By: ABP Desam | Updated at : 03 Dec 2022 04:31 PM (IST)
'18 పేజెస్' సినిమాలో అనుపమా పరమేశ్వరన్, నిఖిల్
నిఖిల్ సిద్దార్థ్ (Nikhil Siddharth) కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం '18 పేజీస్' (18 Pages Movie). సుకుమార్ (Sukumar) అందించిన కథతో రూపొందుతోంది. ఈ చిత్రానికి ఆయన శిష్యుడు పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహిస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి జీఏ 2 పిక్చర్స్ పతాకంపై 'బన్నీ' వాస్ నిర్మించారు. డిసెంబర్ 23న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. లేటెస్ట్ క్రేజీ అప్‌డేట్ ఏంటంటే... ఇందులో ఓ పాటను తమిళ స్టార్ హీరో శింబు పాడనున్నారు. ఆ పాటను ఎప్పుడు విడుదల చేసేదీ ఈ రోజు చెప్పారు.
టైమ్ ఇవ్వు పిల్లా... టైమ్ ఇవ్వు!
Time Ivvu Pilla Song From 18 Pages : '18 పేజెస్' చిత్రంలో 'టైమ్ ఇవ్వు పిల్లా టైమ్ ఇవ్వు' పాటను శింబు ఆలపించారు. తెలుగులో ఇంతకు ముందు యంగ్ టైగర్ ఎన్టీఆర్ 'బాద్ షా' సినిమాలో 'డైమండ్ గాళ్', ఉస్తాద్ రామ్ పోతినేని 'ది వారియర్'లో 'బుల్లెట్...' సాంగ్స్ ఆయనే పాడారు. ఇంకా యువ హీరోలకు కొన్ని పాటలు పాడారు. ఆయన పాడిన ప్రతి పాట సూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడీ 'టైమ్ ఇవ్వు పిల్లా' పాట కూడా ఆ రేంజ్ లో ఉంటుందని చిత్ర బృందం చెబుతోంది. ఈ సాంగ్ రిలీజ్ డేట్ కూడా చెప్పేసింది.
డిసెంబర్ 5న 'టైమ్ ఇవ్వు పిల్లా'
'టైమ్ ఇవ్వు పిల్లా' పాటను డిసెంబర్ 5న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం పేర్కొంది. ఇది బ్రేకప్ సాంగ్ అని ఈ రోజు విడుదల చేసిన హుక్ స్టెప్ వీడియో చూస్తే తెలుస్తోంది. 'టైమ్ ఇవ్వు పిల్లా కొంచెం టైమ్ ఇవ్వు... నిన్ను కొంచెం కొంచెం మర్చిపోయే టైమ్ ఇవ్వు' అంటూ లిరిక్ సాగింది.
Also Read : ఆస్కార్స్ నామినేషన్స్‌లో రాజమౌళి - 72 శాతం కన్ఫర్మ్
#18pages song TimeIvvuPilla is on its way DEC 5th 💥
— Nikhil Siddhartha (@actor_Nikhil) December 1, 2022
Vibe to the magical voice of @SilambarasanTR_ 🎤 and @GopiSundarOffl Magic#18Pages @aryasukku @actor_Nikhil @anupamahere @dirsuryapratap #BunnyVas @ShreeLyricist @lightsmith83 @NavinNooli @adityamusic pic.twitter.com/efbRTgan84
'నన్నయ్య రాసిన...' పాటకు సూపర్ రెస్పాన్స్!
ఇటీవల '18 పేజెస్' నుంచి 'నన్నయ్య రాసిన...' పాటను విడుదల చేశారు. దానికి శ్రోతల నుంచి మంచి రెస్పాన్స్ లభిస్తోందని చిత్ర బృందం సంతోషం వ్యక్తం చేసింది. టీజర్ కూడా ట్రెండ్ అయ్యింది. ఈ సినిమాలో అనుపమా పరమేశ్వరన్ (Anupama Parameswaran) హీరోయిన్. నిఖిల్, ఆమె నటించిన రెండో చిత్రమిది. తెలుగులో మాత్రమే కాదు... హిందీలో కూడా సూపర్ డూపర్ సక్సెస్ సాధించిన 'కార్తికేయ 2' సినిమాలో నటించిన నిఖిల్, అనుపమ జంటగా నటించిన సంగతి తెలిసిందే.
'18 పేజీస్'తో 'కార్తికేయ 2' సక్సెస్ ట్రాక్‌ను నిఖిల్, అనుపమ కంటిన్యూ చేయాలని కోరుకుందాం! వీళ్ళ హిట్ సెంటిమెంట్‌కు తోడు గీతా ఆర్ట్స్ సెంటిమెంట్ కూడా ఒకటి ఉంది. 'కాంతార' వంటి విజయవంతమైన సినిమాను తెలుగు రాష్ట్రాల్లో ఆ సంస్థ డిస్ట్రిబ్యూట్ చేసింది. దాని తర్వాత వాళ్ళ నుంచి వస్తున్న చిత్రమిది. 'కుమారి 21 ఎఫ్' తర్వాత మరోసారి సూర్యప్రతాప్ పల్నాటి సినిమాకు సుకుమార్ స్క్రిప్ట్ అందిస్తున్నారు. అదీ సంగతి!
ఈ సినిమాలో కథలు రాసే యువతి పాత్రలో అనుపమా పరమేశ్వరన్ కనిపించనున్నారు. ఆమెకు ప్రియుడిగా ఎప్పుడూ ఫోనులో ఉండే హుషారైన పాత్రలో నిఖిల్ నటిస్తున్నారు. ఈ చిత్రానికి గోపీసుందర్ స్వరాలు అందిస్తున్నారు. '18 పేజెస్' చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ పతాకాలపై 'బన్నీ' వాసు నిర్మిస్తున్నారు.
సిద్దార్థ్- కియారా జంటకు క్షమాపణలు చెప్పిన ఉపాసన, ఎందుకంటే..
Samantha New Flat : ముంబైలో సమంత ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ - బాబోయ్ అంత రేటా?
Ennenno Janmalabandham February 8th: బయటపడిన అభిమన్యు అసలు రంగు, మాళవిక బతుకు బస్టాండ్- మనసులతో ఊసులాడుకున్న వేద, యష్
Pawan Kalyan As God : ప్రేమికుల రోజు నుంచి దేవుడిగా పవన్ కళ్యాణ్
Guppedanta Manasu February 8th: మహేంద్రనా మజాకా! టామ్ అండ్ జెర్రీ కొత్త ప్రయాణం మొదలైంది
Remarks On Pragathi Bavan: రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఎమ్మెల్యేలు ఫైర్ - డీజీపీకి ఫిర్యాదు చేసిన పల్లా రాజేశ్వర్ రెడ్డి
Kotamreddy Issue : అది ట్యాపింగ్ కాదు రికార్డింగే - మీడియా ముందుకు వచ్చిన కోటంరెడ్డి ఫ్రెండ్ !
No More Penal Interest: అప్పు తీసుకున్నోళ్లకు గుడ్‌న్యూస్! EMI లేటైతే వడ్డీతో బాదొద్దన్న ఆర్బీఐ - కొత్త సిస్టమ్ తెస్తున్నారు!
PM Modi On Opposition: ఈడీ దెబ్బకు ప్రతిపక్షాలన్నీ ఒక్కటయ్యాయి,ప్రజలే నా రక్షణ కవచం - ప్రధాని మోదీ