By: ABP Desam | Updated at : 09 Jun 2023 04:22 PM (IST)
పంచ్ ప్రసాద్(Photo Credit: Social Media)
'జబర్దస్త్' కామెడీ షో గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. తెలుగు బుల్లితెరపై అద్భుత ప్రేక్షక ఆదరణ పొందింది. సూపర్ డూపర్ హిట్ తెలుగు టీవీ షోలలో ఒకటిగా నిలిచింది. గత పదేళ్ళుగా విజయవంతంగా ఈ షో ప్రసారం అవుతోంది. 'జబర్దస్త్' షో ద్వారా ఎంతో మంది కమెడియన్లు వెలుగులోకి వచ్చారు. వారిలో ఒకడు 'పంచ్' ప్రసాద్. ఆయన గత కొంత కాలంగా ఆరోగ్య సమస్యలతో సతమతం అవుతున్నారు. కిడ్నీ సమస్యతో తీవ్ర ఇబ్బంది పడుతున్నాడు. ఇప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత విషమించింది. అతి త్వరలో ఆపరేషన్ చేయాలని చెబుతున్నారు.
ప్రసాద్ హెల్త్ కండిషన్ సీరియస్ గా ఉందని ఆయన తోటి నటుడు, 'జబర్దస్త్' కమెడియన్ ఇమ్మాన్యుయేల్ సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టాడు. ''అన్నకు సీరియస్ గా ఉంది. డాక్టర్లు ఆపరేషన్ చేయాలని చెప్పారు. దానికి చాలా ఖర్చు అవుతుంది. మేం అంతా ట్రై చేస్తున్నాం. మీరు కూడా హెల్ప్ చేస్తారని కోరుకుంటున్నాను'' అని ఇమ్మాన్యుయేల్ పోస్ట్ చేశారు. ఆయన పోస్టులో ప్రసాద్ భార్య సునీత బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చారు. దాతల నుంచి సాయం కోరుతూ ఈ పోస్ట్ చేశారు ఇమ్మాన్యుయేల్. ఈ పోస్టుపై తాజాగా ఏపీ సర్కారు స్పందించింది. ఆయన చికిత్సకు సీఎం సహాయ నిధి నుంచి ఆర్థిక సాయం చేయనున్నట్లు ప్రకటించింది. ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి స్పెషల్ సెక్రెటరీ డాక్టర్ హరికృష్ణ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. “మా టీమ్ ప్రసాద్ కుటుంబ సభ్యులతో చర్చించింది. LOC దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. డ్యాక్యుమెంట్స్ ధృవీకరణను పూర్తి చేసిన వెంటనే మూత్రపిండ మార్పిడి కోసం CMRF కింద LOC మంజూరు చేస్తాము” అని ప్రకటించారు.
My team is following up with the family and guiding them in LOC application process. We will LOC under CMRF for renal transplantation as soon as we complete the documents verification.#YSJaganCares https://t.co/CAkeihv0VR
— Dr Hari Krishna (@HariKrishnaCMO) June 8, 2023
కిడ్నీ సమస్యల కారణంగా ప్రసాద్ కు మరిన్ని ఆరోగ్య సమస్యలు వచ్చాయి. గత ఏడాది నవంబర్ నెలలో ఓసారి ఆయనకు సీరియస్ అయ్యింది. ప్రసాద్ కిడ్నీ సమస్య తిరగబెట్టడంతో ఏకంగా నడవలేని స్థితికి చేరుకున్నారు. చిత్రీకరణ నుంచి ఇంటికి వెళ్లిన ప్రసాద్ జ్వరంతో పాటు నడవలేక బాధపడటంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పుడు పరీక్షలు చేసి కిడ్నీ సమస్య మరింత తీవ్రతరమైందని డాక్టర్లు చెప్పారు. నడుము వెనక వైపు చీము పట్టిందని వెల్లడించారు. అప్పుడు ఓ ఆపరేషన్ జరిగింది. ఇందుకు ఆయనకు శస్త్ర చికిత్స చేసినట్లు తెలుస్తోంది. పంచ్ ప్రసాద్ నడవలేని నడవలేని స్థితి నుంచి మళ్ళీ కోలుకుని టీవీ షూటింగులు కూడా చేశారు. ఈ మధ్య టీవీ ప్రోగ్రాంలలో ఆయన కనిపించారు. ఇప్పుడు మళ్ళీ ఆరోగ్య సమస్యలు తిరగబెట్టినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో తోటి ‘జబర్దస్త్’ కమెడియన్స్ సినిమా, టీవీ ఇండస్ట్రీలో తమకు తెలిసిన ప్రముఖుల నుంచి సాయం కోరుతూ ఫండ్ రైజింగ్ చేస్తున్నారు. ఇప్పుడు ఏపీ సర్కారు సైతం ప్రసాద్ కు అండగా నిలిచింది.
Read Also: చెర్రీ, తారక్‌లతో కలిసి పనిచేయాలని ఉంది - ‘థోర్’ హీరో క్రిస్ హేమ్స్ వెల్లడి, RRRపై ప్రశంసలు
Rathika: బిగ్ బాస్ సీజన్ 7 నుండి రతిక ఔట్, తన ఎలిమినేషన్‌కు కారణాలు ఇవే!
Bigg Boss Season 7 Telugu: శివాజీ అనర్హుడు అని ప్రకటించిన కంటెస్టెంట్స్ - దీంతో నాగార్జున అలాంటి నిర్ణయం!
Bigg Boss Season 7 Telugu: తేజకు జైలు శిక్ష - కంటెస్టెంట్స్ అంతా కలిసి నిర్ణయం, నామినేషన్స్ విషయంలో కూడా ఎదురుదెబ్బ
Bigg Boss Season 7 Latest Promo: డైరెక్ట్ ఇంటికి పంపించేయడం బెటర్ - నాగార్జున ముందే తేజపై సందీప్ వ్యాఖ్యలు
Guppedanta Manasu october 1st Promo: రిషి-వసుకి పెళ్లిచేసి కన్నుమూసిన జగతి, గుప్పెడంతమనసు నెక్స్ట్ లెవల్!
TDP Protest: న్యాయం కోసం ఎంతవరకైనా వెళ్తాం, త్వరలోనే టీడీపీ జైలు భరో చేస్తుంది: చినరాజప్ప
HCA Election Notification: హెచ్‌సీఏ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసింది, ముఖ్యమైన తేదీలివే
Hari Teja: నటి హరితేజకు విడాకులు- కూల్ గా ఆన్సర్ ఇచ్చిన బిగ్ బాస్ బ్యూటీ
కూతురితో కనిపించిన మాజీ ప్రపంచ సుందరి - తల్లికి తీసిపోని అందం!
/body>