Movie Updates: మైక్ టైసన్ కి రూ.25 కోట్ల రెమ్యునరేషన్ - అమీషాపై చీటింగ్ కేసు!
ఈరోజు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన అప్డేట్స్ మీకోసం..
మైక్ టైసన్ కి రూ.25 కోట్ల రెమ్యునరేషన్:
విజయ్ దేవరకొండ, పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో తెరకెక్కిన 'లైగర్' సినిమాకి డిజాస్టర్ టాక్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇండియన్ సినిమాలో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది ఈ సినిమా. దీనికోసం బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ ను సైతం తీసుకొచ్చారు. సినిమాలో అతడి పాత్రను డిజైన్ చేసిన తీరు అభిమానులను ఆకట్టుకోలేకపోయింది. మైక్ టైసన్ లాంటి లెజెండ్ ను పూరి చూపించిన విధానంపై ట్రోల్స్ పడ్డాయి. నిజానికి మైక్ టైసన్ ను తీసుకురావాలనే ఆలోచన పూరిదే అని తెలుస్తోంది. విజయ్ దేవరకొండ, కరణ్ జోహార్ లు వద్దని చెప్పినా.. పూరి రూ.25 కోట్ల రెమ్యునరేషన్ చెల్లించి మరీ మైక్ టైసన్ ను తీసుకున్నట్లు తెలుస్తోంది. తొలిరోజు ఈ సినిమాకి మంచి ఓపెనింగ్స్ వచ్చినప్పటికీ.. ఆ తరువాత సినిమా చతికిలపడింది.
అమీషాపై చీటింగ్ కేసు:
బాలీవుడ్ నటి అమీషా పటేల్ తనను మోసం చేసిందంటూ ఓ నిర్మాత పిటిషన్ వేయగా.. జార్ఖండ్ కోర్టు ఆమెకు మేలో సమన్లు జారీ చేసింది. దీంతో తనపై ఈ క్రిమినల్ ప్రొసీడింగ్‌ను నిలివేయాలని కోరుతూ అమీషా సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ కేసుపై విచారణ జరిపిన బిఆర్ గవాయ, పిఎస్ నరసింహల ధర్మాసనం.. అమీషాపై క్రిమినల్ ప్రొసీడింగ్‌ను నిలిపివేయాలని జార్షండ్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. అయితే నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ చట్టంలోని సెక్షన్ 138 (చెక్ బౌన్స్) కింద శిక్షార్హమైన నేరాలకు సంబంధించిన చర్యలు చట్టానికి అనుగుణంగానే కొనసాగుతాయని అత్యున్నత న్యాయస్థానం వెల్లడించింది. అజయ్ సింగ్ అనే నిర్మాత.. 'దేశీ మ్యాజిక్' అనే సినిమా కోసం అమీషాకు రూ.2.5 కోట్లు ఇచ్చారట. కానీ ఆమె సినిమాలో నటించలేదు. అడ్వాన్స్ గా ఇచ్చిన డబ్బు కూడా తిరిగివ్వలేదు. దీంతో ఆమెపై కేసు వేశారు.
Also Read : సుమన్ బతికుండగా చంపేసిన యూట్యూబ్ ఛానళ్లు
Also Read : విజయ్ దేవరకొండ యాటిట్యూడ్ వల్ల హిట్టూ ఫ్లాపులు రాలేదు - దర్శక అభిమాని సూటి లేఖ
View this post on Instagram