్ స్టోరీస్

వచ్చే నెలలో బీజేపీ ప్రచార హోరు, రంగంలోకి మోడీ, అమిత్ షా

వచ్చే నెలలో బీజేపీ ప్రచార హోరు, రంగంలోకి మోడీ, అమిత్ షా

సిక్కుల కళ్లలో ఆనందం కోసం కెనడా చిక్కుల్లో పడిందా? భారత్‌తో మైత్రిని కాదనుకుని ఉండగలదా?

సిక్కుల కళ్లలో ఆనందం కోసం కెనడా చిక్కుల్లో పడిందా? భారత్‌తో మైత్రిని కాదనుకుని ఉండగలదా?

జగన్ సైకో- కాదు చంద్రబాబే సైకో- ఏపీ అసెంబ్లీలో వాగ్వాదం- సభ నుంచి టీడీపీ లీడర్ల సస్పెన్షన్

జగన్ సైకో- కాదు చంద్రబాబే సైకో- ఏపీ అసెంబ్లీలో వాగ్వాదం- సభ నుంచి టీడీపీ లీడర్ల సస్పెన్షన్

Women's Reservation Bill: ప్రధానితో మహిళా ఎంపీల ఫొటోలు, స్వీట్లు పంపిణీ

Women's Reservation Bill: ప్రధానితో మహిళా ఎంపీల ఫొటోలు, స్వీట్లు పంపిణీ