Thalapathy Vijay: మాట తప్పిన విజయ్ దళపతి, నార్కోటిక్స్ నియంత్రణ చట్టం కింద కేసు నమోదు
తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి మాట తప్పారు. గతంలో అభిమానులకు ఇచ్చిన హామీని తుంగలో తొక్కారు. తాజాగా ఆయనపై నార్కోటిక్స్ నియంత్రణ చట్టం కింద కేసు నమోదు అయ్యింది.
ప్రముఖ తమిళ నటుడు విజయ్ దళపతి ప్రస్తుతం ‘లియో’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ‘విక్రమ్’ సినిమాతో ఒక కొత్త యూనివర్స్ ను క్రియేట్ చేసిన లోకేష్, ‘లియో’ తో మరోసారి మ్యాజిక్ చేయడానికి సిద్దం అవుతున్నాయి. అందులోనూ ‘లియో’ మూవీ లోకేష్ యూనివర్స్ లో భాగం అని కూడా అంటున్నారు. ఈ మూవీపై దేశవ్యాప్తంగా అంచనాలు పెరిగిపోయాయి. ఇప్పిటికే సినిమా నుంచి విడుదల చేసిన టైటిల్ రివీల్ వీడియో, ఫస్ట్ లుక్ కు మంచి క్రేజ్ వస్తోంది.
విజయ్ దళపతిపై కేసు నమోదు
రీసెంట్ గా ఈ సినిమా నుంచి ‘నా రెడీ’ అనే ఫస్ట్ సింగిల్ విడుదల అయ్యింది. దీనికి ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది. ఈ పాటను దళపతి విజయ్ పాడగా, అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ పాట ఫస్ట్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ఈ నేపథ్యంలోనే విజయ్ చట్టపరమైన చిక్కుల్లో పడ్డారు. ‘నా రెడీ’ లిరికల్ సాంగ్ లో ఆయన సిగరెట్ తో కనిపించారు. ఈ పాటలో ఆయన పొగాకు ఉత్పత్తులను ప్రోత్సహించేలా ఉన్నారంటూ, నార్కోటిక్స్ నియంత్రణ చట్టం సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఫస్ట్ సింగిల్ లో మద్యం, పొగాకు వినియోగాన్ని ప్రోత్సహించినందుకు చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు తెలిపారు.
ఇచ్చిన మాట తప్పిన విజయ్!
ఇచ్చిన మాటను విజయ్ దళపతి తప్పాడంటూ పీఎంకే పార్టీ నేత రామదాసు ఆరోపించారు. 2012లో తాను నటించే సినిమాల్లో విజయ్ సిగరెట్ తాగే సీన్లలో నటించనని హామీ ఇచ్చారు. కానీ, ‘లియో’ సినిమాలో స్మోకింగ్ సీన్లలో నటించడాన్ని పీఎంకే పార్టీ నేత రామదాసు తప్పుబట్టారు. విజయ్ స్మోకింగ్ సీన్లలో నటించకూడదని ఆయన తేల్చి చెప్పారు. అంతేకాదు, ఈ సినిమాలో సిగరెట్ తో కనిపించడంపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
‘లియో’ సినిమా గురించి..
లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విజయ్ సరసన త్రిష కృష్ణన్ కథానాయికగా కనిపించనుంది. తద్వారా 14 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత అతనితో మళ్లీ జతకట్టింది. సంజయ్ దత్ ఈ చిత్రంలో విజయ్ తండ్రి పాత్రలో నటిస్తున్నారు. ఇందులో గౌతమ్ వాసుదేవ్ మీనన్, అర్జున్ సర్జా, మిస్కిన్, ప్రియా ఆనంద్, మన్సూర్ అలీ ఖాన్, మాథ్యూ థామస్ సహా పలువురు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘లియో’ చిత్రాన్ని ప్రముఖ సెవెన్ స్కీన్స్ బ్యానర్ పై నిర్మాతలు ఎస్ఎస్ లలిత్ కుమార్, జగదీష్ పళానిసామి రూ.200 కోట్లతో తెరకెక్కిస్తున్నారు. ‘ఖైదీ’,‘విక్రమ్’ చిత్రాలతో సెన్సేషన్ క్రియేట్ చేసిన డైరెక్టర్ లోకేశ్ కనగరాజు... ఇప్పటికే విజయ్ తో ‘మాస్టర్’ తెరకెక్కించి హిట్ అందుకున్నారు. దీంతో ‘లియో’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. 2023 అక్టోబర్ 19న ప్రపంచ వ్యాప్తంగా 'లియో' రిలీజ్ కానుంది.
Read Also: యాంకర్ సుమతో ఆడేసుకున్న ‘రంగబలి’ దర్శకుడు - మరో అనుదీప్ వచ్చాడంటూ నెటిజన్స్
Join Us on Telegram: https://t.me/abpdesamofficial