The Goat Life Release Date: ఎడారి దేశంలో భారతీయ కూలీ కష్టాలు - మాలీవుడ్ స్టార్ పృథ్వీరాజ్ సినిమా విడుదలకు రెడీ!
మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా నటించిన సినిమా 'ది గోట్ లైఫ్'. తెలుగు ప్రేక్షకుల ముందుకు 'ఆడు జీవితం'గా రానుంది. ఇవాళ సినిమా విడుదల తేదీ వెల్లడించారు.
Prithviraj Sukumaran's The Goat Life release date: మలయాళ స్టార్ హీరో, దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్ తెలుగు ప్రేక్షకులకు సైతం సుపరిచితులే. ప్రస్తుతం పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ 'సలార్' సినిమాలో ఆయన నటిస్తున్నారు. అంతకు ముందు తమిళంలో మణిరత్నం దర్శకత్వంలో చియాన్ విక్రమ్ 'రావణ్' (తెలుగులో 'విలన్') సినిమాలో నటించారు. కొన్ని మలయాళ సినిమాలు సైతం తెలుగులో డబ్బింగ్ అయ్యాయి. ఇప్పుడు ఆయన ప్రస్తావన ఎందుకు అంటే...
పృథ్వీరాజ్ సుకుమారన్ 'ఆడు జీవితం
'The Goat Life releasing in Telugu as Aadujeevitham: పృథ్వీరాజ్ సుకుమారన్ కథానాయకుడిగా నటించిన కొత్త సినిమా 'ది గోట్ లైఫ్'. తెలుగులో 'ఆడు జీవితం' పేరుతో విడుదల కానుంది. ఉత్తమ దర్శకుడిగా జాతీయ పురస్కారం అందుకున్న బ్లెస్సీ తీసిన తాజా చిత్రమిది. ఈ సినిమాపై ఆయన 15 ఏళ్లుగా వర్క్ చేస్తున్నారు. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... ఈ సినిమా విడుదల తేదీ వెల్లడించారు.
ఏప్రిల్ 10న ఐదు భాషల్లో 'ఆడు జీవితం'
Aadujeevitham movie release date: వచ్చే ఏడాది ఏప్రిల్ 10న 'ది గోట్ లైఫ్' చిత్రాన్ని మలయాళంతో పాటు హిందీ, తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఇందులో హాలీవుడ్ యాక్టర్ జిమ్మీ జీన్ లూయిస్, అమలా పాల్, కేఆర్ గోకుల్, అరబ్ ఫేమస్ యాక్టర్స్ తాలిబ్ అల్ బలూషి, రిక్ ఆబే ఇతర కీలక పాత్రల్లో నటించారు. బెన్యామిన్ రాసిన 'గోట్ డేస్' నవల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు.
The greatest survival adventure. An unbelievable true story. Witness the extraordinary unravel!@DirectorBlessy @arrahman @benyamin_bh @Amala_ams @Haitianhero @rikaby @resulp @TheGoatLifeFilm #Aadujeevitham #Adujeevitham #TheGoatLife #AmalaPaul #JimmyJeanLouis #TalibalBalushi… pic.twitter.com/81AXkTeImu
— Prithviraj Sukumaran (@PrithviOfficial) November 30, 2023
'ఆడు జీవితం' కథ ఏమిటంటే?
అరబ్ దేశాలకు జీవనోపాధిని వెతుకుతూ వెళ్లిన భారతీయ వలస కూలీల కథతో 'ది గోట్ లైఫ్' చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో కేరళకు చెందిన నజీబ్ అనే వ్యక్తి పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించారు. ఎడారిలో పూర్తి స్థాయిలో రూపొందిన తొలి భారతీయ చిత్రమిది. దర్శకుడు బ్లెస్సీ మాట్లాడుతూ ''యూనివర్సల్ అప్పీల్ ఉన్న కథ ఇది. ఈ కథను వీలైనంతగా, సహజంగా చూపించడాన్ని ఒక సవాలుగా తీసుకున్నాం. వాస్తవ ఘటనల ఆధారంగా రాసిన కథతో సినిమా తీశాం. 'ది గోట్ లైఫ్'ను పలు దేశాల్లోని లొకేషన్లలో భారీ ఎత్తున రూపొందించాం. ఇటువంటి చిత్రాలను థియేటర్లలోనే చూడాలి'' అని చెప్పారు.
'ది గోట్ లైఫ్'ను అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శించాలని పృథ్వీరాజ్ సుకుమారన్ ప్లాన్ చేశారు. వాళ్లకు ట్రైలర్ పంపించారు. అది కాస్తా లీక్ కావడంతో ఈ ఏడాది ఏప్రిల్ 8న సోషల్ మీడియాలో ట్రైలర్ విడుదల చేశారు. ఈ సినిమా కోసం పృథ్వీరాజ్ సుకుమారన్ చాలా కష్టపడ్డారు. ఎడారిలో కూలీల కష్టాలను కళ్ళకు కట్టినట్లు చూపించడం కోసం ఆయన బరువు తగ్గి బక్క చిక్కారు. కొంత మంది ఆయనను గుర్తు పట్టడం కూడా కష్టమైంది. జోర్డాన్, అల్జీరియాలోని సహారా ఎడారిలో కఠినమైన పరిస్థితుల్లో 'ఆడు జీవితం' చిత్రీకరణ చేశారు. ప్రొడక్షన్ కోసం ఇండియాకు, యూఎస్ కు చెందిన నాలుగు కంపెనీలు వర్క్ చేయటం విశేషం. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్, రసూల్ పూకుట్టి సౌండ్ డిజైన్, అక్కినేని శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్ పని చేశారు.
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply