Movie Releases: ఈ వారం ప్రేక్షకులను అలరించబోయే సినిమాలివే
ఈ వారం మరిన్ని సినిమాలు సందడి చేయబోతున్నాయి. అందులో ఎక్కువగా చిన్న సినిమాలే ఉన్నాయి.
గతవారం 'ఖిలాడి', 'డీజే టిల్లు' వంటి సినిమాలు ప్రేక్షకులు ముందుకురాగా.. ఈ వారం మరిన్ని సినిమాలు సందడి చేయబోతున్నాయి. అందులో ఎక్కువగా చిన్న సినిమాలే ఉన్నాయి. వీటితో పాటు మోహన్ బాబు 'సన్నాఫ్ ఇండియా' కూడా విడుదల కానుంది.
సన్నాఫ్ ఇండియా - సీనియర్ హీరో మంచు మోహన్ బాబు ప్రధాన పాత్రలో శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా 'సన్ ఆఫ్ ఇండియా'. ఈ చిత్రానికి డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహించగా.. మంచు విష్ణు నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా ఫిబ్రవరి 18న విడుదల చేయనున్నారు.
బడవ రాస్కెల్ - కన్నడలో బ్లాక్ బస్టర్ అయిన 'బడవ రాస్కెల్' సినిమాను ఇప్పుడు తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఫిబ్రవరి 18న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. డాలీ పిక్చర్స్ మరియు రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్ వారు సంయుక్తంగా ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. 'పుష్ప' సినిమాలో జాలిరెడ్డి పాత్రతో ప్రేక్షకులను అలరించిన ధనుంజయ్ ఈ సినిమాలో హీరోగా నటించగా అమృత అయ్యంగార్ హీరోయిన్‌గా నటించింది.
విశ్వక్ - అజయ్ కతుర్వాన్, డింపుల్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాను వేణు ములాక్కా డైరెక్ట్ చేశారు. ఫిబ్రవరి 18న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
సురభి 70 ఎంఎం - అనిల్ కుమార్, వినోద్ నాగులపాటి, ఉషాంజలి, అక్షిత, శ్లోక, మహేష్ ఎడ్లపల్లి , చంద్రకాంత్ , యోగి , అనీష్ తదితరులు నటించిన సినిమా 'సురభి 70 ఎంఎం'. ఈ సినిమాను బాబీ ఫిలిమ్స్, జెఎస్ఆర్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించాయి. కెకె చైతన్య నిర్మాణంలో దర్శకుడు గంగాధర వై కె అద్వైత ఈ సినిమాను తెరకెక్కించారు. ఫిబ్రవరి 18న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
వర్జిన్ స్టోరీ - నిర్మాత లగడపాటి శ్రీధర్ తనయుడు విక్రమ్ సహిదేవ్ హీరోగా పరిచయం అవుతున్న సినిమా 'వర్జిన్ స్టోరీ'. సౌమిక పాండియన్, రిషీ ఖన్నా, వినీత్ బవిశెట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ప్రదీప్ బి. అట్లూరి దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమా ఈ నెల 18న విడుదల కానుంది.
ఈ సినిమాలతో పాటు 'గోల్ మాల్', 'బ్యాచ్', 'నీకు నాకు పెళ్లంట' అనే మరో మూడు చిన్న సినిమాలు ఫిబ్రవరి 18న విడుదల కానున్నాయి.
ఓటీటీ రిలీజులు..
బంగార్రాజు - సంక్రాంతికి థియేటర్లలో అక్కినేని నాగార్జున, ఆయన పెద్ద కుమారుడు యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య సోగాళ్లుగా సందడి చేశారు. 'బంగార్రాజు' సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఇప్పుడు ఈ సినిమాను డిజిటల్ వీక్షకుల ముందుకు తీసుకు వస్తోంది 'జీ 5'. ఈ నెల 18న తమ ఓటీటీ వేదికలో విడుదల చేస్తోంది. 'సోగ్గాడే చిన్ని నాయనా'కు సీక్వెల్‌గా రూపోందిన 'బంగార్రాజు' సినిమాకు కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వం వహించారు. అన్నపూర్ణ స్టూడియోస్‌తో కలిసి జీ స్టూడియోస్ నిర్మించింది.
#Bangarraju వేడుకలు కొనసాగుతున్నాయి on @ZEE5Telugu
— Annapurna Studios (@AnnapurnaStdios) February 10, 2022
Premiering on 18th Feb #BangarrajuOnZEE5 @iamnagarjuna @chay_akkineni @IamKrithiShetty @meramyakrishnan @kalyankrishna_k @ZeeStudios_ @vennelakishore pic.twitter.com/5VGWqSKClD
83 - హర్యానా హరికేన్ కపిల్ దేవ్ బయోపిక్ గా తెరకెక్కిన చిత్రం '83'. ఈ సినిమాలో కపిల్ దేవ్ పాత్రలో రణ్‌వీర్ సింగ్ , కపిల్ భార్య రోమి పాత్రలో నిజజీవితంలో రణ్‌వీర్ భార్య దీపికా పదుకోన్ నటించారు. థియేటర్లలో రిలీజైన ఈ సినిమా ప్రేక్షకుల మనసు దోచుకుంది. అయితే కరోనా కాలంలో విడుదలైన ఈ సినిమాను ఫిబ్రవరి 18న ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేందుకు చిత్రబృందం సిద్ధమవుతోంది. హిందీ వెర్షన్ నెట్ ఫ్లిక్స్ లో.. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ వెర్షన్స్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానున్నాయి.
ఎనిమి - విశాల్, ఆర్య హీరోలుగా నటించిన ఈ సినిమాను ఫిబ్రవరి 18 నుంచి సోనీ లివ్ లో స్ట్రీమింగ్ చేయనున్నారు. ఆనంద్ శంకర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో మమతా మోహన్ దాస్ కీలకపాత్ర పోషించింది.