అన్వేషించండి

Suriya injured: ‘కంగువ‘ షూటింగ్ లో ప్రమాదం, హీరో సూర్యకు గాయాలు, డాక్టర్లు ఏమన్నారంటే?

Suriya injured: ‘కంగువ‘ సినిమా షూటింగ్ లో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో హీరో సూర్య గాయపడ్డారు.

Suriya Gets Injured On The Sets Of Kanguva: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య షూటింగ్ లో గాయపడ్డారు. ‘కంగువ’ షూటింగ్ లో జరిగిన ప్రమాదంలో ఆయన తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నట్లు తెలుస్తోంది. శివ దర్శకత్వంలో ‘కంగువ’ మూవీ షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఈ షూటింగ్ లో కెమెరా సూర్య భుజం మీద పడినట్టు తెలుస్తోంది. భుజంతో పాటు చేతికి గాయాలు అయినట్లు సమాచారం. వెంటనే ఆయనను చిత్రబృందం సమీప ఆస్పత్రికి తరలించింది. మరీ ప్రమాదకర స్థాయిలో గాయాలేమీ కాలేదని డాక్టర్లు చెప్పినట్లు తెలుస్తోంది. ఒకటి రెండు రోజులు రెస్టు తీసుకుంటే సరిపోతుందని వెల్లడించారట. ఈ ప్రమాదంతో మేకర్స్ సినిమా షూటింగ్ నిలిపివేశారట. మళ్లీ ఎప్పుడు షూటింగ్ మొదలు అవుతుందనే విషయాన్ని ఇంకా వెల్లడించలేదు.  

యాక్షన్ సీన్ షూట్ చేస్తుండగా ప్రమాదం

అటు ‘కంగువ’ మూవీ పీరియాడికల్ మూవీగా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో సూర్య గతంలో ఎప్పుడూ లేని విధంగా కనిపించబోతున్నారు. డిఫరెంట్ లుక్ తో ఆడియెన్స్ కు డిఫరెంట్ ఎక్స్ పీరియన్స్ అందించాలని భావిస్తున్నారట. ఈ సినిమా కోసం చాలా కష్టపడుతున్నారట. ఈ నేపథ్యంలో ఆయన రిస్కీ సన్నివేశాల్లోనూ డూప్ లేకుండా నటిస్తున్నారట. ఓ కీలక యాక్షన్ సన్నివేశం షూట్ చేస్తుండగా ఈ తాజా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. సూర్య మీద కెమెరా నేరుగా పడిపోయినట్లు సమాచారం. సూర్య భుజంతో పాటు చేతికి గాయం అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సూర్య బాగానే ఉన్నారు అని తెలుస్తున్నా, ఈ ప్రమాదానికి సంబంధించి ఎలాంటి  అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. సూర్యకు చిన్న గాయాలే అయ్యాయా? లేదంటే ఆందోళనకర పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? అని ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు.   

షూటింగ్స్ లో గాయపడుతున్న తమిళ హీరోలు

రీసెంట్ గా తమిళ హీరోలు సినిమా షూటింగ్స్ లో గాయపడం కామన్ అయ్యింది. ప్రేక్షకులను అలరించాలనే ఉద్దేశంతో రిస్కీ సీన్లలో నటిస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. విశాల్ తాజాగా ‘మార్క్ ఆంటోని’ సినిమా షూటింగ్ లో గాయపడ్డారు. ఇంకా చెప్పాలంటే ఆయన చేసే ప్రతి సినిమాలోనూ ఏదో ఒక గాయం అవుతూనే ఉంటుంది. ఇక విజయ్ ఆంటోనీ కూడా ‘బిచ్చగాడు 2’ సినిమా షూటింగ్ సమయంలో గాయపడ్డారు. కొద్ది రోజుల పాటు హాస్పిటల్ బెడ్ కు పరిమితం అయ్యారు. తాజాగా ఈ లిస్టులో సూర్య కూడా చేరిపోయారు.  

తెలుగులో స్ట్రెయిట్ సినిమా చేయబోతున్న సూర్య

సూర్యకు తమిళంలోనే కాదు, తెలుగులోనూ మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ఆయన నటించిన తమిళ సినిమాలు అన్నీ తెలుగులో డబ్బై విడుదల అవుతున్నాయి. ఇక్కడ కూడా మంచి విజయాన్ని అందుకుంటున్నాయి. తెలుగులో ఇప్పటి వరకు స్ట్రెయిట్ మూవీ చేయలేదు సూర్య. ప్రస్తుతం అదే ప్రయత్నంలో ఉన్నారు. దర్శకుడు చందు మొండేటితో ఓ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సూర్య చేస్తున్న సినిమాలు కంప్లీట్ అయ్యాక ఈ సినిమా పట్టాలెక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం సూర్య నటిస్తున్న ‘కంగువ’ సినిమాను యువి క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ కలిసి నిర్మిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. సినిమాను పాన్ ఇండియా మూవీగా విడుదల చేస్తున్నారు.

Read Also: అనసూయ షాకింగ్ డెసిషన్ - ఎడబాటే అగౌరవానికి సమాధానమంటూ!

టాప్ హెడ్ లైన్స్

Irumudi Twitter Review - 'ఇరుముడి' ట్విట్టర్ రివ్యూ: రవితేజపై రెస్పెక్ట్ పెరుగుతుందా? అమెరికా ప్రీమియర్స్ రిపోర్ట్, సోషల్ మీడియా టాకేంటి?
'ఇరుముడి' ట్విట్టర్ రివ్యూ: రవితేజపై రెస్పెక్ట్ పెరుగుతుందా? అమెరికా ప్రీమియర్స్ రిపోర్ట్, సోషల్ మీడియా టాకేంటి?
శుక్రాచార్యుడిగా మారిన 'ధురంధర్' రెహమాన్ డకాయిట్! ఈ రాక్షస గురువు కథ తెలుసా మీకు?
శుక్రాచార్యుడిగా మారిన 'ధురంధర్' రెహమాన్ డకాయిట్! ఈ రాక్షస గురువు కథ తెలుసా మీకు?
Ameer Log Twitter Review - 'అమీర్ లోగ్' ట్విట్టర్ రివ్యూ: కుర్రాళ్ళ జీవితాన్ని మార్చిన హైదరాబాద్ బిర్యానీ... మూవీపై ట్విట్టర్ టాకేంటి?
'అమీర్ లోగ్' ట్విట్టర్ రివ్యూ: కుర్రాళ్ళ జీవితాన్ని మార్చిన హైదరాబాద్ బిర్యానీ... మూవీపై ట్విట్టర్ టాకేంటి?
Uppal Balu Request : 'ప్లీజ్... నన్ను బిగ్ బాస్‌కు తీసుకోండి' - ఉప్పల్ బాలు రిక్వెస్ట్... లాస్ట్ వీడియో అంటూ...
'ప్లీజ్... నన్ను బిగ్ బాస్‌కు తీసుకోండి' - ఉప్పల్ బాలు రిక్వెస్ట్... లాస్ట్ వీడియో అంటూ...

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
PV Sindhu Says World Badminton Drama.!: సింధు నిష్క్రమణ.. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! 
పోరాడి ఓడిన సింధు .. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! వరల్డ్ చాంపియన్షిప్ టోర్నీ
Vizag Crime News: విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
Nara Lokesh vs YS Jagan: వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
బైక్ కాదు, కారు కాదు.. హైడ్రోజన్‌తో నడిచే రోబోటిక్ గుర్రం - కవాసకి ప్రయోగం
హైడ్రోజన్‌తో పరుగులు తీసే కీలుగుర్రం.. తయారు చేస్తున్న కవాసకి
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
Embed widget