Bigg Boss Maanas Wedding: అంగరంగ వైభవంగా ‘బిగ్‌బాస్ మానస్ వెడ్డింగ్ - ఫోటోలు, వీడియోలు వైరల్
Maanas Wedding: బిగ్‌బాస్ కంటెస్టెంట్, నటుడు మానస్ వివాహ వేడుకగా అట్టహాసంగా జరిగింది. చెన్నైకి చెందిన శ్రీజ మెడలో ఆయన మూడు ముళ్లు వేసి, ఏడడుగులు నడిచాడు.
Bigg Boss Maanas Wedding: బిగ్‌బాస్ కంటెస్టెంట్, నటుడు మానస్ ఓ ఇంటివాడు అయ్యాడు. బ్యాచిలర్ జీవితానికి ఫుల్ స్టాఫ్ పెట్టి వివాహ బంధంలోకి అడుగు పెట్టాడు. పెద్దలు చూసిన అమ్మాయితో కొత్త జీవితంలోకి అడుగు పెట్టాడు. ఇటీవలే ఎంగేజ్ మెంట్ జరుపుకున్న ఆయన, బుధవారం(నవంబర్ 22) రాత్రి 8.55 గంటలకు వధువు శ్రీజ మెడలో మూడు ముళ్లు వేశాడు. విజయవాడలోని మురళీ రిసార్ట్స్ వేదికగా ఈ పెళ్లి వేడుక జరిగింది. వధూవరుల కుటుంబ సభ్యులతో పాటు, బుల్లితెర, వెండితెరకు చెందిన పలువురు నటీనటులు ఈ పెళ్లికి హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు. మానస్ పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. పలువురు టీవీ, సినీ ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు చెప్తున్నారు. నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో జీవించాలని ఆశీర్వదిస్తున్నారు. అటు మానస్, శ్రీజ జంట చూడ చక్కగా ఉందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
జోష్ ఫుల్ గా మానస్ హల్దీ ఫంక్షన్
పెళ్లికి ముందు మానస్ హల్దీ ఫంక్షన్ గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకకు సంబంధించిన వీడియోలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. వధూవరులిద్దరూ హల్దీ వేడుకలో మిత్రులతో కలిసి ఫుల్ ఎంజాయ్ చేశారు. ముఖాలకు పసుపు పూసుకోవడంతో పాటు ఒకరిపై మరొకరు రంగులు చల్లుకుంటూ సరదాగా గడిపారు. వధూవరులు మానస్, శ్రీజ హల్దీ వేడుకల అనంతరం కలిసి సంతోషంగా స్టెప్పులేశారు.ఈ వేడుకలో బిగ్‌బాస్ కంటెస్టెంట్లు హమీదా, శుభశ్రీ, తేజ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. పలువురు టీవీ స్టార్స్ కూడా పాల్గొన్నారు.
View this post on Instagram
‘బిగ్‌బాస్’ షోతో మరింత పాపులారిటీ
మానస్ అసలు పేరు సాయి రోహిత్. పద్మిని, వెంకటరావు నాగులపల్లి దంపతుల ఏకైక సంతానం. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించాడు మానస్. బుల్లితెర వేదికగా ప్రసారమైన పలు సీరియల్స్ లో మానస్ నటించారు. ‘కోయిలమ్మ’ సీరియల్‌లో మంచి క్రేజ్ దక్కించుకున్న మానస్, వరుస సీరియల్స్ తో బుల్లితెర స్టార్‌గా మారారు. 2021లో ప్రసారమైన ‘బిగ్‌బాస్ సీజన్ 5’లో కంటిస్టెంట్‌గా ఆయన హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. అతడి ఆటతీరుకు బుల్లి తెర ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఒత్తిడిలోనూ ఏమాత్రం కంట్రోల్ తప్పకుండా చక్కగా గేమ్ ఆడి అలరించాడు. ఆ తర్వాత ‘బ్రహ్మముడి’ సీరియల్ తో ఫుల్ పాపులారిటీ సంపాదించాడు. ఇందులో రాజు క్యారెక్టర్ లో అద్భుత నటనతో ఆకట్టుకుంటున్నాడు. ప్రస్తుతం వరుస సీరియల్స్ తో మానస్ ఫుల్ బిజీగా ఉన్నాడు. ఓవైపు సీరియల్స్ చేస్తూనే, మరోవైపు కొన్ని ప్రైవేట్ ఆల్బమ్స్ లోనూ నటిస్తున్నాడు. టీవీ షోలు కూడా చేస్తున్నాడు. ఓంకార్ తెరకెక్కించిన ‘మ్యాన్షన్ 24’తో ఇటీవల మానస్ అలరించారు.
Read Also: ప్రేమలో మునిగి తేలుతున్న విమలా రామన్, ఈ ఏడాదిలోనే పెళ్లి!