By: Suresh Chelluboyina | Updated at : 20 Dec 2022 03:21 PM (IST)
Image Credit: Sai Radha Heritage and Kantara/Instagram
‘కాంతారా’ మూవీ చూశారా? అందులో దొర (అచ్యుత్ కుమార్) ఇల్లు భలే ఉంటుంది. దాన్ని చూడగానే.. బహుశా, ఆ మూవీ కోసం వేసిన సెట్టింగ్ కావచ్చని అనుకుంటాం. కానే కాదు.. ఆ బంగ్లా నిజంగానే ఉంది. పైగా అది నివాస బంగ్లా కాదు. సముద్ర తీరంలో కొబ్బరి చెట్ల మధ్య నిర్మించిన అందమైన బీచ్ రిసార్ట్.
‘కాంతారా’ మూవీలో కనిపించే ఈ దొరగారి బంగ్లాను ఒక మారుమూల గ్రామంలో ఉన్నట్లు చూపిస్తారు. వాస్తవానికి ఆ బంగ్లా కర్ణాటకలోని మంగళూరులో ఉంది. పాడు సముద్ర తీరంలో ఉన్న ఈ రిసార్ట్ పేరు ‘సాయి రాధా హెరిటేజ్ బీచ్’. ఈ రిసార్టులో మీరు కూడా స్టే చేయొచ్చు. ప్రకృతి అందాల మధ్య ఈ రిసార్ట్ భలే ఆకర్షణీయంగా కనిపిస్తుంది. మంగళూరు నుంచి కేవలం 40 కిమీల దూరంలోనే ఈ రిసార్ట్ ఉంది. బస్సులో ఒక గంటలో ఇక్కడికి చేరుకోవచ్చు.
సుమారు 50 ఏళ్ల కిందట నిర్మించిన ఈ నివాస బంగ్లాను కొన్నాళ్ల కిందట లగ్జరీ రిస్టారుగా మార్చారు. బయటకు ఇది పెంకులతో కట్టిన బంగ్లాలా కనిపించిన లోపల మాత్రం చాలా రిచ్‌గా ఉంటుంది. ఈ బంగ్లాలోకి ఒక్కసారి అడుగుపెడితే.. చాలు మీరు కొన్నాళ్లు వెనక్కి వెళ్లిపోతారు. అందమైన చెక్క శిల్పాలు, పెయింటింగులు, విద్యుద్దీపాల కాంతులతో ఈ బంగ్లా భలే అందంగా ఉంటుంది. మనం సినిమాలో పడి.. అవేవీ గమనించి ఉండకపోవచ్చు. నేరుగా వెళ్లి చూస్తే తప్పకుండా మీరు మైమరచిపోతారు. ఇక్కడ మీరు బస చేయాలని అనుకుంటే ఒక రాత్రికి రూ.6,500 చెల్లించాలి.
‘కాంతార’ సినిమా ఎంతటి భారీ విజయాన్ని సొంతం చేసుకుందో తెలిసిందే. ఈ సినిమా చూసిన సీనియర్ నటులు సైతం నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ప్రభాస్, ధనుష్, అనుష్క శెట్టి, సిద్ధాంత్ చతుర్వేది, శిల్పా శెట్టి, రజనీ కాంత్, కమల్ హాసన్‌లు.. రిషబ్ శెట్టి నటనకు ఫిదా అయ్యారు. తాజాగా ఈ మూవీని హిందీలో కూడా విడుదల చేశారు. మరోవైపు ఓటీటీలో కూడా ‘కాంతార’ మూవీ దూసుకెళ్తొంది.
‘కాంతార’ మూవీని హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై విజయ్ కిరగందూర్, చలువే గౌడ ఈ సినిమాను నిర్మించారు. సెప్టెంబర్ 30న కన్నడలో విడుదలైన ఈ సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 15న తెలుగు, హిందీ సహా పలు భాషల్లో రిలీజ్ అయ్యింది. కన్నడనాట రూ.200 కోట్లకుపైగా వసూళ్లు సాధించింది. ఆ తర్వాత విడుదలైన ప్రతి చోటా అద్భుత విజయాన్ని అందుకుంది. ఈ సినిమా మొత్తంగా రూ. 450 కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేసి.. ఈ ఏడాది ఎక్కువ కలెక్షన్లు సాధించిన బ్లాక్ బస్టర్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. తాజాగా ఈ సినిమా ఓటీటీలోకి వచ్చింది. అయినా, పలు చోట్ల థియేటర్లలోనే చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. ‘కాంతార’ చిత్రంలో రిషబ్ శెట్టి, సప్తమి గౌడ, కిషోర్ కుమార్ జి కీలక పాత్రలు పోషించారు. హిందీ వెర్షన్ పలు బాలీవుడ్ సినిమాలకు గట్టి పోటీనిచ్చింది.
K Viswanath Death: కె.విశ్వనాథ్ కెరీర్లో ఆ మూవీ ఓ మైలురాయి - కానీ, అది మానసికంగా చాలా బాధించిందట!
Sankarabharanam: తెలుగు సినిమాకు ఊపిరి పోసిన ‘శంకరాభరణం’ రిలీజైన రోజే అస్తమించిన కళాతపస్వి!
Writer Padmabhushan Review - 'రైటర్ పద్మభూషణ్' రివ్యూ : కామెడీయే కాదు, మెసేజ్ కూడా - సుహాస్ సినిమా ఎలా ఉందంటే?
Gruhalakshmi February 3rd: ఇంట్లో నుంచి బయటకి వెళ్లిపోయేందుకు అభి ప్లాన్- నందు వ్యాపారానికి లాస్య కండిషన్
Guppedantha Manasu February 3rd Update: రాజీవ్ అరెస్ట్ తో రిషికి నిజం తెలిసిపోయింది, తనెవరో తెలియాలన్న రిషికి ఫజిల్ వదిలేసిన వసు!
YSRCP Tensions : వైఎస్ఆర్సీపీలో ఈ అలజడి ఎందుకు ? ఇంటలిజెన్స్ అత్యుత్సాహమే కొంప ముంచుతోందా ?
TS New Secretariat Fire Accident: తెలంగాణ నూతన సచివాలయంలో భారీ అగ్ని ప్రమాదం
KCR Political strategy : గవర్నర్‌తో రాజీ - బడ్జెట్ పై సైలెన్స్ ! బీజేపీపై కేసీఆర్ దూకుడు తగ్గిందా ?
K Viswanath : హిందీలోనూ విశ్వనాథ్ హిట్టే, ఆయన 'స్వయంకృషి' - ఓ తీరని కోరిక