By: ABP Desam | Updated at : 26 Jun 2023 12:24 PM (IST)
Image Credit: Etvteluguindia/You Tube
Suma Adda: బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నో టీవీ ప్రోగ్రామ్స్ లలో ‘సుమ అడ్డా’ కార్యక్రమం ఒకటి. ప్రతీసారి ఎవరొక సెలబ్రెటీలను తీసుకొచ్చి వారితో కొత్త గేమ్స్ ఆడిస్తూ తన స్టైల్ లో ఎంటర్టైన్ చేస్తుంది యాంకర్ సుమ. తాజాగా ఈ కార్యక్రమం కొత్త ఎపిసోడ్ లో ‘రంగబలి’ మూవీ టీమ్ సందడి చేసింది. హీరో నాగశౌర్య, హీరోయిన్ యుక్తి థరేజా, దర్శకుడు పవన్ బసంశెట్టి, నటుడు నోయల్ పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ప్రోమోను ఇటీవలే విడుదల చేశారు. ఆ ప్రోమో వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
‘సుమ అడ్డా’ కర్యక్రమానికి విచ్చేసిన ‘రంగబలి’ మూవీ టీమ్ పంచ్ లతో అలరించింది. ముఖ్యంగా సినిమా దర్శకుడు పవన్ బాసంశెట్టి, హీరో నాగశౌర్య వేసిన పంచ్ లు నవ్వులు పూయించాయి. దర్శకుడు పవన్ సుమను వరుస పంచ్ లతో యాంకర్ సుమను ఆటపట్టించారు. ఇలా ప్రోమో మొత్తం నవ్వులతో నిండిపోయింది. ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ప్రోమో చూసి నెటిజన్స్ సరదాగా స్పందిస్తున్నారు. గతంలో ‘జాతిరత్నాలు’ తర్వాత మళ్లీ ఇలా పంచ్ లతో అలరించింది దర్శకుడు పవనే అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇండస్ట్రీకు మరో అనుదీప్ వచ్చాడంటున్నారు. హీరో నాగశౌర్య కూడా తనదైన స్టైయిల్ లో అలరించారు. టీవీ ప్రోగ్రాంలోనే ఇన్ని పంచ్ లు, కామెడీ ఉంటే ఇక సినిమాలో వేరే లెవల్ లో చేసుంటారు అంటూ చర్చించుకుంటున్నారు నెటిజన్స్. మొత్తంగా ‘సుమ అడ్డా’ కార్యక్రమం ‘రంగబలి’ టీమ్ రాకతో మరింత సందడిగా మారిందనే చెప్పొచ్చు. ఇక ఈ ఫుల్ ఎపిసోడ్ వచ్చే శనివారం ప్రసారం కానుంది.
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోల్లో నాగశౌర్య ఒకరు. అయితే ఆయన గత కొంత కాలంగా సరైన సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నారు. ‘ఛలో’ సినిమా తర్వాత ఆయనకు హిట్ అందలేదనే చెప్పాలి. దీంతో ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఉన్నారట నాగశౌర్య. ఈ నేపథ్యంలో డెబ్యూ దర్శకుడు పవన్ బసంశెట్టితో ‘రంగబలి’ సినిమా చేశారు. ఈ మూవీలో నాగశౌర్య చాలా కొత్తగా కనిపిస్తున్నారు. కామెడీ ఎంటర్టైనర్ గా మూవీ తెరకెక్కినట్లు తెలుస్తోంది. ఇప్పటికే విడుదల చేసిన టీజర్, సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. జూన్ 27 న మూవీ ట్రైలర్ ను రీలీజ్ చేయనున్నారు మేకర్స్. జూలై 7 న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీతో మంచి హిట్ అందుకోవాలని ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నాడు నాగశౌర్య. సినిమా పై కూడా ప్రస్తుతం పాజిటివ్ రెస్పాన్స్ నే వస్తుంది. మరి ‘రంగబలి’ మూవీ ప్రేక్షకులను ఎంతమేరకు ఆకట్టుకుంటుందో చూడాలి. ఈ సినిమా తర్వాత నాగశౌర్య ‘నారి నారి నడుమ మురారి’, ‘పోలీస్ వారి హెచ్చరిక’ సినిమాల్లో కూడా నటిస్తున్నారు. ఈ మూవీని ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.
Also Read: దయచేసి ఆరోపణలు చేయడం ఆపేయండి, కేపీ చౌదరి డ్రగ్స్ కేసుతో సంబంధం లేదు - సురేఖా వాణి
Trisha: ‘యానిమల్’ చిత్రానికి త్రిష షాకింగ్ రివ్యూ - నెటిజన్స్ ట్రోల్ చేయడంతో..
Nindu Noorella Saavasam December 4th Episode: ఘోర ప్రశ్నకి దొరికిన సమాధానం.. తప్పంతా నాదే అంటూ ఫీలవుతున్న అరుంధతి!
Santosham Film Awards: 'సంతోషం' అవార్డుల్లో కన్నడ స్టార్స్‌కు అవమానం - కొండేటిపై గరం గరం
Guppedantha manasu december 4th Episode: ‘గుప్పెడంత మనసు’ సీరియల్ : శైలేంద్రను ఇంటరాగేషన్ చేస్తానన్న ముకుల్ - తన నాటకాన్ని దేవయానికి చెప్పిన శైలేంద్ర
Prema Entha Madhuram December 4th Episode: 'ప్రేమ ఎంత మధురం' సీరియల్: భార్యని చూసిన ఆనందంలో ఆర్య - వాళ్లను చంపేందుకు ఆలయంలోకి ప్రవేశించిన రౌడీలు
Cyclone Michaung: తుపాను సహాయక చర్యలపై సీఎం జగన్ సమీక్ష- ప్రజలకు ఇబ్బంది రావద్దని చంద్రబాబు సూచన
JC Prabhakar Reddy: తాడిపత్రిలో హై టెన్షన్! జేసీని అడ్డుకున్న పోలీసులు
CLP Meeting News: గచ్చిబౌలిలో సీఎల్పీ మీటింగ్, సీఎం ఎంపికపై తీర్మానాలు, ప్రమాణ స్వీకారం నేడే ఉంటుందా?
Mizoram Election Result 2023: మిజోరంలో ఎగ్జిట్ పోల్ అంచనాలు తలకిందులు, అధికార ప్రభుత్వానికి షాక్!
/body>