అన్వేషించండి
Satyabhama Serial Today November 21th Highlights : అత్తకి సవతిని తెచ్చిన సత్య.. మహదేవయ్యకి షాక్ , చక్రవర్తికి సర్ ప్రైజ్ - సత్యభామ నవంబరు 21 ఎపిసోడ్ హైలెట్స్!
Satyabhama Today Episode: క్రిష్.. చక్రవర్తి కొడుకే అని సత్యకి పూర్తి నిజం తెలిసిపోయింది. ఆ నిజాన్ని బయటపెట్టే ప్రయత్నాల్లో ఉంది... ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే....

satyabhama serial november 21st episode Highlights
1/11

చక్రవర్తి నుంచి నిజం తెలుసుకుని ఇంటికి చేరుకున్న సత్య.. క్రిష్ మహదేవయ్యకి కాళ్లు పట్టడం చూసి రగిలిపోతుంది. నీ దుర్మార్గానికి ముగింపు పలికే టైమ్ వచ్చింది..అప్పటి వరకూ నువ్వు నవ్వు ఆ తర్వాత నేను నవ్వుతా అనుకుంటుంది
2/11

సంజయ్ ఇంట్లో డాన్స్ చేస్తుంటాడు..ఇంతలో జయమ్మ వచ్చి రేపు మీ నాన్న పుట్టినరోజు అంటుంది. నాకు అనవసరమైన విషయాలు అవసరం లేదంటాడు. ఆ మాటలు విని చక్రవర్తి బాధపడతాడు..అక్కడే ఉన్న సత్యకూడా సంజయ్ మాటలు విని ఫీలవుతుంది. కేకులు కట్ చేయాల్సిన అవసరం లేదు..జస్ట్ మెసేజ్ చేస్తాను అంటాడు
3/11

సంజయ్ మాటలకు ఫీలవకండి మావయ్య తను మీ కొడుకు కాదుకదా అని సర్ధిచెబుతుంది సత్య. పాతికేళ్లు పెంచానమ్మా ఆ అభిమానం కూడా లేదని బాధపడతాడు చక్రవర్తి. మీరు కలుపుమొక్కకి నీరుపోసి పెంచితే అది గులాబీ మొక్క అవదు..మీ కొడుక్కి నిజం తెలిసిన రోజు గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాడని చెబుతుంది..
4/11

నందిని రెడీ అయి శాంతమ్మ దగ్గరకు వెళ్లి హొయలు పోతుంది. ఇంత మంచిగా రెడీ అవడం వచ్చినప్పుడు ఇన్నాళ్లూ ఆ జిడ్డు మొహం వేసుకుని ఎందుకు ఉన్నావే అంటుంది. అందనట్టు ఉండాలని నువ్వు అనుకుంటే నా మనవడు ఎవరినైనా తగులుకుంటాడని హెచ్చరిస్తుంది .. నా హర్ష అలాంటోడు కాదంటుంది నందిని
5/11

మరోవైపు మైత్రి రౌడీలకు ఓ టాస్క్ ఇస్తుంది. హర్షతో తాను మాట్లాడుతున్నప్పుడు వచ్చి యాక్సిడెంట్ చేయమని చెబుతుంది. వాళ్లు అదే ఫాలోఅవుతారు.. హర్ష కంగారుపడిపోయి మైత్రిన ఇంటికి తీసుకెళ్తాడు..
6/11

సత్య వయ్యారాలు పోతూ క్రిష్ ని బయటకు వెళ్లకుండా ఆపేస్తుంది. రేపే మీ బాబాయ్ బర్త్ డే గుర్తుందా అని అడుగుతుంది. సంజయ్ ఉన్నా లేకున్నా ఒకటే అన్నీ నువ్వే చూసుకోవాలి అంటుంది సత్య. చూడు ఎట్లా సెలబ్రేట్ చేస్తానో అంటాడు క్రిష్. మరి గుడ్ న్యూస్ సంగతేంటని క్రిష్ అడిగితే..దిమ్మతిరిగే గుడ్ న్యూస్ చెబుతా వెయిట్ అండ్ వాచ్ అంటుంది సత్య...
7/11

నందిని హర్ష కోసం ఎదురుచూస్తుంటుంది. ఇంకా నా మనవడు రాలేదా అని శాంతమ్మ ఎంట్రీ ఇస్తుంది. కోపంగా హర్షకి కాల్ చేస్తుంది.
8/11

డాక్టర్ వచ్చి మైత్రి కాలికి కట్టుకట్టి ఈమెకి తోడుగా ఎవరైనా ఉండాలి తను నీ భర్తే కదా అని హర్షని ఉద్దేశించి అంటాడు. ఇంతలో నందిని కాల్ చేస్తుంది కానీ హర్ష మాట్లాడలేక కాల్ కట్ చేస్తాడు. మైత్రి మాత్రం మనసులో హర్ష లేటుగా వెళ్లేలా చేయాలి అనుకుంటుంది.
9/11

నందిని మళ్లీ కాల్ చేయడంతో...అసలు విషయం చెబుతాడు హర్ష. రాత్రంతా అక్కడే కూర్చుని సేవలు చేయి అని కోపంగా కాల్ కట్ చేస్తుంది నందిని.
10/11

క్రిష్, సత్య, జయమ్మ కలసి చక్రవర్తికి పుట్టిన రోజు విశెష్ చెబుతారు. ఎప్పుడో మీ కోడలు బతికి ఉన్నప్పుడు నా బర్త్ డే జరిగిందమమ్మా అని తల్లితో చెప్పుకుని బాధపడతాడు. క్రిష్ బాబాయ్ కళ్లు మూసి బయటకు తీసుకెళ్తాడు.. హ్యాపీ బర్త్ డే బాబాయ్ అంటూ కేక్ కట్ చేయమంటాడు.
11/11

సత్యభామ నవంబరు 22 ఎపిసోడ్ లో... సీరియల్ లోకి కొత్త క్యారెక్టర్ ఎంట్రీ ఇచ్చింది.. రావడంతోనే నువ్వు నా రక్తానివే కదా అంటూ క్రిష్ తో ముచ్చట మొదలెట్టింది. భైరవి ఆ విషయం భర్తతో చెప్పుకుని బాధపడుతుంది. మహదేవయ్య వచ్చి క్వశ్చన్ చేయడంతో నేను మీ రెండో పెళ్లాన్ని అని ఊరంతా అరిచి చెప్పండి అంటుంది.. మహదేవయ్య షాక్ అవుతాడు
Published at : 21 Nov 2024 09:36 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
సినిమా
ఇండియా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion