News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

బెదరగొట్టిన ‘యానిమల్’, రామ్ ‘స్కంద’.. ‘చంద్రముఖి-2’ ఎలా ఉన్నాయ్? ఇవీ ఈ రోజు టాప్ 5 సినీ విశేషాలు

ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యంగా ఈ టాప్-5 విశేషాలు చూసేయండి.

FOLLOW US: 
Share:

‘యానిమల్’ టీజర్: నాకన్నా చెడ్డవాడు లేడు - రణ్ బీర్ ఊరమాస్ అవతార్ అదుర్స్!

బాలీవుడ్ ఆడియన్స్ తో పాటు టాలీవుడ్ ఆడియన్స్ ఎంతో ఎక్సైటింగ్ గా వెయిట్ చేస్తున్న 'యానిమల్'(Animal) టీజర్ వచ్చేసింది. 'అర్జున్ రెడ్డి' సినిమాతో సెన్సేషనల్ డైరెక్టర్ గా మారిన సందీప్ రెడ్డి వంగా మరోసారి 'యానిమల్' టీజర్ తో రచ్చ చేశాడు. అర్జున్ రెడ్డిని మించి 'యానిమల్' టీజర్ మరింత వైలెంట్ గా ఉందని చెప్పొచ్చు. అర్జున్ రెడ్డి సినిమాని హిందీలో 'కబీర్ సింగ్' పేరుతో సందీప్ రెడ్డి వంగ రీమేక్ చేయగా ఆ సినిమా చూసి బాలీవుడ్ విశ్లేషకులు ఇది మోస్ట్ వయొలెంట్ ఫిలిం అని కామెంట్స్ చేశారు. ఆ కామెంట్స్ గురించి సందీప్ రెడ్డి మాట్లాడుతూ.. 'అసలు వయొలెన్స్ అంటే ఎలా ఉంటుందో నా నెక్స్ట్ సినిమాలో చూపిస్తానని' చెప్పాడు. చెప్పినట్టుగానే 'యానిమల్' టీజర్ ని వైలెన్స్ తో నింపేశాడు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

'స్కంద' రివ్యూ : యాక్షన్ విధ్వంసం - రామ్, బోయపాటి సినిమా ఎలా ఉందంటే?

'అఖండ' బ్లాక్ బస్టర్ తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన సినిమా 'స్కంద' (Skanda Movie). రామ్ పోతినేని, శ్రీ లీల జంటగా నటించారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేశారు. ట్రైలర్లలో యాక్షన్ & ఫ్యామిలీ ఎమోషన్స్ కనిపించాయి. మరి, సినిమా (Skanda Review) ఎలా ఉంది? (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

'స్కంద'కి సీక్వెల్ - థియేటర్స్‌లో సర్ప్రైజ్ చేసిన బోయపాటి, పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్!

మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను - ఉస్తాద్ రామ్ కలయికలో రూపొందిన 'స్కంద'(Skanda) మూవీ గురువారం (సెప్టెంబర్ 28) ప్రపంచవ్యాప్తంగా తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలైన విషయం తెలిసిందే. ఆడియన్స్ నుంచి ఈ సినిమాకి మిశ్రమ స్పందన లభిస్తోంది. ఆ విషయం పక్కన పెడితే, 'స్కంద' కి సీక్వెల్ కూడా రాబోతుందట. ఇదే విషయాన్ని బోయపాటి మూవీ క్లైమాక్స్ లో సీక్వెల్ గురించి హింట్ ఇవ్వడం ఇప్పుడు సర్వత్ర ఆసక్తికరంగా మారింది. ఎవరూ ఊహించని విధంగా 'స్కంద' క్లైమాక్స్ లో సీక్వెల్ పై అదిరిపోయే అప్డేట్ ఇచ్చి ఫ్యాన్స్ ని సర్ప్రైజ్ చేశారు బోయపాటి శ్రీను. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

ఓరి వీరి వేషాలో, చూస్తుంటునే డోకు వస్తోందిగా

బిగ్ బాస్ సీజన్ 7 అప్‌కమింగ్ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలయ్యింది. ఈ ప్రోమోలో చూపించిన విధంగా బిగ్ బాస్ హౌజ్‌లో ఒక గాలా ఈవెంట్ జరగనుంది. గాలా ఈవెంట్ అంటే కంటెస్టెంట్స్ అంతా డిఫరెంట్‌గా గెటప్స్ వేసుకొని ర్యాంప్ వాక్ చేయాలి. ఏ కంటెస్టెంట్ అయితే అందరికంటే ఎక్కువ డిఫరెంట్‌గా గెటప్ వేసుకుంటారో.. వారే నాలుగో పవర్ అస్త్రా కోసం పోటీపడే మూడో కంటెండర్ అవుతారని బిగ్ బాస్ స్పష్టం చేశారు. దీంతో కంటెస్టెంట్స్ అంతా చిత్రవిచిత్రమైన గెటప్స్‌లో ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్ చేయడానికి మాత్రమే కాదు.. భయపెట్టడానికి కూడా రెడీ అయ్యారు. ఈ టాస్క్ కోసం వారిలోనే క్రియేటివిటీని బయటికి తీశారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

చంద్రముఖి 2 రివ్యూ: రజనీ సినిమా సీక్వెల్‌లో రాఘవ లారెన్స్ భయపెట్టాడా? నవ్వించాడా?

రాఘవ లారెన్స్ (Raghava Lawrence), పి.వాసు (P.Vasu) కాంబినేషన్‌లో తెరకెక్కిన హార్రర్ కామెడీ ‘చంద్రముఖి 2’ (Chandramukhi 2). 2004లో విడుదల అయి తమిళనాట ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన ‘చంద్రముఖి (Chandramukhi)’ సినిమాకు ఇది సీక్వెల్. మొదటి భాగంలో రజనీకాంత్ (Rajinikanth) హీరోగా నటించగా, సీక్వెల్‌లో హార్రర్ సినిమాల స్పెషలిస్ట్ రాఘవ లారెన్స్ కనిపించనున్నారు. ‘చంద్రముఖి 2’లో కంగనా రనౌత్ (Kangana Ranaut) టైటిల్ రోల్‌లో నటించారు. ఈ సినిమాపై తెలుగు, తమిళ భాషల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ సినిమా ఎలా ఉంది? (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Published at : 28 Sep 2023 05:35 PM (IST) Tags: Tollywood News Movie News entertainment news TV News CINEMA NEWS

ఇవి కూడా చూడండి

Naga Panchami December 8th Episode విభూది దాటొద్దని మోక్షకు కండీషన్.. వీడ్కోలు చెప్పేసి తన చితి తానే పేర్చుకున్న పంచమి!

Naga Panchami December 8th Episode విభూది దాటొద్దని మోక్షకు కండీషన్.. వీడ్కోలు చెప్పేసి తన చితి తానే పేర్చుకున్న పంచమి!

Yash19 : యశ్ కొత్త సినిమాకు వెరైటీ టైటిల్ - ఆసక్తి పెంచేసిన గ్లిమ్స్ వీడియో!

Yash19 : యశ్ కొత్త సినిమాకు వెరైటీ టైటిల్ - ఆసక్తి పెంచేసిన గ్లిమ్స్ వీడియో!

‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ రివ్యూ, ‘యానిమల్ పార్క్’ అప్‌డేట్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ రివ్యూ, ‘యానిమల్ పార్క్’ అప్‌డేట్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

Allu Arjun: మైండ్ బ్లోయింగ్ - 'యానిమల్'పై అల్లు అర్జున్ డిటేయిల్డ్ రివ్యూ

Allu Arjun: మైండ్ బ్లోయింగ్ - 'యానిమల్'పై అల్లు అర్జున్ డిటేయిల్డ్ రివ్యూ

Devara: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ - సలార్, డంకీ తో పాటూ 'దేవర' కూడా?

Devara: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ - సలార్, డంకీ తో పాటూ 'దేవర' కూడా?

టాప్ స్టోరీస్

Revanth Reddy Resigns: రేవంత్‌ రెడ్డి రాజీనామా- ఢిల్లీకి వెళ్లి రిజైన్‌ లెటర్ అందజేత

Revanth Reddy Resigns: రేవంత్‌ రెడ్డి రాజీనామా- ఢిల్లీకి వెళ్లి రిజైన్‌ లెటర్ అందజేత

Free Bus Journey to Women: మహిళలకు పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం - మార్గదర్శకాలివే

Free Bus Journey to Women: మహిళలకు పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం - మార్గదర్శకాలివే

Extra Ordinary Man Review - ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ రివ్యూ: నితిన్ నవ్వించారా? హిట్ అందుకుంటారా?

Extra Ordinary Man Review - ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ రివ్యూ: నితిన్ నవ్వించారా? హిట్ అందుకుంటారా?

CM Jagan Vs TDP : టీడీపీ, వైసీపీ మధ్య పొటాటో రాజకీయం - అంతా జగనే చేశారా ?

CM Jagan Vs TDP :   టీడీపీ, వైసీపీ మధ్య పొటాటో రాజకీయం -  అంతా జగనే చేశారా ?