అన్వేషించండి

Tollywood Updates : అనసూయ ఊహించని నిర్ణయం, షూటింగ్‌లో సూర్యాకు గాయాలు - ఇవీ నేటి టాప్ 5 మూవీ విశేషాలు

ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యంగా ఈ టాప్-5 విశేషాలు చూసేయండి.

అనసూయ షాకింగ్ డెసిషన్ - ఎడబాటే అగౌరవానికి సమాధానమంటూ!

యాంకర్ గా బుల్లితెరపై ఓ రేంజిలో సందడి చేసిన అనసూయ భరద్వాజ్ ప్రస్తుతం బుల్లితెరకు గుడ్ బై చెప్పేసింది. ప్రస్తుతం సినిమా రంగంలోకి అడుగు పెట్టింది. వరుస సినిమాలు చేస్తూ దూసుకెళ్తోంది. తాజాగా ఆమె నటించిన సినిమాలన్నీ మంచి విజయాన్ని అందుకున్నాయి. అన్ని సినిమాలోనూ మాంచి డెప్త్ ఉన్న క్యారెక్టర్లు చేస్తూ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంటోంది. ‘రంగస్థలం’లో రంగమ్మత్తగా, ‘పుష్ప’ సినిమాలో కాత్యాయనిగా నటించి ఓ రేంజిలో గుర్తింపు తెచ్చుకుంది. చక్కటి పాత్ర లభిస్తే నటించేందుకు ఎప్పుడూ రెడీగా ఉంటుంది. ఓవైపు గ్లామర్ షో చేస్తూనే, మరోవైపు నటనలో నవరసాలను ఒలికిస్తోంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ‘పుష్ప 2‘ సినిమాలో నటిస్తోంది. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా, సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పడు తన అందాల కనువిందుతో నెటిజన్లను ఆకట్టుకుంటుంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

అంగరంగ వైభవంగా ‘బిగ్‌బాస్‌ మానస్ వెడ్డింగ్ - ఫోటోలు, వీడియోలు వైరల్

బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌, నటుడు మానస్‌ ఓ ఇంటివాడు అయ్యాడు. బ్యాచిలర్‌ జీవితానికి ఫుల్ స్టాఫ్ పెట్టి వివాహ బంధంలోకి అడుగు పెట్టాడు. పెద్దలు చూసిన అమ్మాయితో కొత్త జీవితంలోకి అడుగు పెట్టాడు.  ఇటీవలే ఎంగేజ్ మెంట్ జరుపుకున్న ఆయన, బుధవారం(నవంబర్‌ 22) రాత్రి 8.55 గంటలకు వధువు శ్రీజ మెడలో మూడు ముళ్లు వేశాడు. విజయవాడలోని మురళీ రిసార్ట్స్‌ వేదికగా ఈ పెళ్లి వేడుక జరిగింది. వధూవరుల కుటుంబ సభ్యులతో పాటు, బుల్లితెర, వెండితెరకు చెందిన పలువురు నటీనటులు ఈ పెళ్లికి హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు. మానస్ పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. పలువురు టీవీ, సినీ ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు చెప్తున్నారు. నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో జీవించాలని ఆశీర్వదిస్తున్నారు. అటు మానస్, శ్రీజ జంట చూడ చక్కగా ఉందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

‘కంగువ‘ షూటింగ్ లో ప్రమాదం, హీరో సూర్యకు గాయాలు, డాక్టర్లు ఏమన్నారంటే?

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య షూటింగ్ లో గాయపడ్డారు. ‘కంగువ’ షూటింగ్ లో జరిగిన ప్రమాదంలో ఆయన తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నట్లు తెలుస్తోంది. శివ దర్శకత్వంలో ‘కంగువ’ మూవీ షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఈ షూటింగ్ లో కెమెరా సూర్య భుజం మీద పడినట్టు తెలుస్తోంది. భుజంతో పాటు చేతికి గాయాలు అయినట్లు సమాచారం. వెంటనే ఆయనను చిత్రబృందం సమీప ఆస్పత్రికి తరలించింది. మరీ ప్రమాదకర స్థాయిలో గాయాలేమీ కాలేదని డాక్టర్లు చెప్పినట్లు తెలుస్తోంది. ఒకటి రెండు రోజులు రెస్టు తీసుకుంటే సరిపోతుందని వెల్లడించారట. ఈ ప్రమాదంతో మేకర్స్ సినిమా షూటింగ్ నిలిపివేశారట. మళ్లీ ఎప్పుడు షూటింగ్ మొదలు అవుతుందనే విషయాన్ని ఇంకా వెల్లడించలేదు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

‘యానిమల్’ ట్రైలర్ : వెయ్యి తప్పులు చేస్తా, ఢిల్లీని తగలెట్టేస్తా - తండ్రిపై అంత ప్రేమా?

బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ తో తెరకెక్కిన తాజా చిత్రం ‘యానిమల్. నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఈ మూవీలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన టీజ‌ర్‌, మ్యూజికల్ అప్ డేట్స్ సినీ ప్రియులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

ప్రియమణి 'భామాకలాపం’ సీక్వెల్ వచ్చేస్తోంది - ఓటీటీలో కాదట!

సీనియర్ నటి ప్రియమణి తన సెకండ్ ఇన్నింగ్స్ లో వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. ఓవైపు సినిమాలు మరోవైపు వెబ్ సిరీస్‌లు అంటూ క్షణం తీరిక లేకుండా గడుపుతోంది. ఓవైపు అగ్ర హీరోల సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తున్న ఈమె మరోవైపు లీడ్ రోల్స్‌లో వెబ్ సిరీస్‌లు కూడా చేస్తోంది. ప్రియమణి ప్రధాన పాత్రలో నటించిన 'భామాకలాపం' మూవీకి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. తెలుగు ఓటీటీ 'ఆహా'లో రిలీజైన ఈ సిరీస్ కి ఇప్పుడు సీక్వెల్ కూడా రాబోతోంది. అయితే ఈసారి 'భామాకలాపం' సీక్వెల్ ఓటీటీలో కాకుండా థియేటర్స్ లో సందడి చేయబోతోంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Congress: అమరావతి, ఎన్టీఆర్ ఘాట్‌లపై కాంగ్రెస్ నేతల వివాదాస్పద వ్యాఖ్యలు - పొంగులేటి, కోమటిరెడ్డిలకు సీక్రెట్ ఎజెండా ఉందా?
అమరావతి, ఎన్టీఆర్ ఘాట్‌లపై కాంగ్రెస్ నేతల వివాదాస్పద వ్యాఖ్యలు - పొంగులేటి, కోమటిరెడ్డిలకు సీక్రెట్ ఎజెండా ఉందా?
KTR Enquiry: ఏసీబీ చేతికి అస్త్రం- ఏ క్షణంలోనైనా కేటీఆర్ మీద విచారణ, అరెస్టుకు ఛాన్స్!
ఏసీబీ చేతికి అస్త్రం- ఏ క్షణంలోనైనా కేటీఆర్ మీద విచారణ, అరెస్టుకు ఛాన్స్!
Russia cancer Vaccine: ప్రపంచానికి గుడ్ న్యూస్ చెప్పిన రష్య- క్యాన్సర్ వ్యాక్సిన్‌ తయారు చేసినట్టు వెల్లడి
ప్రపంచానికి గుడ్ న్యూస్ చెప్పిన రష్య- క్యాన్సర్ వ్యాక్సిన్‌ తయారు చేసినట్టు వెల్లడి
RRR Documentary On Netflix: సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Allu Arjun Case Sritej Health Update | 13 రోజుల తర్వాత శ్రీతేజ్ హెల్త్ పై పోలీసుల అప్డేట్ | ABP Desamటీమిండియా పరువు కాపాడిన బౌలర్లుత్వరలోనే టెస్ట్‌ మ్యాచ్‌లకి రోహిత్ శర్మ గుడ్‌బై!జమిలి ఎన్నికలపై జేపీసీ, ప్రతిపక్షాల డిమాండ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Congress: అమరావతి, ఎన్టీఆర్ ఘాట్‌లపై కాంగ్రెస్ నేతల వివాదాస్పద వ్యాఖ్యలు - పొంగులేటి, కోమటిరెడ్డిలకు సీక్రెట్ ఎజెండా ఉందా?
అమరావతి, ఎన్టీఆర్ ఘాట్‌లపై కాంగ్రెస్ నేతల వివాదాస్పద వ్యాఖ్యలు - పొంగులేటి, కోమటిరెడ్డిలకు సీక్రెట్ ఎజెండా ఉందా?
KTR Enquiry: ఏసీబీ చేతికి అస్త్రం- ఏ క్షణంలోనైనా కేటీఆర్ మీద విచారణ, అరెస్టుకు ఛాన్స్!
ఏసీబీ చేతికి అస్త్రం- ఏ క్షణంలోనైనా కేటీఆర్ మీద విచారణ, అరెస్టుకు ఛాన్స్!
Russia cancer Vaccine: ప్రపంచానికి గుడ్ న్యూస్ చెప్పిన రష్య- క్యాన్సర్ వ్యాక్సిన్‌ తయారు చేసినట్టు వెల్లడి
ప్రపంచానికి గుడ్ న్యూస్ చెప్పిన రష్య- క్యాన్సర్ వ్యాక్సిన్‌ తయారు చేసినట్టు వెల్లడి
RRR Documentary On Netflix: సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
One Nation One Election: రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎలా పని చేస్తుందో తెలుసా?
రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎలా పని చేస్తుందో తెలుసా?
Look Back 2024: 151 నుంచి 11కు- జగన్ కు చేదు జ్ఞాపకంలా 2024
151 నుంచి 11కు- జగన్ కు చేదు జ్ఞాపకంలా 2024
Weather Today : తెలంగాణపై చలి పిడుగు- వణికిపోతున్న జనం- ఏపీని వెంటాడుతున్న వర్షాల భయం
తెలంగాణపై చలి పిడుగు- వణికిపోతున్న జనం- ఏపీని వెంటాడుతున్న వర్షాల భయం
Keerthy Suresh: సౌత్ కంటే డబుల్... బాలీవుడ్‌లో రెమ్యూనరేషన్ పెంచేసిన కీర్తి సురేష్
సౌత్ కంటే డబుల్... బాలీవుడ్‌లో రెమ్యూనరేషన్ పెంచేసిన కీర్తి సురేష్
Embed widget