అన్వేషించండి
Tollywood Updates: స్పెయిన్ లో రవితేజ, కృష్ణంరాజుకి ఆపరేషన్
ఈరోజు టాలీవుడ్ కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ నీకోసం

స్పెయిన్ లో రవితేజ, కృష్ణంరాజుకి ఆపరేషన్
స్పెయిన్ లో రవితేజ:
మాస్ మహారాజా యూనిక్ యాక్షన్ థ్రిల్లర్ `రామారావు ఆన్ డ్యూటీ' కి నూతన దర్శకుడు శరత్ మండవ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం సుధాకర్ చెరుకూరి SLV సినిమాస్ LLP, RT టీమ్‌వర్క్స్ పై రూపొందుతోంది. ఇప్పటికే టాకీ పార్ట్ పూర్తి చేసుకుంది. తాజాగా.. రెండు పాటల చిత్రీకరణ కోసం చిత్ర యూనిట్ స్పెయిన్ కి వెళ్లింది. పాటల చిత్రీకరణతో షూటింగ్ పూర్తవుతుంది. యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్ హీరోయిన్లుగా నటించారు. వేణు తొట్టెంపూడి కీలక పాత్రలో కనిపించనున్నారు.
View this post on Instagram
కృష్ణంరాజుకి ఆపరేషన్:
ప్రముఖ నటుడు, నిర్మాత కృష్ణంరాజుకి హైదరాబాద్ లో ఆపరేషన్ జరిగింది. ఇటీవల ఆయన కాలుజారి పడడంతో సర్జరీ చేయాల్సివచ్చింది. సర్జరీ అనంతరం ఆయన్ను డిశ్చార్జ్ చేసినట్లు తెలుస్తోంది. అయితే సర్జరీలో భాగంగా ఆయన కాలి వేలుని తీసేయాల్సి వచ్చిందట. ప్రస్తుతం కృష్ణంరాజు ఆరోగ్యంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన నిర్మాణంలో తెరకెక్కిన 'రాధే శ్యామ్' శుక్రవారం నాడు విడుదల కానుంది. ఇందులో ఆయన ఓ కీలక పాత్ర కూడా పోషించారు.
View this post on Instagram
ఇంకా చదవండి
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
ప్రపంచం





















