అన్వేషించండి

Taapsee : ‘డుంకీ‘ డైరెక్టర్ ఫోన్ చేసి ఆ రూమర్ నిజం చేద్దామన్నారు.. మరిచిపోవడానికి చాలా టైమ్‌ పట్టింది

Taapsee : సొట్టబుగ్గల సుందరి తాప్సీ పన్ను ‘డుంకీ‘ సినిమా గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ఈ మూవీలో తనకు ఎలా ఛాన్స్ వచ్చిందో వివరించింది. పనిలో పనిగా తన లవ్ స్టోరీ గురించి చెప్పుకొచ్చింది.

Taapsee On Dunki Rumour : తెలుగు, తమిళ చిత్రాలతో స్టార్ హీరోయిన్​గా మారింది తాప్సీ పన్ను. సౌత్ లో పలువురు స్టార్ హీరోలతో కలిసి ఎన్నో సూపర్ డూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. కొద్ది కాలం పాటు టాలీవుడ్, కోలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీ బిజీగా గడిపింది. ఆ తర్వాత బాలీవుడ్ నుంచి అవకాశాలు రావడంతో అక్కడికి వెళ్లిపోయింది. ప్రస్తుతం అక్కడ సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా రాణిస్తోంది. ఒకవైపు లేడీ ఓరియెంటెడ్‌ సినిమాలు చేస్తూనే, మరోవైపు స్టార్‌ హీరోల సినిమాల్లోనూ మెరుస్తోంది. తాజాగా బాలీవుడ్‌ బాద్‌ షా షారుక్‌ ఖాన్‌ తో కలిసి ‘డుంకీ’ అనే సినిమాలో నటించింది. ఈ నెల 21న విడుదలైన ఈ సినిమా సక్సెస్ టాక్ దక్కించుకుంది. వసూళ్ల పరంగానూ ఫర్వాలేదు అనిపిస్తోంది.

ఊహాగానాలే నిజం అయ్యాయి- తాప్సీ

‘డుంకీ’ ప్రమోషన్ లో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తాప్సీ పన్ను ఈ సినిమాలో తనకు ఎలా అవకాశం వచ్చిందో వివరించింది. పనిలో పనిగా తన లవ్‌ స్టోరీ గురించి చెప్పుకొచ్చింది. “కొన్నిసార్లు ఊహాగానాలు నిజం అవుతాయి. ‘డుంకీ’లోని తన పాత్ర సైతం అలాంటిదే. ఈ సినిమా ప్రకటించిన కొత్తలో షారుక్‌ పక్కన నటించే లక్కీ ఛాన్స్‌ ఎవరికి వస్తుందో? అని చాలా మీడియా సంస్థలు కథనాలు రాశాయి. అదే సమయంలో చాలా మంది హీరోయిన్లు కూడా తమకు వస్తే బాగుటుంది అనుకున్నారు.  ఎలా మొదలైందో తెలియదు. కానీ, ఈ సినిమాలో నేను హీరోయిన్ గా నటిస్తున్నానని రూమర్ వచ్చింది. దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. అదే సమయంలో నేను ఓ సౌత్ కొరియా సినిమాలో నటిస్తున్నాను. ఈ షూటింగ్ కోసం ఫారిన్ లో ఉన్నాను. అదే సమయంలో దర్శకుడు రాజ్‌ కుమార్‌ హిరానీ నుంచి ఓ ఫోన్ వచ్చింది. ‘డుంకీ’ సినిమాలో నువ్వే హీరోయిన్‌ అని అందరూ చెప్తున్నారు. ఆ వార్త నిజం చేద్దామా? అని అడిగారు. ఇండియాకు రాగానే చెప్పు, వచ్చి స్టోరీ చెప్తాను అన్నారు. ఆ కాల్ తో నేను సంతోషంలో మునిగిపోయాను. అక్కడి నుంచి రాగానే వెంటనే వెళ్లి తనను కలిశాను. సినిమాలో నటించేందుకు ఓకే చెప్పాను” అని తాప్సీ వెల్లడించింది.

మర్చిపోవడానికి చాలా టైం పట్టింది- తాప్సీ   

అటు తన లవ్ స్టోరీ గురించి కూడా తాప్సీ ఇంట్రెస్టింగ్ విషయాన్ని పంచుకుంది. “తొమ్మిదో తరగతి చదువుతున్న సమయంలో తొలిసారి ప్రేమలో పడ్డాను.  హైస్కూల్‌ లో తన సీనియర్‌, 10వ తరగతి అబ్బాయిని చూసి ఇష్టపడ్డాను. మొదట్లో నా పట్ల తను కూడా ఇంట్రెస్ట్‌ చూపించాడు. కానీ, చదువుకు ఇబ్బంది కలుగుతుందని నన్ను దూరం పెట్టాడు. ప్రేమ, గీమ వదిలేసి చదువు మీద ఫోకస్ పెట్టాలని ఉచిత సలహా కూడా ఇచ్చాడు. నేను ఇష్టపడ్డ అబ్బాయి అలా మాట్లాడటంతో చాలా బాధపడ్డాను. ఆ బాధ నుంచి బయటపడటానికి చాలా టైమ్‌ పట్టింది” అని తాజాగా తన బ్రేకప్‌ స్టోరీని వివరించింది తాప్సీ.

Read Also: 'సరిహద్దులు చెరిగిపోతున్నాయి.. ఇండియన్ ఫిల్మ్ రేంజ్ పెరుగుతోంది' ప్రభాస్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

టాప్ హెడ్ లైన్స్

God Of War: తమిళ రాజకీయాల్లో ఎన్టీఆర్ 'గాడ్ ఆఫ్ వార్' కాంట్రవర్సీ... ఆ ఒక్క మాటను వదలట్లేదుగా
తమిళ రాజకీయాల్లో ఎన్టీఆర్ 'గాడ్ ఆఫ్ వార్' కాంట్రవర్సీ... ఆ ఒక్క మాటను వదలట్లేదుగా
Aamir Khan Net Worth: వందల కోట్ల ఆస్తులు... అమెరికాలో ఇల్లు... లగ్జరీ కార్లు... ఆమిర్ ఆస్తి ఎంతో తెలుసా?
వందల కోట్ల ఆస్తులు... అమెరికాలో ఇల్లు... లగ్జరీ కార్లు... ఆమిర్ ఆస్తి ఎంతో తెలుసా?
Satluj OTT : మూడేళ్ల తర్వాత డైరెక్ట్‌గా ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ - టైటిల్ ఛేంజ్... ఎందులో చూడొచ్చంటే?
మూడేళ్ల తర్వాత డైరెక్ట్‌గా ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ - టైటిల్ ఛేంజ్... ఎందులో చూడొచ్చంటే?
Bigg Boss Sanjana Serial : బిగ్ బాస్ ఫేం సంజన బుల్లితెర ఎంట్రీ - స్టార్ మాలో సరికొత్త సీరియల్... ఎప్పటి నుంచంటే?
బిగ్ బాస్ ఫేం సంజన బుల్లితెర ఎంట్రీ - స్టార్ మాలో సరికొత్త సీరియల్... ఎప్పటి నుంచంటే?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Women T20 World Cup Champ Australia: ఆసీస్ ఏడోసారి.. రికార్డ్ ఛేజింగ్ తో వ‌ర‌ల్డ్ చాంప్ గా నిలిచిన కంగారులు.. ఇంగ్లాండ్ కి నాలుగోసారి భంగ‌పాటు.. స‌త్తా చాటిన మూనీ, లీచ్ ఫీల్డ్..
ఆసీస్ ఏడోసారి.. రికార్డ్ ఛేజింగ్ తో వ‌ర‌ల్డ్ చాంప్ గా నిలిచిన కంగారులు.. ఇంగ్లాండ్ కి నాలుగోసారి భంగ‌పాటు.. స‌త్తా చాటిన మూనీ, లీచ్ ఫీల్డ్..
Prashna Ravan Wife: పవన్ కళ్యాణ్ మాట్లాడితే ఒప్పు.. నా భర్త మాట్లాడితే తప్పా? మమ్మల్ని ఒకేసారి చంపేయండి: ప్రశ్న రావణ్ భార్య
పవన్ కళ్యాణ్ మాట్లాడితే ఒప్పు.. నా భర్త మాట్లాడితే తప్పా? మమ్మల్ని ఒకేసారి చంపేయండి: ప్రశ్న రావణ్ భార్య
Uttam Kumar Reddy: బీఆర్ఎస్ చెప్పింది చేస్తే భద్రాచలం మునిగిపోతుంది: కాళేశ్వరంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
బీఆర్ఎస్ చెప్పింది చేస్తే భద్రాచలం మునిగిపోతుంది: కాళేశ్వరంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
KTR Challenges Revanth Reddy: చేతకాకపోతే వారం రోజులు కేసీఆర్‌కి అప్పజెప్పండి.. అన్ని జలాశయాలు నింపి చూపిస్తాం: రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్!
చేతకాకపోతే వారం రోజులు కేసీఆర్‌కి అప్పజెప్పండి.. మొత్తం నీటితో నింపి చూపిస్తాం: రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్!
Satluj OTT : మూడేళ్ల తర్వాత డైరెక్ట్‌గా ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ - టైటిల్ ఛేంజ్... ఎందులో చూడొచ్చంటే?
మూడేళ్ల తర్వాత డైరెక్ట్‌గా ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ - టైటిల్ ఛేంజ్... ఎందులో చూడొచ్చంటే?
MLC Duvvada Srinivas: భయపడటం, పారిపోవడం నా బ్లడ్‌లోనే లేదు.. జైలుకు వెళ్లడానికైనా రెడీ: దువ్వాడ శ్రీనివాస్
భయపడటం, పారిపోవడం నా బ్లడ్‌లోనే లేదు.. జైలుకు వెళ్లడానికైనా రెడీ: దువ్వాడ శ్రీనివాస్
Tata Tiago EV on Discount: దేశంలో అత్యంత చౌకైన ఈవీపై రూ.1.45 లక్షల డిస్కౌంట్.. ఫీచర్లు, రేంజ్ చూసి కొనేయండి
అత్యంత చౌకైన ఈవీపై రూ.1.45 లక్షల డిస్కౌంట్.. ఫీచర్లు, రేంజ్ చూసి కొనేయండి
Prashna Ravan Sedition Case: ప్రశ్న రావణ్‌పై రాజద్రోహం కేసు నమోదు.. మరిన్ని చిక్కుల్లో యూట్యూబర్ ! వివాదం ఏంటీ
ప్రశ్న రావణ్‌పై రాజద్రోహం కేసు నమోదు.. మరిన్ని చిక్కుల్లో యూట్యూబర్ ! వివాదం ఏంటీ
Embed widget