అన్వేషించండి

'స్కంద'కి సీక్వెల్ - థియేటర్స్‌లో సర్ప్రైజ్ చేసిన బోయపాటి, పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్!

బోయపాటి - రామ్ కాంబినేషన్లో తెరకెక్కిన 'స్కంద' ప్రస్తుతం థియేటర్స్ లో సందడి చేస్తోంది. అయితే ఈ సినిమాకి సీక్వెల్ కూడా ఉంటుందని మూవీ క్లైమాక్స్ లో బోయపాటి అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చాడు.

మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను - ఉస్తాద్ రామ్ కలయికలో రూపొందిన 'స్కంద'(Skanda) మూవీ గురువారం (సెప్టెంబర్ 28) ప్రపంచవ్యాప్తంగా తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలైన విషయం తెలిసిందే. ఆడియన్స్ నుంచి ఈ సినిమాకి మిశ్రమ స్పందన లభిస్తోంది. ఆ విషయం పక్కన పెడితే, 'స్కంద' కి సీక్వెల్ కూడా రాబోతుందట. ఇదే విషయాన్ని బోయపాటి మూవీ క్లైమాక్స్ లో సీక్వెల్ గురించి హింట్ ఇవ్వడం ఇప్పుడు సర్వత్ర ఆసక్తికరంగా మారింది. ఎవరూ ఊహించని విధంగా 'స్కంద' క్లైమాక్స్ లో సీక్వెల్ పై అదిరిపోయే అప్డేట్ ఇచ్చి ఫ్యాన్స్ ని సర్ప్రైజ్ చేశారు బోయపాటి శ్రీను.

సినిమా చివర్లో 'స్కంద' 2 ఉంటుందని అనౌన్స్ చేశారు. 'స్కంద' సీక్వెల్ అనౌన్స్మెంట్ తో రామ్ పోతినేని ఫాన్స్ అయితే పండగ చేసుకుంటున్నారు. 'స్కంద' తర్వాత బాలయ్యతో 'అఖండ' సీక్వెల్ని తెరకెక్కించబోతున్నారు బోయపాటి. దాని తర్వాతే 'స్కంద 2' సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే 'స్కంద' మూవీకి సీక్వెల్ ఉంటుందని రిలీజ్ కి ముందు మూవీ టీం ఎక్కడా రివీల్ చేయకుండా ఒక్కసారిగా సినిమా క్లైమాక్స్ లో సర్ప్రైజ్ ఇవ్వడంతో ప్రస్తుతం సినీ లవర్స్ 'స్కంద' సీక్వెల్ పై ఆసక్తి కనబరుస్తున్నారు. కాగా కెరీర్లో మొట్టమొదటిసారి రామ్ ఊర మాస్ పాత్రలో నటించిన సినిమా ఇది. ఇందులో బోయపాటి రామ్ ని రెండు డిఫరెంట్ వేరియేషన్స్ తో కూడిన క్యారెక్టర్స్ లో చూపించారు.

ఫ్యాన్స్ తో పాటు మాస్ ఆడియన్స్ కి నచ్చే విధంగా బోయపాటి తరహా హై వోల్టేజ్ యాక్షన్, మాస్ సీన్స్, కమర్షియల్ ఎలిమెంట్స్ తో 'స్కంద' ప్రస్తుతం థియేటర్స్ లో సందడి చేస్తోంది. కథ రొటీన్ గానే ఉన్న సినిమాలో మాస్ సీన్స్, యాక్షన్ ఎపిసోడ్స్, రామ్ ని మాస్ క్యారెక్టర్ లో ప్రజెంట్ చేసిన విధానం మెప్పించేలా ఉంది. అలాగే తమన్ BGMతో పాటు శ్రీ లీల గ్లామర్, డాన్స్ లపై కూడా ఆడియన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. సినిమాలో మెయిన్ హైలెట్ అంటే రామ్ గురించి మాట్లాడుకుంటున్నారు. రెండు డిఫరెంట్ వేరియేషన్స్ తో రామ్ సినిమా మొత్తాన్ని తన భుజాలపై మోసినట్లు తెలుస్తోంది. మాస్ ఆడియన్స్ కి అయితే ఈ సినిమా బాగా నచ్చే అవకాశాలు ఉన్నట్లు సినీ విశ్లేషకులు చెబుతున్నారు.

ఇక ఈ సినిమా కోసం రామ్ పూర్తిగా మేకవర్ అయి బోయపాటి మాస్ హీరోగా మారిపోయాడు. సినిమా కోసం ఏకంగా 12 కేజీల బరువు పెరిగి బీస్ట్ మోడ్ లో ఫ్యాన్స్ ని ఆకట్టుకున్నాడు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి భారీ బడ్జెట్ తో ఫ్యాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మించగా.. శ్రీ లీలతో పాటు సాయి మంజ్రేకర్ మరో హీరోయిన్గా నటించింది. యంగ్ హీరో ప్రిన్స్జ్ సీనియర్ హీరో శ్రీకాంత్, దగ్గుబాటి రాజా, ఇంద్రజ, గౌతమి తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. మరోవైపు 'స్కంద' మూవీకి దాదాపు రూ 50 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. రామ్ కెరియర్ లోనే ఇది హైయెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ కావడం విశేషం. థియేటర్స్ లో ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే కనీసం రూ.55 కోట్లయినా వసూలు చేయాల్సి ఉంటుంది.

Also Read : ‘బిగ్ బాస్’ హౌస్‌లో ఫుడ్ లొల్లి - శివాజీ దుమ్ముదులిపిన శోభా శెట్టి, యావర్ హర్ట్!

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Manchu Manoj: దమ్ముంటే వాళ్ళను అడగండి... మైక్‌తో కాదు, హెల్మెట్‌తో వెళ్ళండి - ఫ్యామిలీ ఇష్యూలపై మంచు మనోజ్
దమ్ముంటే వాళ్ళను అడగండి... మైక్‌తో కాదు, హెల్మెట్‌తో వెళ్ళండి - ఫ్యామిలీ ఇష్యూలపై మంచు మనోజ్
NTR Cars Collection: పోర్షే నుంచి లంబోర్ఘిని వరకు... ఎన్టీఆర్ గ్యారేజీలో కార్ కలెక్షన్, ఆయన టోటల్ నెట్ వర్త్ తెలుసా?
పోర్షే నుంచి లంబోర్ఘిని వరకు... ఎన్టీఆర్ గ్యారేజీలో కార్ కలెక్షన్, ఆయన టోటల్ నెట్ వర్త్ తెలుసా?
Rishab Shetty On Peddi: 'పెద్ది' ట్రైలర్‌కు 'కాంతార' రిషబ్ శెట్టి రివ్యూ... రామ్ చరణ్ గురించి ఏమన్నారంటే?
'పెద్ది' ట్రైలర్‌కు 'కాంతార' రిషబ్ శెట్టి రివ్యూ... రామ్ చరణ్ గురించి ఏమన్నారంటే?
Aarti Ravi: 'జయం' రవిని టార్చర్ పెడుతోందా? ఎవరీ ఆర్తి? విడాకుల కేసుతో పాపులరైన ఆమె బ్యాగ్రౌండ్ తెల్సా?
'జయం' రవిని టార్చర్ పెడుతోందా? ఎవరీ ఆర్తి? విడాకుల కేసుతో పాపులరైన ఆమె బ్యాగ్రౌండ్ తెల్సా?

వీడియోలు

Jaanvi on BucchiBabu: ఈ డైరక్టర్ మామూలోడు కాదు.. పెద్ద రౌడీ.. బుచ్చిబాబుపై జాన్వీ కామెంట్స్
Adilabad Garden Village: ఇంటింటికి పూలవనం... దానితోనే ధనం
RTC Bus Overtake Shock సిరిసిల్ల ప్రమాదంలో ట్విస్ట్.. కొత్త CCTVలో బయటపడిన అసలు కారణం
“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bhuma Mounika Reddy: రాజకీయాల్లోకి మరో భూమా వారసురాలు - మౌనిక పోటీపై మంచు మనోజ్ అధికారిక ప్రకటన - ఏ పార్టీలోకి ?
రాజకీయాల్లోకి మరో భూమా వారసురాలు - మౌనిక పోటీపై మంచు మనోజ్ అధికారిక ప్రకటన - ఏ పార్టీలోకి ?
Telangana Govt Jobs News: తెలంగాణ నిరుద్యోగులకు భారీ ఊరట! ప్రభుత్వ ఉద్యోగాల వయోపరిమితి 44కు పెంపు!
తెలంగాణ నిరుద్యోగులకు భారీ ఊరట! ప్రభుత్వ ఉద్యోగాల వయోపరిమితి 44కు పెంపు!
Matsyakarula Sevalo Scheme: మత్స్యకారుల ఖాతాల్లో రూ.20000 జమ చేసిన సీఎం చంద్రబాబు, జాబితాలో పేరు లేకపోతే ఏం చేయాలంటే!
మత్స్యకారుల ఖాతాల్లో రూ.20000 జమ చేసిన ఏపీ ప్రభుత్వం, జాబితాలో పేరు లేకపోతే ఏం చేయాలంటే!
Woman Harassment: చైన్ స్నాచర్లే కాదు చీరలెత్తి చూసే దరిద్రులూ ఉన్నారు - హైదరాబాద్‌లో జరిగిన ఈ సీసీటీవీ దృశ్యాలు చూస్తే అసహ్యం వేస్తుంది!
చైన్ స్నాచర్లే కాదు చీరలెత్తి చూసే దరిద్రులూ ఉన్నారు - హైదరాబాద్‌లో జరిగిన ఈ సీసీటీవీ దృశ్యాలు చూస్తే అసహ్యం వేస్తుంది!
Global Economy: పెట్రోల్, బంగారం, స్టాక్ మార్కెట్ , ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారీ మార్పులు! జూన్ 10లోపు ఏం జరగబోతోంది?
పెట్రోల్, బంగారం, స్టాక్ మార్కెట్ , ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారీ మార్పులు! జూన్ 10లోపు ఏం జరగబోతోంది?
New FASTag Category Planned: టోల్ మిన‌హాయించిన‌ వాహనాల కోసం కొత్త ఫాస్ట్‌ట్యాగ్ కేటగిరీ - కేంద్ర ప్రభుత్వం సరికొత్త ప్లాన్
టోల్ మిన‌హాయించిన‌ వాహనాల కోసం కొత్త ఫాస్ట్‌ట్యాగ్ కేటగిరీ - కేంద్ర ప్రభుత్వం సరికొత్త ప్లాన్
Ram Pothineni: అరుదైన వ్యాధితో బాధ పడుతున్న అభిమాని... ఇంటికి వెళ్లిన రామ్ పోతినేని - రియల్ లైఫ్‌లోనూ హీరోయే
అరుదైన వ్యాధితో బాధ పడుతున్న అభిమాని... ఇంటికి వెళ్లిన రామ్ పోతినేని - రియల్ లైఫ్‌లోనూ హీరోయే
పెరిగిన CNG ధరలు.. Tata Punch, Maruti Swift కార్లలో ఫుల్ ట్యాంక్‌కు ఎంత ఖర్చవుతుంది?
పెరిగిన CNG ధరలు.. Tata Punch, Maruti Swift కార్లలో ఫుల్ ట్యాంక్‌కు ఎంత ఖర్చవుతుంది?
Embed widget