News
News
X

టాలీవుడ్‌లో మరో విషాదం, గుండెపోటుతో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ మృతి

టాలీవుడ్ ను వరుస మరణాలు కుదిపేస్తున్నాయి. గుండె పోటుతో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ప్రవీణ్ అనుమోలు మరణించారు. ప్రవీణ్ మృతి పట్ల టాలీవుడ్ దిగ్బ్రాంతి వ్యక్తం చేసింది.

FOLLOW US: 
Share:

టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ప్రవీణ్ అనుమోలు ఆదివారం గుండెపోటుతో మరణించారు. ఆయన మృతి పట్ల సినీ ఇండస్ట్రీ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేసింది. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ప్రవీణ్ 2017లో వచ్చిన ‘దర్శకుడు’ సినిమాకి సినిమాటోగ్రాఫర్‌ గా పనిచేశారు. జక్కా హరి ప్రసాద్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో అశోక్‌ బండ్రెడ్డి హీరోగా నటించగా, ఈషా రెబ్బా, పూజిత పొన్నాడ హీరోయిన్లుగా నటించారు. ఆ సినిమా తర్వాత ‘బాజీరావు మస్తానీ’, ‘ధూమ్ 3’, ‘బేబీ’, ‘పంజా’, ‘యమదొంగ’ వంటి సినిమాలకు అసిస్టెంట్ కెమెరామెన్‌ గా కూడా పనిచేశారు ప్రవీణ్. కెమెరామెన్ గా రానిస్తున్న సమయంలోనే ఆయన ఇలా హఠాత్తుగా మృతి చెందడంతో కుటుంబ సభ్యుల శోక సంద్రంలో మునిగిపోయారు. 

టాలీవుడ్ ను కుదిపేస్తున్న వరుస మరణాలు..

టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస మరణాలు ఇండస్ట్రీను కుదిపేస్తున్నాయి. గతేడాది లో కూడా తెలుగు సినీ పరిశ్రమకు చెంది. ఆ ఏడాది ప్రముఖ నటులు, సూపర్ స్టార్ కృష్ణ, కృష్ణంరాజు, కైకాల సత్యనారాయణ, ఘట్టమనేని రమేష్ బాబు, ఘట్టమనేని ఇందిరా, మన్నవ బాలయ్య, నందమూరి ఉమామహేశ్వరి లాంటి ప్రముఖులు మరణించారు. ఇక ఈ ఏడాది కూడా ఇండస్ట్రీలో పలువురు ప్రముఖులు కన్నుమూశారు. కొద్ది రోజుల క్రితం ప్రముఖ దర్శకులు కె.విశ్వనాథ్ కన్నుమూశారు. ఆయన మరణించిన కొన్ని రోజులకే ఆయన సతీమణి జయలక్ష్మీ కన్నుమూశారు. తర్వాత సీనియర్ నటి జమున ఇలా పలువురు సినీ తారలు మృతి చెందారు. తాజాగా ప్రవీణ్ గుండెపోటుతో మరణించడంతో తెలుగు సినీ పరిశ్రమలో విషాదచాయలు అలముకున్నాయి.  

గుండెపోటుతోనే అత్యధిక మరణాలు...

ఇటీవల కాలంలో గుండెపోటుతో అనేక మంది ప్రాణాలు విడుస్తున్నారు. కరోనా తర్వాత ఈ మరణాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఒకప్పుడు 40, 50 ఏళ్లు దాటిన వారికి ఈ సమస్య అరుదుగా కనిపించేది. కానీ ప్రస్తుత కాలంలో ఇది విపరీతంగా కనిపిస్తోంది. వయసుతో సంబంధం లేకుండా ఈ గుండెపోటు అందర్నీ వేధిస్తోంది. రోజురోజుకూ ఈ హార్ట్ ఎటాక్ మరణాలు పెరిగిపోతున్నాయి. ఇటీవలే నందమూరి తారకరత్న గుండెపోటుతో మరణించారు. టీడీపీ పార్టీ నాయకుడు నారా లోకేష్ పాదయాత్రలో పాల్గొన్న ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. అక్కడ నుంచి ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. తర్వత మెరుగైన వైద్యం కోసం బెంగుళూరు తరలించారు. 23 రోజుల పాటు చికిత్స అందించినప్పటికీ ఆయన కోలుకోలేదు. ఫిబ్రవరి 18 న ఆయన ఆసుపత్రిలోనే తుదిశ్వాస విడిచారు. గతంలోనూ పలువురు సినీ ప్రముఖులు హార్ట్ ఎటాక్ తో మరణించారు. టాలీవుడ్ లో వరుస గుండెపోటు మరణాలు అందర్నీ కలచి వేస్తున్నాయి. ఇది ఒక్క సినిమా రంగంలోనే కాదు. దేశ వ్యాప్తంగా ఈ సమస్య రోజురోజుకూ ఎక్కువైపోతుంది. కారణాలు ఏమైనప్పటికీ అతి చిన్న వయసు యువకులు కూడా గుండెపోటు మరణాలకు బలైపోవడం ఆందోళన కలిగించే అంశమనే చెప్పాలి.

Read Also: చావు అంచుల్లోకి వెళ్లి వచ్చా, గుండె పోటుపై సుస్మితా సేన్ ఎమోషనల్!

Published at : 06 Mar 2023 09:34 AM (IST) Tags: Tollywood Cinematographer Praveen Anumolu Praveen Anumolu Death Praveen Anumolu

సంబంధిత కథనాలు

Ajith Kumar: అజిత్ ఇంటికి నేరుగా వెళ్లి పరామర్శించిన విజయ్ - పోటీ బాక్సాఫీస్ దగ్గరే, పర్సనల్ లైఫ్‌లో కాదు!

Ajith Kumar: అజిత్ ఇంటికి నేరుగా వెళ్లి పరామర్శించిన విజయ్ - పోటీ బాక్సాఫీస్ దగ్గరే, పర్సనల్ లైఫ్‌లో కాదు!

Akshay Kumar: మూవీ షూటింగ్‌లో గాయపడ్డ బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్

Akshay Kumar: మూవీ షూటింగ్‌లో గాయపడ్డ బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్

New Music Directors in Tollywood: సరికొత్త ట్యూన్స్‌తో అదరగొడుతున్న చిన్న సంగీత దర్శకులు - ఒక్క ఛాన్స్ ఇవ్వండి గురూ!

New Music Directors in Tollywood: సరికొత్త ట్యూన్స్‌తో అదరగొడుతున్న చిన్న సంగీత దర్శకులు - ఒక్క ఛాన్స్ ఇవ్వండి గురూ!

Nikhil Wife Pallavi Varma: సాడ్ స్టోరీలు చెప్పి నన్ను పడేశాడు: నిఖిల్ భార్య పల్లవి

Nikhil Wife Pallavi Varma: సాడ్ స్టోరీలు చెప్పి నన్ను పడేశాడు: నిఖిల్ భార్య పల్లవి

Jabardasth: పానకం కోసం గొడవపడ్డ ‘జబర్దస్త్’ టీమ్, యాంకర్ సౌమ్యపై ఇంద్రజ ఆగ్రహం

Jabardasth: పానకం కోసం గొడవపడ్డ ‘జబర్దస్త్’ టీమ్, యాంకర్ సౌమ్యపై ఇంద్రజ ఆగ్రహం

టాప్ స్టోరీస్

YSRCP Reverse : దెబ్బ మీద దెబ్బ - వ్యూహాత్మక తప్పిదాలే వైఎస్ఆర్‌సీపీకి నష్టం చేస్తున్నాయా ?

YSRCP Reverse :   దెబ్బ మీద దెబ్బ  - వ్యూహాత్మక తప్పిదాలే వైఎస్ఆర్‌సీపీకి నష్టం చేస్తున్నాయా ?

MIW Vs UPW Highlights: యూపీని ఎలిమినేటర్‌లోనే ఆపేసిన ముంబై - 72 పరుగుల విజయంతో ఫైనల్లోకి ఎంట్రీ!

MIW Vs UPW Highlights: యూపీని ఎలిమినేటర్‌లోనే ఆపేసిన ముంబై - 72 పరుగుల విజయంతో ఫైనల్లోకి ఎంట్రీ!

AP Cag Report : 13.99 శాతం వడ్డీకి అప్పులు తెస్తున్న ఏపీ సర్కార్ - కాగ్ రిపోర్టులో సంచలన విషయాలు

AP Cag Report :  13.99 శాతం వడ్డీకి అప్పులు తెస్తున్న ఏపీ సర్కార్ - కాగ్ రిపోర్టులో సంచలన విషయాలు

రైతులపై కేసీఆర్ ది ఎన్నికల ప్రేమ, మీరిచ్చే రూ.10 వేలు ఏ మూలకు సరిపోతాయి - వైఎస్ షర్మిల

రైతులపై కేసీఆర్ ది ఎన్నికల ప్రేమ,  మీరిచ్చే రూ.10 వేలు ఏ మూలకు సరిపోతాయి - వైఎస్ షర్మిల