The Kashmir Files: 'ది కశ్మీర్ ఫైల్స్' ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే?
'ది కశ్మీర్ ఫైల్స్' సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు.
కొన్నాళ్లక్రితం విడుదలైన 'ది కశ్మీర్ ఫైల్స్' సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. ప్రధాని మోదీ దగ్గర నుంచి సామాన్య ప్రజల వరకు ప్రతి ఒక్కరూ ఈ సినిమాకి కనెక్ట్ అయ్యారు. 90వ దశకంలో కశ్మీర్ పండిట్ లపై సాగిన సామూహిక హత్యాకాండ నేపథ్యంలో దర్శకుడు వివేక్ ఈ సినిమాను రూపొందించారు. ఈ సినిమాలో అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, దర్శన్ కుమార్ లు కీలకపాత్రలు పోషించారు.
ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు. థియేటర్లో కేవలం హిందీ వెర్షన్ విడుదల కాగా.. ఓటీటీలో మాత్రం అన్ని భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 ఈ సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. తాజాగా ఓటీటీ రిలీజ్ డేట్ ను ప్రకటించింది. మే 13న ఈ సినిమాను హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ చేయనున్నారు.
ఈ సినిమా రిలీజ్ తో జీ5 సబ్ స్క్రిప్షన్స్ పెరగడం ఖాయం. చాలా మంది సౌత్ ఆడియన్స్ ప్రాంతీయ భాషల్లో ఈ సినిమాను చూడాలనుకుంటున్నారు. కాబట్టి వ్యూస్ ఓ రేంజ్ లో వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ సినిమా స్టోరీ ఏంటంటే.. కశ్మీర్ లోయలోని హిందూ కుటుంబాలపై పాకిస్తాన్ ప్రేరేపిత ముస్లిం ఉగ్రవాదులు దారుణ మారణకాండకు పాల్పడ్డారు.
కశ్మీరీ మహిళలలను వివస్త్రలుగా చేసి.. సామూహిక మానభంగం చేశారు. ఆ లోయలో ఉండాలంటే ముస్లింలుగా మతం మార్చుకోవాలని.. లేదంటే చంపేస్తామని బెదిరించారు. తమకు ఎదురు తిరిగినవారిని చంపేశారు. వారు ఆస్తులను దోచుకున్నారు. తుపాకులు, కత్తులతో హిందువులపై దాడి చేశారు. అప్పట్లో జరిగిన ఈ మారణకాండను కళ్లకు కట్టినట్లుగా చూపించారు దర్శకుడు.
Also Read: ఈ వారం థియేటర్-ఓటీటీలో రిలీజ్ కాబోయే సినిమాలివే
View this post on Instagram