By: ABP Desam | Updated at : 16 Jan 2023 01:07 PM (IST)
Edited By: anjibabuchittimalla
Photo@eyrahul/twitter
టాలీవుడ్ కమెడియన్ రాహుల్ రామకృష్ణ సంక్రాంతి రోజు గుడ్ న్యూస్ చెప్పాడు. తాను తండ్రిని అయ్యానంటూ ఆయన సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. పొంగల్ నాడే తనకు పండంటి కొడుకు పుట్టాడని తెలిపాడు. అబ్బాయి ఫోటో షూర్ చేస్తూ ‘అబ్బాయి, సంక్రాంతి రిలీజ్’ అంటూ ఫన్నీగా ట్వీట్ చేశాడు. ఈ ఫోటోలో బాబు హాయిగా నిద్రపోతూ కనిపిస్తున్నాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాహుల్ రామకృష్ణ- హరిత దంపతులకు నెటిజన్లు శుభాకాంక్షలు చెప్తున్నారు.
Boy.
— Rahul Ramakrishna (@eyrahul) January 16, 2023
Sankranthi release. pic.twitter.com/SeU0Vo6BB1
కొంత కాలం క్రితం రాహుల్ రామకృష్ణ తన గర్ల్ ఫ్రెండ్ కు లిప్ కిస్ ఇస్తున్న ఓ ఫోటోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశాడు. అదే సమయంలో ఆమెను పెళ్లి చేసుకోబోతున్నట్లు వెల్లడించాడు. ఆ తర్వాత తన పెళ్లి గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు. గత నవంబర్ లో మాత్రం తన భార్య ప్రెగ్నెంట్ అంటూ అందరినీ ఆశ్చర్యపరిచాడు. తాజాగా తనకు పండంటి కొడుకు పుట్టాడంటూ వెల్లడించాడు.
Getting married, finally, soonly! pic.twitter.com/o4Fg5XlsT6
— Rahul Ramakrishna (@eyrahul) May 7, 2022
Just. Hamara bajaj feels. pic.twitter.com/HqScLawRLK
— Rahul Ramakrishna (@eyrahul) November 28, 2022
Say hello to our little friend pic.twitter.com/q7t5htIZEO
— Rahul Ramakrishna (@eyrahul) November 7, 2022
తెలుగు సినిమా పరిశ్రమలో రాహుల్ రామకృష్ణ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. షార్ట్ ఫిలిమ్స్ ద్వారా కెరీర్ మొదలు పెట్టిన ఆయన, చక్కటి నటన, డైలాగ్ డెలివరీతో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత సినిమాల్లో అవకాశాలు పొందాడు. ఎక్కువగా హీరో ఫ్రెండ్ క్యారెక్టర్స్ చేస్తూ ఆకట్టుకున్నాడు. ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో ఆయనకు మంచి ఫాలోయింగ్ వచ్చింది. ఈ సినిమాలో హీరో విజయ్ దేవరకొండకు స్నేహితుడిగా చక్కటి నటన కనబర్చాడు. అటు ‘గీతా గోవిందం’ సినిమాలోనూ విజయ్ ఫ్రెండ్ గా లేనిపోని సలహాలిస్తూ నవ్వించాడు. ప్రస్తుతం కమెడియన్‌గానే కాకుండా నటనకు ఆస్కారమున్న మంచి పాత్రలతో కూడా గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. తెలుగులో వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు.
Sankranthi shubhakankshalatho💐❤️ iga anni dawath lalo lolli pettaboye "Dawath" pata
— Rahul Ramakrishna (@eyrahul) January 14, 2023
Out now😍
►https://t.co/b0O1L7P60j
#intintiramayanam in theatres near you soon!🤗@DirectorMaruthi @vamsi84 @SitharaEnts @IVYProductions9 @ItsActorNaresh @eyrahul #NavyaSwamy @Sureshflms pic.twitter.com/S6U4nuqxGf
Read Also: RRRను రెండుసార్లు చూసిన కామెరూన్ - రాజమౌళితో ఆయన ఏమన్నారో తెలుసా?
Samantha New Flat : ముంబైలో సమంత ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ - బాబోయ్ అంత రేటా?
సిద్దార్థ్- కియారా జంటకు క్షమాణలు చెప్పిన ఉపాసన, ఎందుకంటే..
Ennenno Janmalabandham February 8th: బయటపడిన అభిమన్యు అసలు రంగు, మాళవిక బతుకు బస్టాండ్- మనసులతో ఊసులాడుకున్న వేద, యష్
Pawan Kalyan As God : ప్రేమికుల రోజు నుంచి దేవుడిగా పవన్ కళ్యాణ్
Guppedanta Manasu February 8th: మహేంద్రనా మజాకా! టామ్ అండ్ జెర్రీ కొత్త ప్రయాణం మొదలైంది
ఉదయగిరి ఎమ్మెల్యేకు గుండెపోటు- క్షేమంగా ఉన్నానంటూ వీడియో రిలీజ్
Cow Hug Day: వాలెంటైన్స్ డే మన సంస్కృతి కాదు, కౌ హగ్ డే జరుపుకోండి - కేంద్రం ఉత్తర్వులు
PM Modi Sadri Jacket: ప్రధాని మోదీ ధరించిన జాకెట్ ఎంతో స్పెషల్, ఎందుకో తెలుసా?
బందరు పోర్టు కోసం పవర్ ఫైనాన్స్ కార్పోరేషన్ ద్వారా రుణం- 9.75 వడ్డీతో రూ. 3940 కోట్లు తీసుకోవడానికి క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్