అన్వేషించండి

Guntur Kaaram : ‘గుంటూరు కారం’ నుంచి క్రిస్మస్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ - ఈసారి కాస్త డిఫరెంట్‌గా!

మహేశ్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘గుంటూరు కారం’ నుండి క్రిస్మస్ స్పెషల్ పోస్టర్ విడుదలయ్యింది. కానీ మునుపటి పోస్టర్లతో పోలిస్తే ఇది కాస్త డిఫరెంట్‌గా ఉందని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.

Guntur Kaaram New Poster : సూపర్ స్టార్ మహేశ్ బాబు తరువాతి సినిమా ‘గుంటూరు కారం’పై ప్రేక్షకుల్లో చాలా అంచనాలు ఉన్నాయి. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, మహేశ్ బాబు కాంబినేషన్‌లో తెరకెక్కినవి రెండు సినిమాలే అయినా.. ఈ కాంబినేషన్‌కు టాలీవుడ్‌లో విపరీతమైన క్రేజ్ ఉంది. అందుకే వీరిద్దరి కాంబోలో సినిమా తెరకెక్కుతుంది అని తెలియగానే ఏ వివరాలు తెలియకపోయినా.. మూవీపై అంచనాలు పెంచేసుకున్నారు అభిమానులు. అప్పటినుంచి వారి అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా విడుదలయిన ప్రతీ పోస్టర్‌లో మహేశ్‌ను మాస్ లుక్‌ను చూపించాడు త్రివిక్రమ్. కానీ మొదటిసారి క్రిస్మస్ స్పెషల్ పోస్టర్‌లో మాస్ కాకుండా క్లాస్ మహేశ్ బాబును చూపించాడు.

‘ఒక్కడు’ తర్వాత మళ్లీ ‘గుంటూరు కారం’లోనే..

‘గుంటూరు కారం’ అనే టైటిల్‌లోనే చాలా మాస్ ఉంది. దానికి తగినట్టుగా.. ఈ సినిమాలో నుండి మహేశ్ ఫస్ట్ లుక్‌ను రెడ్ షర్ట్, బీడీతో రిలీజ్ చేశాడు. ‘ఒక్కడు’ తర్వాత మహేశ్ బాబు సిగరెట్, బీడీ తాగుతూ ఎప్పుడూ కనిపించలేదని ఫ్యాన్స్ గుర్తుచేసుకున్నారు. కేవలం ఆ పోస్టర్‌లోనే కాదు.. అప్పటినుండి విడుదలవుతున్న ప్రతీ పోస్టర్‌లో మహేశ్ బీడీతోనే కనిపించాడు. కానీ క్రిస్మస్ పోస్టర్‌లో మహేశ్ చేతిలో బీడీ లేదు. బ్లాక్ షర్ట్‌లో క్లాస్ లుక్‌తో, సింపుల్ స్మైల్‌తో తన ప్రేక్షకులను మరోసారి ఫిదా చేశాడు మహేశ్. ముఖ్యంగా లేడీ ఫ్యాన్స్ అయితే ఈ పోస్టర్‌ను చూసి ‘ఓ మై బేబీ’ అంటూ పాటలు పాడేస్తున్నారు. 2024 జనవరి 12న ‘గుంటూరు కారం’ విడుదల కానుందని క్రిస్మస్ స్పెషల్ పోస్టర్‌తో మరోసారి క్లారిటీ ఇచ్చారు మేకర్స్.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Haarika & Hassine Creations (@haarikahassine)

రెండు పాటలు రిలీజ్..

ఇప్పటినుండి ‘గుంటూరు కారం’ సినిమా నుండి రెండు పాటలు విడుదలయ్యాయి. ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుండి మొదటి ‘దమ్ బిర్యానీ’ పాట విడుదలయ్యింది. మహేశ్ మాస్ కటౌట్‌కు సరిపోయేలా ఉన్న ఈ పాట వెంటనే మ్యూజిక్ లవర్స్‌ను ఇంప్రెస్ చేసేసింది. ఆ తర్వాత ఒక ప్రేమపాటను రిలీజ్ చేసింది మూవీ టీమ్. ఇది మూవీలో హీరోయిన్‌గా నటిస్తున్న శ్రీలీల.. మహేశ్ కోసం పాడే పాట. ‘ఓ మై బేబీ’ అంటూ సాగే ఈ పాటకు ముందుగా ఆడియన్స్ నుండి అంత పాజిటివ్ రెస్పాన్స్ రాలేదు. కానీ మెల్లగా ఇది మ్యూజిక్ లవర్స్‌ను ఆకట్టుకోవడం మొదలుపెట్టింది. దీంతో ‘ఓ మై బేబీ’ పాటకు యూట్యూబ్‌లో మిలియన్లకొద్దీ వ్యూస్ వచ్చేస్తున్నాయి.

మెసేజ్ వద్దు ప్లీజ్..

మహేశ్ బాబు.. తన గత సినిమాల్లో ఏదో ఒక మెసేజ్‌తోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. మహేశ్ లాంటి హీరోకు మాస్ ఫాలోయింగ్ కూడా చాలానే ఉండడంతో ఇలాంటి మెసేజ్ ఓరియెంటెడ్ కథలు తనకు సూట్ అవ్వడం లేదని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. తను చేస్తున్న మెసేజ్ ఓరియెంటెడ్ కథలు హిట్టే అవుతున్నా కూడా అలాంటి కథల్లో మహేశ్ పూర్తిస్థాయి యాక్టింగ్‌ను ఎవరూ వినియోగించుకోవడం లేదని సోషల్ మీడియాలో విమర్శలు వినిపిస్తున్నాయి. అందుకే కనీసం ‘గుంటూరు కారం’ అయినా.. ఈ మెసేజ్ ఓరియెంటెడ్ కథల క్యాటగిరీలో చేరకపోతే బాగుంటుందని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రెండో హీరోయిన్‌గా మీనాక్షి చౌదరీ నటిస్తోంది. హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

Also Read: ‘డుంకీ‘ డైరెక్టర్ ఫోన్ చేసి ఆ రూమర్ నిజం చేద్దామన్నారు.. మరిచిపోవడానికి చాలా టైమ్‌ పట్టింది

టాప్ హెడ్ లైన్స్

Irumudi Trailer Review : ఇరుముడి ట్రైలర్ వచ్చేసింది - కూతురినే కాదు ఆడపిల్లలను కాపాడే తండ్రిగా రవితేజ... యాక్షన్ థ్రిల్లర్ విత్ ఎమోషనల్ స్టోరీ
ఇరుముడి ట్రైలర్ వచ్చేసింది - కూతురినే కాదు ఆడపిల్లలను కాపాడే తండ్రిగా రవితేజ... యాక్షన్ థ్రిల్లర్ విత్ ఎమోషనల్ స్టోరీ
NTR Health Update : ఎన్టీఆర్‌కు సర్జరీ సక్సెస్ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ సక్సెస్ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Pyaar Prema Kalyanam OTT : డైరెక్ట్‌గా ఓటీటీలోకి తెలుగమ్మాయి మూవీ - తమిళ రొమాంటిక్ డ్రామా స్ట్రీమింగ్... ట్రైలర్ చూశారా?
డైరెక్ట్‌గా ఓటీటీలోకి తెలుగమ్మాయి మూవీ - తమిళ రొమాంటిక్ డ్రామా స్ట్రీమింగ్... ట్రైలర్ చూశారా?
Love Entertainer OTT : మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ
మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
IND vs SL Test Series: గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Bigg Boss Agnipariksha: 'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
Ayyanna Patrudu: వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
Adilabad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Embed widget