News
News
X

Bangarraju: బంగార్రాజుగారూ... డాంట‌కు డ‌డ‌న‌ అనగా ఏమి? ఓరి బుడ్డోడా... తెలుసుకోకుండా ఏం చేస్తున్నావ్?

'బంగార్రాజు'గా మరోసారి అక్కినేని నాగార్జున సందడి చేయనున్న సంగతి తెలిసిందే. ఆయన టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ సినిమాలో 'లడ్డుందా...' సాంగ్ ప్రోమోను ఈ రోజు విడుదల చేశారు. 

FOLLOW US: 

'సోగ్గాడే చిన్ని నాయనా' సినిమాలో అక్కినేని నాగార్జున, రమ్యకృష్ణ జోడీ సందడి చేసింది. వీళ్లిద్దరూ మరోసారి జంటగా కనిపించనున్న సినిమా 'బంగార్రాజు'. 'సోగ్గాడే చిన్ని నాయనా'కు ప్రీక్వెల్ ఇది. 'సోగ్గాడే...'లో బంగార్రాజుగా నాగార్జున చేసిన సందడి అంతా ఇంతా కాదు. మరోసారి అదే పాత్రలో ఆయన సందడి చేయడానికి సిద్ధమయ్యారు. 'సోగ్గాడే చిన్ని నాయనా' టైటిల్ సాంగ్ లో భూమ్మీద అందగత్తెలతో ఆడిపాడారు. ఇప్పుడు స్వర్గంలో రంభ, ఊర్వశి, మేనకతో స్టెప్పులు వేయనున్నారు.

'బంగార్రాజు'లో 'లడ్డుందా...' సాంగ్ ప్రోమోను ఈ రోజు (ఆదివారం) సాయంత్రం విడుదల చేశారు. ఫుల్ సాంగ్‌ను ఈ నెల 9వ తేదీన ఉదయం 9.09 గంటలకు విడుదల చేయనున్నారు. సాంగ్ రిలీజ్ సందర్భంగా విడుదల చేసిన స్టిల్ లో  నాగార్జున పక్కన ఉన్న అమ్మాయి ఎవరో తెలియనివ్వకుండా జాగ్రత్త వహించారు. ఫుల్ సింగ్ రిలీజ్ చేసినప్పుడు చూపిస్తారో? లేదో? మరి! అనూప్ రూబెన్స్ సినిమాకు సంగీతం అందించారు. ఈ పాటను నాగార్జున పాడారు. 'బాబూ తబలా... అబ్బాయ్ హార్మోనీ... తానన నన డాంట‌కు డ‌డ‌న‌' అని నాగార్జున పాడగా... 'రాజుగారూ డాంట‌కు డ‌డ‌న‌ అనగా ఏమి?' అని మరో వాయిస్ వినిపించింది. 'ఓరి బుడ్డోడా ఇంతకాలం తెలుసుకోకుండా ఏం చేస్తున్నావ్ రా! అడగాలి కదా! నేర్పిస్తాం కదా!' అని నాగార్జున చెప్పారు. సాంగ్ లో 'డాంట‌కు డ‌డ‌న‌' అంటే ఏంటో చెబుతారు. 

నాగార్జున, రమ్యకృష్ణ ఓ జంటగా నటిస్తున్న ఈ సినిమాలో అక్కినేని నాగ చైతన్య, 'ఉప్పెన' ఫేమ్ కృతి శెట్టి మరో జంటగా నటిస్తున్నారు. కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నాగార్జున 'సోగ్గాడే చిన్ని నాయనా', అక్కినేని నాగ చైతన్య 'రారండోయ్ వేడుక చూద్దాం' సినిమాలు చేశారు. ఇప్పుడు తండ్రీతనయులు ఇద్దరూ కలిసి 'బంగార్రాజు' చేస్తున్నారు. అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్‌గా... కుటుంబమంతా కలిసి చూసేలా దర్శకుడు కల్యాణ్ కృష్ణ సినిమాను తెరకెక్కిస్తున్నారని యూనిట్ సభ్యులు తెలిపారు. అన్నపూర్ణ స్టూడియోస్, జీ స్టూడియోస్ పతాకాలపై అక్కినేని నాగార్జున సినిమాను నిర్మిస్తున్నారు.

Also Read: తెలుగు సినిమా దర్శకులందు త్రివిక్రమ్ వేరయా!
Also Read: పాట కష్టం తెలిసినోడు... కొన్నేళ్లుగా రాయనోడు... మళ్లీ పవన్ కోసం రాశాడు!
Also Read: అల్లు అర్జున్ ఫ్యాన్స్ డిమాండ్... అక్కడ 'పుష్ప'ను విడుదల చేయాల్సిందే!
Also Read: పెళ్లి కబురు చెప్పిన కార్తికేయ... ఆ తర్వాత కాబోయే భార్యను పిలిచి!
Also Read: మంగళం శీను మామూలుగా లేడుగా... విల‌న్‌గా సునీల్ లుక్ చూశారా?
Also Read: హ్యాట్రిక్‌కు రెడీ... మహేష్ దర్శకత్వంలో అనుష్క!
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 07 Nov 2021 06:33 PM (IST) Tags: Ramyakrishna Krithi Shetty Naga Chaitanya nagarjuna Bangarraju Laddunda Song Promo Bangarraju Songs

సంబంధిత కథనాలు

Rana Daggubati : అన్నీ డిలీట్ చేసిన రానా - ఒక్కటంటే ఒక్క ఫోటో కూడా లేదు

Rana Daggubati : అన్నీ డిలీట్ చేసిన రానా - ఒక్కటంటే ఒక్క ఫోటో కూడా లేదు

Mahesh Babu: ఆ మహేష్ బాబును మళ్లీ చూడలేమా? ఈ ప్రయోగాలు మరే హీరో చేయలేడు!

Mahesh Babu: ఆ మహేష్ బాబును మళ్లీ చూడలేమా? ఈ ప్రయోగాలు మరే హీరో చేయలేడు!

Sravanthi Instagram Hacked: ‘బిగ్ బాస్’ బ్యూటీ స్రవంతికి హ్యాకర్స్ షాక్, అవన్నీ డిలీట్ - ఇవి మాత్రమే మిగిలాయ్!

Sravanthi Instagram Hacked: ‘బిగ్ బాస్’ బ్యూటీ స్రవంతికి హ్యాకర్స్ షాక్, అవన్నీ డిలీట్ - ఇవి మాత్రమే మిగిలాయ్!

Pawan Kalyan Mahesh Babu : ఆ రోజు మహేష్ బాబుకు మద్దతుగా నిలిచా - పవన్ కళ్యాణ్ 

Pawan Kalyan Mahesh Babu : ఆ రోజు మహేష్ బాబుకు మద్దతుగా నిలిచా - పవన్ కళ్యాణ్ 

Chiranjeevi Aamir Khan : మెగాస్టార్‌తో అటువంటి సినిమా సాధ్యమేనా?

Chiranjeevi Aamir Khan : మెగాస్టార్‌తో అటువంటి సినిమా సాధ్యమేనా?

టాప్ స్టోరీస్

Tirumala: ప్రతి వారం సహస్ర కలశాభిషేకం రద్దు చేసిన టీటీడీ, ఎందుకో తెలుసా !

Tirumala: ప్రతి వారం సహస్ర కలశాభిషేకం రద్దు చేసిన టీటీడీ, ఎందుకో తెలుసా !

Liger Team At Mumbai : వాళ్ళిద్దరి బాండింగ్ అలాంటిది - ముంబైలో లవ్లీ 'లైగర్' జోడీ  

Liger Team At Mumbai : వాళ్ళిద్దరి బాండింగ్ అలాంటిది - ముంబైలో లవ్లీ 'లైగర్' జోడీ  

Harsha Kumar Son Case : యువతితో అసభ్య ప్రవర్తన, మాజీ ఎంపీ హర్ష కుమార్ కుమారుడిపై కేసు నమోదు

Harsha Kumar Son Case : యువతితో అసభ్య ప్రవర్తన, మాజీ ఎంపీ హర్ష కుమార్ కుమారుడిపై కేసు నమోదు

Tirumala News : శ్రీవారి భక్తులకు టీటీడీ అలర్ట్, తిరుమల యాత్ర వాయిదా వేసుకోవాలని విజ్ఞప్తి

Tirumala News : శ్రీవారి భక్తులకు టీటీడీ అలర్ట్, తిరుమల యాత్ర వాయిదా వేసుకోవాలని విజ్ఞప్తి