Thaman Kalavathi Dance: ‘కళావతి’ పాటకు సిగ్గుపడుతూ డ్యాన్స్ చేసిన తమన్, శేఖర్ మాస్టార్‌తో కలిసి అదరగొట్టేశాడు!
‘కళావతి’ పాటకు సంగీతాన్ని సమకూర్చిన మ్యూజిక్ డైరెక్టర్ తమన్, ఆ పాటకు మహేష్ బాబుతో స్టెప్పులు వేయించిన కొరియోగ్రాఫర్ కలిసి డ్యాన్స్ చేస్తే ఎలా ఉంటుందో చూడాలని ఉందా?

మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న ‘సర్కారు వారి పాట’ సినిమా నుంచి ఇటీవల ‘కళావతి’ సాంగ్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ పాట శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంటోంది. అంతేకాదు, ఈ పాటకు మహేష్ బాబు వేసిన డ్యాన్స్ నెట్టింట వైరల్ అవుతోంది. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే పాట, అదే డ్యాన్స్. ‘సర్కారు వారి పాట’ సినిమాకు తమన్ సంగీతం అందించిన సంగతి తెలిసిందే. అలాగే శేఖర్ మాస్టర్ ‘కళావతి’ సాంగ్‌కు నృత్య దర్శకత్వం చేశారు. మరి, వీరిద్దరు కలిసి అదే పాటకు డ్యాన్స్ చేస్తే.. భలే బాగుంటుంది కదూ. అయితే, ఈ కింది వీడియో చూసేయండి. తమన్ ఈ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ‘‘సిగ్గుతో నన్ను నేనే..’’ అంటూ శేఖర్ మాస్టర్‌కు థాంక్స్ చెప్పాడు.
View this post on Instagram
#KalaavathiChallenge పేరుతో ఈ పాట ఇప్పుడు వైరల్‌గా చక్కర్లు కొడుతోంది. ఇటీవల మహేష్ బాబు కూతురు సితార ఈ పాటకు తండ్రి స్టైల్ లో స్టెప్స్ వేసి ఆకట్టుకుంది. అంతేకాదు.. #KalaavathiChallenge అంటూ అభిమానులకు ఓ ఛాలెంజ్ విసిరింది. 'కళావతి' పాటకు రీల్స్ చేసి #KalaavathiChallenge పేరుతో వీడియోలను షేర్ చేయాలని కోరింది. అందులో తనకు నచ్చిన వీడియోలను ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో పెట్టుకుంటానని చెప్పింది. ఈ ఛాలెంజ్‌ను ‘సర్కారు వారి పాట’ హీరోయిన్ కీర్తి సురేష్ కూడా స్వీకరించింది. ‘కళావతి’ పాటకు డ్యాన్స్ చేస్తూ వీడియోను పోస్ట్ చేసింది. మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జి.మహేష్ బాబు ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం మే 12న విడుదల కానుంది.
View this post on Instagram
Before You Go
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు





















