అన్వేషించండి

‘దేవర’ గ్లింప్స్ రూమర్స్, ‘గుంటూరు కారం’ కొత్త పోస్టర్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి.

ఎట్టకేలకు కూతురిని కెమెరాకి పరిచయం చేసిన రణ్ బీర్, ఆలియా.. రాహా ఎంత అందంగా ఉందో చూశారా?
బాలీవుడ్ క్యూట్ కపుల్ రణ్ బీర్ కపూర్, అలియా భట్ గురించి సినిమా ఇండస్ట్రీలో అందరికీ తెలిసే ఉంటుంది. ఐదేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట గతేడాది పెళ్ళి బంధంతో ఒక్కటయ్యారు. వీరి ప్రేమకు ప్రతిరూపంగా కుమార్తె రాహా కపూర్ జన్మించింది. కూతురుతో టైమ్ స్పెండ్ చేయడం కోసం.. సినిమాలకు కూడా గ్యాప్ ఇచ్చి మరీ పాపను చూసుకుంటున్నారు ఈ బాలీవుడ్ జంట. ట్టకేలకు తమ కూతురిని కెమెరాకు పరిచయం చేశారు ఈ బాలీవుడ్ కపుల్. క్రిస్మస్ సందర్భంగా రణబీర్ ఆలియా కూతురుతో ముంబైలో సందడి చేశారు. మొట్టమొదటిసారి ఈ జంట తమ కూతురిని మీడియా ముందుకు తీసుకురావడంతో మీడియా వాళ్లంతా ఆ చిన్నారిని ఫోటోలు తీస్తూ రణ్ బీర్, ఆలియా జంటకి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

బాబోయ్ ‘సలార్‌’ కోసం ఇంత కష్టపడ్డారా? గూస్ బంప్స్ తెప్పిస్తున్న మేకింగ్ వీడియో
ప్రభాస్‌, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌  ప్రధాన పాత్రల్లో ప్రశాంత్‌ నీల్‌ తెరకెక్కించిన బిగ్గెస్ట్ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘సలార్‌’. శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా డిసెంబర్ 22న ఈ చిత్రం తమిళం, మలయాళం, హిందీ, కన్నడ, తెలుగు భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లతో దూసుకెళ్తోంది. మూడు రోజుల్లో రూ.350 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. సినీ అభిమానులకు ‘సలార్‌’ టీమ్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. ‘సలార్‌’ మేకింగ్‌ వీడియో షేర్‌ చేసింది. ‘సలార్‌ సీజ్‌ఫైర్‌’ తెరకెక్కించేందుకు ఎంతలా కష్టపడ్డారో ఇందులో చూపించింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

ఎన్టీఆర్ 'దేవర' నుంచి గ్లిమ్స్ వీడియో - ఎప్పుడంటే?
టాలీవుడ్ అగ్ర హీరో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో 'దేవర' అనే భారీ పాన్ ఇండియా సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. RRR' వంటి పాన్ ఇండియా హిట్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న మూవీ కావడంతో ఈ సినిమాపై ఓ రేంజ్ లో అంచనాలు నెలకొన్నాయి. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన 'జనతా గ్యారేజ్' మంచి విజయాన్ని అందుకోవడంతో దేవర సినిమా కోసం తారక్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. లేటెస్ట్ టాలీవుడ్ రిపోర్ట్స్ ప్రకారం దేవర నుంచి ఓ గ్లిమ్స్ వీడియోని జనవరి 8 విడుదల చేసేందుకు మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఒకవేళ అప్పటికి కాకుంటే సంక్రాంతి రిలీజ్ అయ్యే సినిమాలన్నింటికీ దేవర గ్లిమ్స్​ని అటాచ్ చేసి రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

ఆ సినిమాకు నాకు రెమ్యునరేషన్‌ ఇవ్వలే, అల్లు అర్జున్‌ ఇంట్రెస్టింగ్ పోస్ట్‌!
తెలుగు సినిమా పరిశ్రమలో స్టార్ హీరోగా కొనసాగుతున్నారు అల్లు అర్జున్. ‘పుష్ప’ సినిమాతో దేశ వ్యాప్తంగా అద్భుత గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సినిమాలో నటనకుగాను ఏకంగా ‘జాతీయ ఉత్తమ నటుడి’ అవార్డు అందుకుని చరిత్ర సృష్టించారు. తాజాగా ఈ స్టార్ హీరో సోషల్ మీడియా వేదికగా పెట్టిన ఓ పోస్టు అందరినీ ఆకట్టుకుంటోంది. తాను నటించి తొలి సినిమాకే తన తండ్రి, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ రెమ్యునరేషన్ ఇవ్వలేదని చెప్పారు అల్లు అర్జున్. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఓ ఫొటోను షేర్ చేశారు. ఇందులో తన తండ్రి అల్లు అరవింత్ ‘విజేత’ సినిమా షీల్డ్ పట్టుకుని నవ్వుతూ కనిపిస్తున్నారు. ఇంతకీ అసలు విషయం ఏంటంటే? (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

‘గుంటూరు కారం’ నుంచి క్రిస్మస్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ - ఈసారి కాస్త డిఫరెంట్‌గా!
సూపర్ స్టార్ మహేశ్ బాబు తరువాతి సినిమా ‘గుంటూరు కారం’పై ప్రేక్షకుల్లో చాలా అంచనాలు ఉన్నాయి. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, మహేశ్ బాబు కాంబినేషన్‌లో తెరకెక్కినవి రెండు సినిమాలే అయినా.. ఈ కాంబినేషన్‌కు టాలీవుడ్‌లో విపరీతమైన క్రేజ్ ఉంది. అందుకే వీరిద్దరి కాంబోలో సినిమా తెరకెక్కుతుంది అని తెలియగానే ఏ వివరాలు తెలియకపోయినా.. మూవీపై అంచనాలు పెంచేసుకున్నారు అభిమానులు. అప్పటినుంచి వారి అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా విడుదలయిన ప్రతీ పోస్టర్‌లో మహేశ్‌ను మాస్ లుక్‌ను చూపించాడు త్రివిక్రమ్. కానీ మొదటిసారి క్రిస్మస్ స్పెషల్ పోస్టర్‌లో మాస్ కాకుండా క్లాస్ మహేశ్ బాబును చూపించాడు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP CID Ex Chief Sanjay: సీఐడీ మాజీ చీఫ్ సంజయ్‌ సస్పెన్షన్​ - విజయవాడ వదిలి వెళ్లవద్దని ఆదేశాలు
సీఐడీ మాజీ చీఫ్ సంజయ్‌ సస్పెన్షన్​ - విజయవాడ వదిలి వెళ్లవద్దని ఆదేశాలు
Minister Sridharbabu : ఇక వేగంగా భవన నిర్మాణ, లేఅవుట్ల అనుమతులు- సర్కార్ కొత్త ఆన్‌లైన్‌ విధానం
ఇక వేగంగా భవన నిర్మాణ, లేఅవుట్ల అనుమతులు- సర్కార్ కొత్త ఆన్‌లైన్‌ విధానం
Mega Combo: బిగ్గెస్ట్ న్యూస్ ఆఫ్ ది ఇయర్ వచ్చేసింది.. మెగాస్టార్‌ చిరంజీవితో నేచురల్ స్టార్ నాని
బిగ్గెస్ట్ న్యూస్ ఆఫ్ ది ఇయర్ వచ్చేసింది.. మెగాస్టార్‌ చిరంజీవితో నేచురల్ స్టార్ నాని
Harish Rao Phone Tapping Case: నా భార్యతో ఫోన్ సంభాషణలు విన్నారు, హరీష్ రావుపై కేసులో కీలక ఆధారాలు బయటపెట్టిన చక్రధర్
నా భార్యతో ఫోన్ సంభాషణలు విన్నారు, హరీష్ రావుపై కేసులో కీలక ఆధారాలు బయటపెట్టిన చక్రధర్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Police Case on Harish Rao | మాజీ మంత్రి హరీశ్ రావుపై కేసు నమోదు | ABP Desamలవర్స్ మధ్య గొడవ, కాసేపటికి బిల్డింగ్ కింద శవాలుకాళీయమర్ధనుడి అలంకారంలో  సిరుల‌త‌ల్లిరెండుగా వీడిపోయిన గూడ్స్ ట్రైన్, అలాగే వెళ్లిపోయిన లోకోపైలట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP CID Ex Chief Sanjay: సీఐడీ మాజీ చీఫ్ సంజయ్‌ సస్పెన్షన్​ - విజయవాడ వదిలి వెళ్లవద్దని ఆదేశాలు
సీఐడీ మాజీ చీఫ్ సంజయ్‌ సస్పెన్షన్​ - విజయవాడ వదిలి వెళ్లవద్దని ఆదేశాలు
Minister Sridharbabu : ఇక వేగంగా భవన నిర్మాణ, లేఅవుట్ల అనుమతులు- సర్కార్ కొత్త ఆన్‌లైన్‌ విధానం
ఇక వేగంగా భవన నిర్మాణ, లేఅవుట్ల అనుమతులు- సర్కార్ కొత్త ఆన్‌లైన్‌ విధానం
Mega Combo: బిగ్గెస్ట్ న్యూస్ ఆఫ్ ది ఇయర్ వచ్చేసింది.. మెగాస్టార్‌ చిరంజీవితో నేచురల్ స్టార్ నాని
బిగ్గెస్ట్ న్యూస్ ఆఫ్ ది ఇయర్ వచ్చేసింది.. మెగాస్టార్‌ చిరంజీవితో నేచురల్ స్టార్ నాని
Harish Rao Phone Tapping Case: నా భార్యతో ఫోన్ సంభాషణలు విన్నారు, హరీష్ రావుపై కేసులో కీలక ఆధారాలు బయటపెట్టిన చక్రధర్
నా భార్యతో ఫోన్ సంభాషణలు విన్నారు, హరీష్ రావుపై కేసులో కీలక ఆధారాలు బయటపెట్టిన చక్రధర్
Pushpa 2 Climax: దేవి శ్రీ లేదా సామ్... పుష్ప 2 క్లైమాక్స్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ చేసింది ఎవరు?
దేవి శ్రీ లేదా సామ్... పుష్ప 2 క్లైమాక్స్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ చేసింది ఎవరు?
AP Cabinet Decisions: ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు ఇవే - కాకినాడ పోర్టు, అదానీ వ్యవహారంపై కీలక చర్చ
ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు ఇవే - కాకినాడ పోర్టు, అదానీ వ్యవహారంపై కీలక చర్చ
Anasuya Bharadwaj: అనసూయ... ఆ బ్యాక్‌లెస్ బ్లౌజ్ శారీలో... అందంలో అస్సలు తగ్గేదే లే
అనసూయ... ఆ బ్యాక్‌లెస్ బ్లౌజ్ శారీలో... అందంలో అస్సలు తగ్గేదే లే
YS Sharmila: జగన్ హయాంలో లాక్కోవడం ట్రెండ్‌, మరి కూటమి సర్కార్ ఏం చేస్తోంది: షర్మిల ఫైర్
జగన్ హయాంలో లాక్కోవడం ట్రెండ్‌, మరి కూటమి సర్కార్ ఏం చేస్తోంది: షర్మిల ఫైర్
Embed widget