By: ABP Desam | Updated at : 24 May 2023 05:10 PM (IST)
రోడ్ ట్రిప్‌లో అజిత్ కుమార్, సుగత్ ( Image Source : wanderlustsatpathy Instagram )
Ajith Kumar: ప్రముఖ తమిళ హీరో అజిత్ కుమార్ ఇటీవలే నేపాల్, భూటాన్‌ల్లో బైక్ టూర్ పూర్తి చేశారు. ఈ బైక్ టూర్‌లో తర్వాతి స్టేజ్ నవంబర్‌లో ప్రారంభం కానుంది. తనతో పాటు నేపాల్‌లో రైడ్ చేసిన సుగత్ సత్పతి అనే బైక్ రైడర్‌ను సూపర్ గిఫ్ట్‌తో సర్‌ప్రైజ్ చేశారు. రూ.12.5 లక్షల విలువైన సూపర్ బైక్‌ను గిఫ్ట్ ఇచ్చాడు. అజిత్ లేటెస్ట్ నేపాల్ టూర్‌ను సుగత్ ఆర్గనైజ్ చేశారు. దీంతో అతనికి బైక్‌ను గిఫ్ట్‌గా ఇచ్చారు.
ఈ నెల ప్రారంభంలోనే అజిత్ భారతదేశంలో తన బైక్ టూర్‌ను పూర్తి చేశారు. దీంతోపాటు నేపాల్, భూటాన్‌ల్లో ఆయన బైక్ టూర్ చేశారు. అజిత్‌కు బైక్ టూర్‌ను రెండు సార్లు ఆర్గనైజ్ చేసినట్లు సుగత్ ఇన్‌స్టాగ్రామ్‌లో రివీల్ చేశారు.
‘2022 సంవత్సరంలో నాకు అదృష్టం కలిసొచ్చింది. తమిళ సినిమా ఇండస్ట్రీలోని సూపర్ స్టార్‌ల్లో ఒకరైన అజిత్ కుమార్‌ను కలిశాను. ఆయనకు బైక్ రైడింగ్ అంటే చాలా ఇష్టం. అడ్వెంచర్ బైక్‌ను కూడా మంచి క్లాస్‌తో డ్రైవ్ చేస్తారు. ఆయన ఈశాన్య రాష్ట్రాల టూర్‌ను ఆర్గనైజ్ చేశాను. అజిత్‌తో పాటు నా పాత డ్యూక్ 390 బైక్‌తో వెళ్లాను. అది పూర్తయ్యాక నేపాల్, భూటాన్ టూర్ కూడా నాతోనే చేస్తానని చెప్పారు. అది అజిత్ వరల్డ్ టూర్ ప్లాన్‌లో భాగం. ఆ టూర్ మే 6వ తేదీన పూర్తయింది. ఈ రైడ్‌లో ఎన్నో మర్చిపోలేని జ్ఞాపకాలు ఉన్నాయి. చాలా సూర్యోదయాలు, సూర్యాస్తమయాలు చూశాం.’ అని సుగత్ తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పేర్కొన్నారు.
‘ఇక్కడ ఉన్న బీఎండబ్ల్యూ ఎఫ్850జీఎస్ నాకెంతో ప్రత్యేకమైనది. దీన్ని అజిత్ గిఫ్ట్‌గా ఇచ్చారు. అవును... దాన్ని ఆయన నాకు ఎంతో ప్రేమగా కానుకగా ఇచ్చారు. ఆయన రెండో సారి కూడా ఆలోచించలేదు. ఈ అందమైన ఎఫ్850జీఎస్ నా దగ్గర ఉండాలని ఆయన అనుకున్నారు. దీంతో ప్రపంచాన్ని చుట్టేయచ్చు. నా జీవితంలో ఆయన పాత్ర గురించి చెప్పాలంటే మాటలు సరిపోవు. ఆయన నన్ను ఒక అన్నలాగా చూసుకున్నారు. నువ్వు బెస్ట్ అన్నా...’ అని కూడా అందులో రాశారు.
బీఎండబ్ల్యూ ఎఫ్850జీఎస్ ధర రూ.12.5 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. ఇటీవలే ‘తునివు (తెలుగులో తెగింపు)’ అనే సినిమాలో నటించిన అజిత్ కుమార్ త్వరలో తన తర్వాతి సినిమా ‘విడాముయర్చి’ని ప్రారంభించనున్నారు.
Gruhalakshmi May 29th: తప్పు తెలుసుకున్న భాగ్య, తులసికి సపోర్ట్- రాజ్యలక్ష్మిని రోకలి బండతో కొట్టిన దివ్య
Bro Movie Update: మామా అల్లుళ్ల పోజు అదిరింది ‘బ్రో’- పవన్, సాయి తేజ్ మూవీ నుంచి సాలిడ్ పోస్టర్ రిలీజ్!
The Kerala Story: కమల్ హాసన్ కామెంట్స్‌కు ‘ది కేరళ స్టోరీ’ డైరెక్టర్ కౌంటర్
Krishna Mukunda Murari May 29th: తన ప్రేమకి ఆయుషు తీరిపోయిందని గుండెలు పగిలేలా ఏడుస్తున్న కృష్ణ
Guppedanta Manasu May 29th: జగతిని దోషిని చేసి వెళ్ళిపోయిన వసు- గుండెనొప్పితో కుప్పకూలిన సుమిత్ర, ఇక రిషిధార కలవనట్టేనా?
Harish Rao: ప్రకృతి వైపరీత్యాల కన్నా ప్రతిపక్షాలు ప్రమాదం - హరీశ్ రావు ఎద్దేవా
కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో సీఎం జగన్ భేటీ- 40 నిమిషాలు సాగిన సమావేశం
Karnataka Cabinet: మంత్రుల శాఖలను ప్రకటించిన సిద్ధరామయ్య, డీకే శివకుమార్ కు ఏ శాఖో తెలుసా?
Value Buys: మార్కెట్ నుంచి డబ్బులు సంపాదించే మార్గం!, ఇలాంటి 'వాల్యూ బయ్స్' మీ దగ్గర ఉన్నాయా?