అన్వేషించండి
Tollywood: 'ఇంద్ర' సినిమాకి 20 ఏళ్లు - 'RC15' క్యాస్టింగ్ రూమర్స్‌పై మేకర్స్ క్లారిటీ!
ఈరోజు టాలీవుడ్ కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మీకోసం..

'ఇంద్ర' సినిమాకి 20 ఏళ్లు - 'RC15' క్యాస్టింగ్ రూమర్స్‌పై మేకర్స్ క్లారిటీ
'ఇంద్ర' సినిమాకి 20 ఏళ్లు:
20 Years For Industry Hit Indra:మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) హీరోగా దర్శకుడు బి.గోపాల్ రూపొందించిన సినిమా 'ఇంద్ర'(Indra). అశ్వనీదత్ నిర్మించిన ఈ సినిమాకి చిన్నికృష్ణ కథ అందించగా.. పరుచూరి బ్రదర్స్ డైలాగ్స్ రాశారు. 2002 జూలై 24న విడుదలైన ఈ సినిమా అప్పట్లో రికార్డులు సృష్టించింది. ఈ సినిమా విడుదలైన ఈరోజుకి సరిగ్గా 20 ఏళ్లు. ఈ సందర్భంగా అభిమానులు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ లు పెడుతూ.. 'ఇంద్ర' సినిమాను గుర్తు చేసుకుంటున్నారు. రూ.10 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా అప్పట్లో రూ.40 కోట్లు వసూలు చేసింది. 32 సెంటర్స్ లో 175 రోజులు పూర్తి చేసుకొని మెగాస్టార్ కెరీర్ లో బెస్ట్ హిట్ గా నిలిచింది 'ఇంద్ర'.
A very special movie for us!
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) July 24, 2022
Celebrating 2 Decades of Mega Blockbuster #Indra.@KChiruTweets @AshwiniDuttCh #BGopal #ManiSharma @VyjayanthiFilms#20YearsForIndustryHitIndra pic.twitter.com/cInd3uq9la
'RC15' క్యాస్టింగ్ రూమర్స్‌పై మేకర్స్ క్లారిటీ:
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) హీరోగా దర్శకుడు శంకర్(Shankar) ఓ సినిమాను రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. 'ఆర్ఆర్ఆర్' తరువాత రామ్ చరణ్ నటిస్తోన్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కియారా అద్వానీని హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ పూణే, హైదరాబాద్, రాజమండ్రిలలో చిత్రీకరించారు. సగానికి పైగా షూటింగ్ పూర్తయినట్లు సమాచారం.
ఇదిలా ఉండగా.. ఈ సినిమాకి సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. ఈ సినిమాలో నటీనటుల ఎంపిక జరుగుతోందని.. ఆసక్తి ఉన్నవారు సంప్రదించమంటూ ఓ పోస్టర్ వైరల్ అవుతోంది. ఈ విషయం మేకర్స్ వరకు వెళ్లడంతో వెంటనే క్లారిటీ ఇచ్చారు. సోషల్ మీడియాలో జరుగుతోన్న ప్రచారానికి తమకు ఎలాంటి సంబంధించిన నిర్మాణ సంస్థ తేల్చి చెప్పింది. తమ ప్రాజెక్ట్ లో నటీనటులను ఎంపిక చేసే బాధ్యత.. ఏ సంస్థకు ఇవ్వలేదని.. ఈ విషయంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది సదరు నిర్మాణ సంస్థ.
View this post on Instagram
ఇంకా చదవండి





















