The Power: అమ్మాయిల ఒంటి నుంచి నిజంగా కరెంటు పుడితే - ‘ది పవర్’ టీజర్ మైండ్ బ్లోయింగ్!
‘ది పవర్’ అనే కొత్త సిరీస్ టీజర్‌ను అమెజాన్ విడుదల చేసింది.
The Power: అమెజాన్ ప్రైమ్ వీడియోలో మరో విభిన్న సిరీస్‌ను విడుదల చేయనున్నారు. ‘ది పవర్’ పేరుతో రానున్న ఈ సిరీస్ టీజర్‌ను లాంచ్ చేశారు. టీనేజ్ అమ్మాయిల్లో ఎలక్ట్రిసిటీని పుట్టించే ఒక కొత్త అవయవం ఏర్పడితే ఏం జరుగుతుందనే ఇంట్రస్టింగ్ కాన్సెప్ట్‌తో ఈ సిరీస్ తెరకెక్కింది. 2016లో బ్రిటిష్ రచయత్రి నవోమీ ఆల్డర్‌మ్యాన్ రాసిన ‘ది పవర్’ అనే పుస్తకం ఆధారంగా ఈ సిరీస్‌ను తెరకెక్కించారు. మార్చి 31వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో యాప్‌లో ఈ సిరీస్ స్ట్రీమ్ కానుంది.
అమ్మాయిల వేళ్ల నుంచి కరెంటు పుట్టడం, దాని ద్వారా కొందరు లేడీ విలన్స్ నగరాలకు పవర్ సప్లై ఆపేయడం, ఫ్లైట్స్ క్రాష్ చేయడం వంటివి చేసినట్లు కూడా టీజర్లో చూపించారు. ముఖ్యంగా టీజర్లో వచ్చిన బ్యాక్‌గ్రౌండ్ సాంగ్ ఆకట్టుకుంటుంది.
అమెజాన్ 'ప్రైమ్ లైట్' అనే చవకైన సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ను కూడా కంపెనీ పరీక్షిస్తుందని వార్తలు వస్తున్నాయి. ఈ ప్లాన్ రూ.999గా ఉంటుంది. ఒకప్పుడు అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ ధర రూ.999గా ఉండేది. కానీ 2021 డిసెంబర్‌లో కంపెనీ ధరను పెంచింది. ఈ ప్లాన్ ధరను రూ.1499కి పెంచారు. ప్రైమ్ లైట్ ద్వారా మరో చవకైన ప్లాన్‌ను కంపెనీ లాంచ్ చేయనుంది. అమెజాన్ ప్రైమ్ లైట్ ప్లాన్‌ను రూ.999కే లాంచ్ చేసే అవకాశం ఉంది. అయితే ఇందులో కొన్ని లాభాలను కంపెనీ తగ్గించనుంది.
అమెజాన్ ప్రైమ్ లైట్ సబ్‌స్క్రిప్షన్ ద్వారా మీకు లభించే లాభాలు ఇవే...
1. ఈ ప్లాన్ ద్వారా ఎస్‌డీ రిజల్యూషన్‌లో వీడియోలను స్ట్రీమ్ చేసే అవకాశం లభిస్తుంది. దీన్ని కేవలం ఒకేసారి రెండు డివైస్‌ల్లో మాత్రమే ఉపయోగించగలరు. ఇందులో మీరు లైవ్ స్పోర్ట్స్ చూడలేరు.
2. మీరు అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో సబ్‌స్క్రిప్షన్‌ను కొనుగోలు చేస్తే ఐదు శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.
3. అమెజాన్ ప్రైమ్ లైట్ సబ్‌స్క్రిప్షన్ ద్వారా రెండు రోజుల పాటు అన్‌లిమిటెడ్ ఫ్రీ షిప్పింగ్‌ను పొందుతారు.
4. అమెజాన్ ప్రైమ్ లైట్ సబ్‌స్క్రిప్షన్‌లో ప్రైమ్ మ్యూజిక్, ప్రైమ్ గేమింగ్, నో కాస్ట్ ఈఎంఐ వంటి ప్రయోజనాలు ఉండవు.
టీవీలో కూడా వాడేయచ్చు
అమెజాన్ ప్రైమ్ లైట్ ప్లాన్‌లో అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు దీన్ని మొబైల్‌లో, స్మార్ట్ టీవీ లేదా కంప్యూటర్‌లో ఉపయోగించవచ్చు. ఇది కేవలం మొబైల్ మాత్రమే ప్లాన్ కాదు. ప్రస్తుతం ఈ ప్లాన్ బీటా టెస్టింగ్ జరుగుతోంది. ఇది ప్రస్తుతం కొంతమంది వినియోగదారులకు అందుబాటులో ఉంది. రానున్న కాలంలో కంపెనీ ఈ ప్లాన్‌ని అందరికీ అందించనుంది.
ఇక ఈ నెలలోనే షాహిద్ కపూర్, విజయ్ సేతుపతిల వెబ్ సిరీస్ ‘ఫర్జీ’ కూడా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ కానుంది. ఈ వెబ్ సిరీస్ ట్రైలర్‌ను అమెజాన్ ప్రైమ్ ఇటీవలే విడుదల చేసింది. నకిలీ నోట్లను ముద్రించే వ్యక్తిగా షాహిద్ కపూర్ కనిపిస్తుండగా, తనను పట్టుకునే రూత్‌లెస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో విజయ్ సేతుపతిని చూడవచ్చు. ట్రైలర్‌ను బాగా ఆసక్తికరంగా కట్ చేశారు. షాహిద్ కపూర్, విజయ్ సేతుపతిలతో పాటు రాశి ఖన్నా, రెజీనా కసాండ్రా, కేకే మీనన్‌లను కూడా ఈ వెబ్ సిరీస్ లో చూడవచ్చు.