అన్వేషించండి

Devara Glimpse : ఎన్టీఆర్ 'దేవర' నుంచి గ్లిమ్స్ వీడియో - ఎప్పుడంటే?

Devara : ఎన్టీఆర్ నటిస్తున్న 'దేవర' మూవీ నుంచి గ్లిమ్స్ వీడియోని రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం.

NTR's Devara Glimpse Latest Update : టాలీవుడ్ అగ్ర హీరో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో 'దేవర' అనే భారీ పాన్ ఇండియా సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. RRR' వంటి పాన్ ఇండియా హిట్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న మూవీ కావడంతో ఈ సినిమాపై ఓ రేంజ్ లో అంచనాలు నెలకొన్నాయి. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన 'జనతా గ్యారేజ్' మంచి విజయాన్ని అందుకోవడంతో దేవర సినిమా కోసం తారక్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే గత కొద్ది రోజులుగా దేవర టీజర్ రాబోతున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్ సినిమాపై అంచనాలను పెంచేశాయి.

ఇలాంటి తరుణంలో డిసెంబర్ లో దేవర టీజర్ రాబోతుందని వార్తలువచ్చాయి. అయితే మూవీ టీం మాత్రం దేవర టీజర్ ని డిసెంబర్ లో రిలీజ్ చేయకుండా పోస్ట్ పోన్ చేసింది. లేటెస్ట్ టాలీవుడ్ రిపోర్ట్స్ ప్రకారం దేవర నుంచి ఓ గ్లిమ్స్ వీడియోని జనవరి 8 విడుదల చేసేందుకు మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఒకవేళ అప్పటికి కాకుంటే సంక్రాంతి రిలీజ్ అయ్యే సినిమాలన్నింటికీ దేవర గ్లిమ్స్​ని అటాచ్ చేసి రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. ప్రస్తుతం కొరటాల శివ టీజర్ కట్ పనులతో బిజీగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆమధ్య ఈ సినిమా నిర్మాతల్లో ఒకరైన కళ్యాణ్ రామ్ తన డెవిల్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో జనవరిలో మొదట్లోనే దేవర టీజర్​ని రిలీజ్ చేయబోతున్నామని.. ఆల్రెడీ టీజర్ రెడీ అవుతుందని చెప్పిన విషయం తెలిసిందే.

భారీ గ్రాఫిక్స్, వీఎఫ్ఎక్స్ షాట్స్​తో దేవర గ్లిమ్స్​ని కొరటాల రెడీ చేయిస్తున్నట్లు సమాచారం. త్వరలోనే టీజర్ కు సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ రానున్నట్లు తెలుస్తోంది. సముద్రం బ్యాక్ డ్రాప్​లో యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ తండ్రి కొడుకులుగా డ్యూయల్ రోల్ చేస్తున్నాడు. బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ ఈ మూవీతో తెలుగు వెండితెరకి హీరోయిన్​గా పరిచయం అవుతుంది. శ్రీదేవి కూతురిగా బాలీవుడ్​లో ఇప్పటికే సూపర్ సక్సెస్​ అయిన ఈ బ్యూటీ మొదటిసారి ఎన్టీఆర్​ సరసన నటిస్తూ ఇండస్ట్రీకి రాబోతుంది. బాలీవుడ్ అగ్ర హీరో సైఫ్ అలీఖాన్ విలన్​గా నటిస్తున్నారు. ఎన్టీఆర్ కెరియర్​లోనే అత్యంత భారీ బడ్జెట్​తో రూపొందుతున్న దేవర రెండు భాగాలుగా రాబోతోంది. మొదటి భాగం షూటింగ్ ఇప్పటికే సగానికి పైగా పూర్తయింది.

ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా వచ్చే ఏడాది వేసవి కానుకగా ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. యువ సుధా ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై మిక్కిలినేని సుధాకర్, కళ్యాణ్ రామ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి రత్నవేలు సినిమాటోగ్రఫర్ గా వ్యవహరిస్తున్నారు. హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ కెన్నీ బెట్స్ యాక్షన్ సీన్స్ ని డిజైన్ చేస్తున్నారు. అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు.

Also Read : ఆ సినిమాకు నాకు రెమ్యునరేషన్‌ ఇవ్వలే, అల్లు అర్జున్‌ ఇంట్రెస్టింగ్ పోస్ట్‌!

టాప్ హెడ్ లైన్స్

Anna Lezhneva : పవన్ బాటలోనే అన్నా కొణిదెల - వన్యప్రాణుల దత్తత
పవన్ బాటలోనే అన్నా కొణిదెల - వన్యప్రాణుల దత్తత
Anupama Parameswaran : నా సోషల్ మీడియా... ఏదైనా పోస్ట్ చేస్తా - అనుపమ పరమేశ్వరన్ స్ట్రాంగ్ రియాక్షన్
నా సోషల్ మీడియా... ఏదైనా పోస్ట్ చేస్తా - అనుపమ పరమేశ్వరన్ స్ట్రాంగ్ రియాక్షన్
Korean Kanakaraju Trailer : అలర్ట్... కొరియన్ కనకరాజు వచ్చేశాడు - కొరియన్ ఆత్మతో హీరో వార్... ఇంట్రెస్టింగ్‌గా ట్రైలర్
అలర్ట్... కొరియన్ కనకరాజు వచ్చేశాడు - కొరియన్ ఆత్మతో హీరో వార్... ఇంట్రెస్టింగ్‌గా ట్రైలర్
Lenin OTT : ఓటీటీలోకి అఖిల్ అక్కినేని కొత్త మూవీ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి అఖిల్ అక్కినేని కొత్త మూవీ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?

వీడియోలు

Minor Apologises to PM Modi | పీఎంపై వ్యాఖ్యలకు క్షమాపణ కోరిన మైనర్
Modi on abuses by youth | ఆవేదన చెందా కానీ కోపంలేదు 'దారి తప్పిన వారిని సరైన దారిలో నడిపిద్దాం
Jasprit Bumrah Fitness Cleared For Tests | ఫిట్‌నెస్ టెస్ట్ పాసైన జస్ప్రీత్ బుమ్రా
Serial Actress Vandana Gollu Real Life Story | బుల్లితెర నటి వందన గొల్లు రియల్ లైఫ్ స్టోరీ
Will Shami Play World Cup 2027? | గంగూలీ ప్లాన్ రిపీట్ చేయనున్న గిల్ ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Liquor Shops Closed: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు- ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు
CWG Boxing Gold: రింగ్ లో పంచ్ ల వర్షం.. గ్లాస్గో గేమ్స్ లో జైస్మిన్, ప్రీతి మైండ్ బ్లాకింగ్ గోల్డ్ మెడల్స్, బాక్సింగ్ లో పతకాల పంట!
రింగ్ లో పంచ్ ల వర్షం.. గ్లాస్గో లో జైస్మిన్, ప్రీతికి గోల్డ్ మెడల్స్- బాక్సింగ్ లో పతకాల పంట!
Telangana Police Jobs 2026: తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
Anantapur Crime News: అనంతపురంలో భయంకరమైన ఘటన - కూతురిపై కన్నేశాడని ప్రియుడి మర్మాంగం కోసేసిన మహిళ
అనంతపురంలో భయంకరమైన ఘటన - కూతురిపై కన్నేశాడని ప్రియుడి మర్మాంగం కోసేసిన మహిళ
PV Sunil Kumar Letter to CBI: డిప్యూటీ స్పీకర్ RRRపై సీబీఐకి మాజీ సీఐడీ చీఫ్ లేఖ - సాక్ష్యాల తారుమారు, బెదిరింపులు పై పీవీ సునీల్ కుమార్ సంచలన ఫిర్యాదు!
డిప్యూటీ స్పీకర్ RRRపై సీబీఐకి మాజీ సీఐడీ చీఫ్ లేఖ - సాక్ష్యాల తారుమారు, బెదిరింపులు పై పీవీ సునీల్ కుమార్ సంచలన ఫిర్యాదు!
PM Modi At Bhogapuram Airport: ఉత్తరాంధ్ర ప్రగతికి నూతన శకం.. స్వర్ణాంధ్ర విజన్‌కు మైలురాయి భోగాపురం ఎయిర్‌పోర్ట్: ప్రధాని మోదీ
ఉత్తరాంధ్ర ప్రగతికి నూతన శకం.. స్వర్ణాంధ్ర విజన్‌కు మైలురాయి భోగాపురం ఎయిర్‌పోర్ట్: ప్రధాని మోదీ
Korean Kanakaraju Trailer : అలర్ట్... కొరియన్ కనకరాజు వచ్చేశాడు - కొరియన్ ఆత్మతో హీరో వార్... ఇంట్రెస్టింగ్‌గా ట్రైలర్
అలర్ట్... కొరియన్ కనకరాజు వచ్చేశాడు - కొరియన్ ఆత్మతో హీరో వార్... ఇంట్రెస్టింగ్‌గా ట్రైలర్
Embed widget