News
News
X

Thaggedele Trailer: నవీన్ చంద్ర 'తగ్గేదేలే' ట్రైలర్ వచ్చేసింది, రిలీజ్ కూడా అప్పుడే ?

నవీన్ చంద్ర తాజాగా నటించిన సినిమా 'తగ్గేదేలే' ఈ సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. ప్రస్తుతం మూవీ నుంచి క్రేజీ అప్డేట్ వచ్చేసింది.

FOLLOW US: 

న విలక్షణమైన నటనతో తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు నటుడు నవీన్ చంద్ర. కెరీర్ మొదట్లో పలు సినిమాల్లో నటించిన నవీన్ కు అంతగా గుర్తింపు రాకపోయినా 'అందాల రాక్షసి' సినిమాతో మంచి గుర్తింపు వచ్చింది. ఒక పక్క సపోర్టింగ్ రోల్స్, విలన్ వేషాలు చేస్తూనే మరోపక్క హీరోగా కూడా నటిస్తూ, తనలోని విలక్షణ నటనను ప్రేక్షకుల ముందు ప్రదర్శిస్తున్నారు హీరో నవీన్ చంద్ర. నవీన్ చంద్ర తాజాగా నటించిన సినిమా 'తగ్గేదేలే' ఈ సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. ప్రస్తుతం మూవీ నుంచి క్రేజీ అప్డేట్ వచ్చేసింది. సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేసింది మూవీ టీమ్. ట్రైలర్ తో పాటు సినిమా రిలీజ్ డేట్ ను కూడా అనౌన్స్ చేశారు. 

'తగ్గేదేలే' సినిమా గురించి ఏడాది నుంచే వార్తలు వస్తున్నాయి. అప్పట్లో టీజర్ ను రిలీజ్ చేసింది మూవీ టీమ్. ఆ టీజర్ కు మంచి పాజిటివ్ టాక్ రావడంతో సినిమాపై ఆసక్తి నెలకొంది. అయితే ఈ సినిమా విడుదలకు సంబంధించి చాలా రోజుల నుంచి కొత్త అప్డేడ్ రాలేదు. ఈ మధ్యలో సినిమాకు సంబంధించిన కొన్ని పాటల్ని విడుదల చేశారు. అయితే ఎట్టకేలకు సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేశారు. ట్రైలర్ లో నవీన్ మరోసారి తన నటనతో ఆకట్టుకున్నాడు. ట్రైలర్ ఓ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సీన్ తో మొదలవుతుంది. ట్రైలర్ చూస్తుంటే సినిమా మొత్తం ఓ అమ్మాయి చుట్టూ సాగే కథలా కనిపిస్తోంది. క్రైమ్ సస్పెన్స్ త్రిల్లర్ లా సినిమా ఉండబోతుందని ట్రైలర్ లో క్లియర్ గా కనిపిస్తోంది. మొత్తంగా 'తగ్గేదేలే' ట్రైలర్ టైటిల్ కు తగ్గట్టుగానే ఉందనిపిస్తోంది. 

నవీన్ చంద్ర ప్రతీ సినిమాలో తన నటనలో కొత్త కోణాన్ని చూపిస్తూ ఉంటారు. ఆయన గత సినిమాలు చూస్తే అలాగే అనిపిస్తుంది. అందులోనూ క్రైం, సస్పెన్స్ జోనర్ సినిమాలు నవీన్ కు బాగా సూట్ అవుతాయనే టాక్ ఉంది. ఈ సినిమా కూడా అదే జోనర్ లా ఉందని తెలుస్తోంది. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి. నవీన్ నటనతో అందర్నీ ఆకట్టుకుంటున్నా సోలో హీరోగా అతనికి ఇప్పటి వరకూ సరైన హిట్ పడలేదు. ఆ హిట్ కోసమే నవీన్ ఎదురు చూస్తున్నాడు. మరి ఇప్పుడీ 'తగ్గేదేలే' సినిమా నవీన్ కు మంచి బ్రేక్ ఇచ్చి కమర్షియల్ హీరోగా నిలబెడుతుందో లేదో చూడాలి. నవీన్ ఇటు సినిమాలతో పాటు అటు వెబ్ సిరీస్ లలోనూ నటిస్తున్నాడు. 

ఈ సినిమాకు 'దండుపాళ్యం' ఫేమ్ శ్రీనివాసరాజు దర్శకత్వం వహిస్తున్నారు. హీరోయిన్ గా దివ్య పిళ్ళై కనిపించనున్నారు. అనన్య సేన్ గుప్తా, రవి శంకర్, రాజా రవీందర్, నాగ బాబు, అయ్యప్ప శర్మ, పృథ్వీ తదితరులు తెరపై కనిపించనున్నారు. ఇక భద్ర ప్రొడక్షన్స్ పతాకంపై మొదటి చిత్రంగా 'తగ్గేదేలే' సినిమా ను నిర్మిస్తున్నారు. ఈ సినిమా నవంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది.

News Reels

Also Read: బాలయ్య వర్సెస్ చిరు - అల్టిమేటం జారీ చేసిన డిస్ట్రిబ్యూటర్లు?

Published at : 27 Oct 2022 06:33 PM (IST) Tags: Naveen Chandra Taggedele Taggedele trailer

సంబంధిత కథనాలు

Repeat Movie Review - 'రిపీట్' రివ్యూ : నవీన్ చంద్ర, మధుబాల సినిమా ఎలా ఉందంటే?

Repeat Movie Review - 'రిపీట్' రివ్యూ : నవీన్ చంద్ర, మధుబాల సినిమా ఎలా ఉందంటే?

Bigg Boss 6 Telugu: ఆదిరెడ్డికి టిక్కెట్ టు ఫినాలే? ఫైనల్‌కు దూసుకెళ్లిన సామాన్యుడు?

Bigg Boss 6 Telugu: ఆదిరెడ్డికి టిక్కెట్ టు ఫినాలే? ఫైనల్‌కు దూసుకెళ్లిన సామాన్యుడు?

Actress Sai Pallavi: సినిమాలకు సాయి పల్లవి గుడ్ బై? ప్రజలకు మేలు చేయడానికేనట!

Actress Sai Pallavi: సినిమాలకు సాయి పల్లవి గుడ్ బై? ప్రజలకు మేలు చేయడానికేనట!

Liger Money laundering case : విజయ్ దేవరకొండను డిస్ట్రిబ్యూటర్లు వదిలేసినా ఈడీ వదల్లేదు

Liger Money laundering case : విజయ్ దేవరకొండను డిస్ట్రిబ్యూటర్లు వదిలేసినా ఈడీ వదల్లేదు

Jai Bhim Sequel: త్వరలో ‘జై భీమ్’కు సీక్వెల్? మరో కొత్త కేసుతో రానున్నారా?

Jai Bhim Sequel: త్వరలో ‘జై భీమ్’కు సీక్వెల్? మరో కొత్త కేసుతో రానున్నారా?

టాప్ స్టోరీస్

Bandi Sanjay: కేసీఆర్ ఇంట్లో సీఎం పీఠం కోసం లొల్లి స్టార్ట్ అయింది: బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Bandi Sanjay: కేసీఆర్ ఇంట్లో సీఎం పీఠం కోసం లొల్లి స్టార్ట్ అయింది: బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

AP Police Constable Application: ఏపీలో 6,100 కానిస్టేబుల్ పోస్టులు, ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ - చివరితేది ఎప్పుడంటే?

AP Police Constable Application: ఏపీలో 6,100 కానిస్టేబుల్ పోస్టులు, ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ - చివరితేది ఎప్పుడంటే?

30 నెలల్లో బందరు పోర్ట్ సిద్ధం చేస్తాం: మాజీ మంత్రి పేర్ని నాని

30 నెలల్లో బందరు పోర్ట్ సిద్ధం చేస్తాం: మాజీ మంత్రి పేర్ని నాని

England Team Virus Attack: గుర్తుతెలియని వైరస్ బారిన పడ్డ ఇంగ్లండ్ క్రికెటర్లు- పాక్ తో తొలి టెస్ట్ వాయిదా!

England Team Virus Attack: గుర్తుతెలియని వైరస్ బారిన పడ్డ ఇంగ్లండ్ క్రికెటర్లు- పాక్ తో తొలి టెస్ట్ వాయిదా!